
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశనే మిగిల్చిందని, కొన్ని శాఖలకు మాత్రమే అరకొర నిధులను కేటాయించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా.. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment