
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పలు పదవులకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొండూరు చంద్రశేఖర్‌ను నియమించామన్నారు. పార్టీ వనపర్తి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా సి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వొడ్ల సుమంతాచారి, కార్యదర్శులుగా రాచురి ఆంజనేయులు, జె.రవికుమార్‌లను నియమించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment