మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో స్కీములను మించిన భూస్కాములు తప్ప మరేమీ కనబడటంలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తే చుక్క నీరు లేదన్నారు. కమీషన్ల కోసం నీటి ప్రాజెక్టులను భారీగా తలపెట్టిందని, దాన్ని మించి భూస్కాములు బయటకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు సాయినా థ్‌రెడ్డి, సేవాదల్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్ రవికుమార్, ఐటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథాచారి పాల్గొన్నారు.