
అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న ముఖ్య సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హాజరుకావాలని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై చర్చించనున్నారు.
వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ ఫాజిల్ అహ్మద్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియమించారు. రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శులుగా అల్లె అనిల్ కుమార్, గుండ తిరుమలయ్యను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment