vardanthi
-
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్: గల్ఫ్ దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్‌లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కువైట్ కన్వినర్ ఎం.బాలిరెడ్డి ఆధ్వర్యంలో కువైట్‌లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుబాయ్ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్సార్సీపీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కంటే మరో రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో గల్ఫ్ కో కన్వినర్ గోవిందు నాగరాజు, యూఏఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు సోమిరెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ ఎన్.మహేశ్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఖతార్ కో కన్వినర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో రక్తదానం, అన్నదానం ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం, ఎంతైనా సాయం చేసే గుణం డాక్టర్ వైఎస్సార్‌ది అని ఏపీ ఎన్ఆర్టీ సోసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి కొనియాడారు. న్యూజిల్యాండ్ దేశం ఆక్లాండ్ నగరంలోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వెంకట్ మేడపాటి ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న ఎంతో మందికి ఎన్నో రకాలుగా వైఎస్సార్ సాయం చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం కల్పించి.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేలా చేసిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. అనంతరం రక్తదానం, అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ కన్వినర్ బుజ్జె బాబు, ప్రాంతీయ కోఆర్డినేటర్ ఆనంద్ యెద్దుల, పార్టీ ప్రతినిధులు సుస్మిత చిన్నమల్రెడ్డి, సుమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసివల్లి, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ పాల్గొన్నారు. -
పాలకుడు ఎలా ఉండాలో చూపిన నాయకుడు వైఎస్ఆర్: సజ్జల
-
కృష్ణా జిల్లా: అంపాపురంలో మహానేత వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమం
-
BR Ambedkar: స్మృతివనం చరిత్రాత్మకం
Ambedkar Death Anniversary 2021: సమాజ దిశా నిర్దేశాన్ని ప్రభావితం చేసి, ఒక సమున్నత ఆశయం కోసం కృషి చేసిన యుగపురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. అనేక వివక్షలకు గురైనా తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కర్తగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. ఇరవై మిలియన్ ఓట్లతో ‘ద గ్రేటెస్ట్ ఇండియన్’గా గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్.. అంబేడ్కర్‌ను ‘భూమి ఉన్నంతకాలం దేశ అత్యున్నత ఆర్థికవేత్త’గా పేర్కొన్నారు. అమర్త్య సేన్ ‘భారత ఆర్థిక రంగ పితామహుడి’గా అభివర్ణించారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఆఫ్ వెస్ట్రన్ కెనడా ఆయన జయంతిని ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని నిశ్చయించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలోనూ, న్యూయార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలోనూ, బ్రాండియస్ యూనివర్సిటీలలోనూ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. భారత పార్లమెంట్ ఆయన విగ్రహాన్ని సెంట్రల్ హాల్లో ప్రతిష్ఠించి గౌరవించింది. అటువంటి మహనీయునికి స్మృతివనం నిర్మించడం అంటే ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు కంకణబద్ధులు కావడమే. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదాన్‌లో (పి.డబ్లు్య.డి. గ్రౌండ్స్) స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అంబేడ్కర్ అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇరవై ఎకరాల స్ధలంలో నిర్మిస్తున్న ఈ స్మృతివనంలో 125 అడుగుల విగ్రహంతో పాటు ఆయన జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు మ్యూజియం, గ్యాలరీ, ఇంకా పుస్తక పఠనంతో జ్ఞాన సముపార్జన చేసిన అంబేడ్కర్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులతో చర్చించి 2022 ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకుగానూ 249 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ స్మృతివనం చరిత్రాత్మకం కానున్నది. గత ప్రభుత్వం నగరానికి దూరంగా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు చిత్తశుద్ధి లోపం కారణంగా ఐదేళ్ల కాలంలో అతీగతీ లేకుండా పోయింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2020 జూలై 8న శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ముఖ్యమంత్రి దళిత, ఆదివాసీ, అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.. చిరు ఎమోషనల్ ట్వీట్
కామెడీతోనే కాదు విలనిజం కూడా చూపించి ఆకట్టుకున్న గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వు ఆగదు. అప్పట్లో అల్లు రామలింగయ్య నటిస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. అంతాల తన కామెడీ టైమింగ్‌తో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించాడు. నేడు(జూలై 31) అల్లు రామలింగయ్య వర్ధంతి. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ ..’అంటూ గతంలో అల్లు రామలింగయ్య ఫోటోకి నివాళులర్పిస్తున్న ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
సాక్షి, అమరావతి: అంబేద్కర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు. మన దేశానికి భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్అని తెలిపారు. ఎవరు ఆడిగారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి లేఖ రాశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన పరిధి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు లాయర్ల సలహా తీసుకోమని ఆయన గవర్నర్‌కి చెప్పటం ఏమిటని మండిపడ్డారు. గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎలాచేయాలనే దానిపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. రమేష్ కుమార్‌ను సలహా ఇవ్వమని గవర్నర్ ఆడిగారా అని ప్రశ్నించారు. చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలకు నీకేమి సంబంధం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయనపై ఎలా విశ్వాసం ఉంటుందని, ప్రతిపక్షం మౌత్ పీస్‌లా మారిపోయారని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి ఏమిటో తెలుసుకుని పని చేయాలని హితవు పలికారు. -
అంబేద్కర్‌కు బండి సంజయ్ నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అన్నారు. ఆదివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఆయన విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే తరాలకు న్యాయం జరగాలి చాటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ఆయన జయంతి, వర్ధంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ చరిత్ర భావి తరాలకు చెప్పాలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయితే అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజున బయటికి రాలేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. మొన్ననే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, అంబేద్కర్‌ను స్మరించుకుంటే కనీసం జ్ఞానమైన వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. -
ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ బలహీనవర్గాలకి అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకి ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలె అని గుర్తు చేశారు. పూలే ఆశయాలని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాలని బ్యాక్‌బోన్‌గా చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పధకాలతో బలహీన వర్గాలకి అండదండగా నిలబడిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. చదవండి: మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే బలహీనవర్గాలకి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి లాంటి సంక్షేమ పధకాలతో సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సీంఎ జగన్ బీసీ మహిళల జీవితాలలో వెలుగులు నింపారన్నారని తెలిపారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీలు ఉన్నత చదువులు అభ్యసించడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడిన సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. బలహీనవర్గాలకి అండగావుంటున్న తమ ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పూలె ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. -
కెనడాలో వైఎస్సార్‌కు ఘన నివాళి
-
కెనడాలో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగా ప్రాంతంలో వైఎస్సార్సీపీ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కెనడా ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొంతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కృష్ణారెడ్డి, ఆర్.సుబ్రహ్మణ్యం, భూషన్ తదితరులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మహానేతా నిను మరువలేం..
సాక్షి, నెట్వర్క్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోని ఆయన అభిమానులు వైఎస్ సేవలు గుర్తు చేసుకున్నారు. వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదాన, ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని శాసనమండలి విపక్షనేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ పేదలను ఆదుకోవాలని ఆయన నిరంతరం తపన పడేవారన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలని చెప్పారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని కలలు కన్న మహానుభావుడు వైఎస్సార్ అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పి. సుధాకర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పద్మజ, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: అపరభగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులలో రోగులకు పండ్ల పంపిణీ, అనాథలకు వస్త్రాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
మరో నన్నయ.. మధునాపంతుల
వర్ధంతి సభలో ప్రముఖుల నివాళులు రాజమహేంద్రవరం కల్చరల్ : ఈ గడ్డపై నడయాడిన మరో నన్నయ మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఆయన ఋషి తుల్యుడని సాహితీవేత్త గొడవర్తి నరసింహాచార్య అన్నారు. మధునాపంతుల ట్రస్టు సౌజన్యంతో ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సాహితీ శరత్ కౌముది ఉత్సవాలలో భాగంగా సోమవారం జరిగిన మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి వర్ధంతి సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మధునాపంతుల రచించిన ఆంధ్ర రచయితలు గ్రంథ ప్రాశస్త్యాన్ని నరసింహాచార్య వివరించారు. అందులో 113 మంది తెలుగు కవుల జీవిత చరిత్రలను మధునాపంతుల స్పష్టంగా వివరించారని పేర్కొన్నారు. ‘మనం సాధారణంగా గురజాడ వేంకట అప్పారావు అంటాం. ఇది సరి కాదు. గురుజాడ వేంకట అప్పారావు అని అనాలి. ఆ మహాకవి ఇంటిపేరు గురుజాడ అని మధునాపంతుల సిద్ధాంతీకరించారు’ అని ఆయన అన్నారు. సాక్షి రచనల పానుగంటి లక్ష్మీ నరసింహారావుకు షష్టిపూర్తి వేడుకలు జరపాలన్న ఆలోచనలు తెలుగువాడికి రాకపోవడం దురదృష్టమని మధునాపంతుల పేర్కొన్నారన్నారు. ‘గిడుగు రామ్మూర్తి పంతులు మహాబధిరుడు. ప్రతిపక్షులు ఎన్ని విమర్శలు చేసినా, ఆయన లక్ష్యపెట్టలేద’ని మధునాపంతుల గిడుగు రామ్మూర్తి పంతులు మీద రచించిన వ్యాసంలో తెలిపారని నరసింహాచార్య వివరించారు. ముందుగా కళాశాల ప్రాంగణంలోని మధునాపంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తనయుడు మధునామూర్తి, ఆయన తమ్ముడు సూరయ్యశాస్త్రి కుమారుడు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, తెలుగురథం వ్యవస్థాపకుడు కొంపెల్ల శర్మ, పీవీబీ శర్మ, కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్, సంస్కృత ఉపన్యాసకురాలు కామేశ్వరి పాల్గొన్నారు.