
వైఎస్సార్ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగా ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కెనడా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొంతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణారెడ్డి, ఆర్.సుబ్రహ్మణ్యం, భూషన్ తదితరులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.