సాక్షి, హైదరాబాద్: అపరభగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులలో రోగులకు పండ్ల పంపిణీ, అనాథలకు వస్త్రాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment