
సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment