
మంకమ్మతోట (కరీంనగర్): పంటలు ఎండిపోయి.. దిగుబడి రాక.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. వారిని ఆదుకోవాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని హితవు పలికారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలని, లేకుంటే రైతుల పక్షాన భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బెజ్జంకి అనిల్‌కుమార్, ప్రపుల్లా రెడ్డి, సంజీవరావు, మతీన్ ముజాహిద్దీన్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ పాల్గొన్నారు.
వివాహ వేడుకకు హాజరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అక్కెనపెల్లి కుమార్ కూతురు అక్షిత వివాహం సురేశ్‌తో శనివారం నగరంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు.
Comments
Please login to add a commentAdd a comment