సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
మరోవైపు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment