సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ చౌరస్తా కేంద్రంగా ఈ నెల 14న (బుధవారం) ఉదయం 6 నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహూతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.
కర్బలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్ క్లబ్ వద్ద నుంచి కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ స్టాచ్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి.
సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాచ్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. సాధూరామ్ కంటి ఆస్పత్రి నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
(చదవండి: బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం )
Comments
Please login to add a commentAdd a comment