నోట్ల కరువుతో రైతుల విలవిల | formers suffering with big notes exchange | Sakshi
Sakshi News home page

నోట్ల కరువుతో రైతుల విలవిల

Published Sat, Nov 19 2016 2:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నోట్ల కరువుతో రైతుల విలవిల - Sakshi

నోట్ల కరువుతో రైతుల విలవిల

రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుంచి రైతులు తేరుకోకముందే, ఇప్పుడు పెద్ద ‘నోట్ల కరువు’రైతులను విలవిలలాడేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

30 శాతం తగ్గిన వ్యవసాయ కొనుగోళ్లు
ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుంచి రైతులు తేరుకోకముందే, ఇప్పుడు పెద్ద ‘నోట్ల కరువు’రైతులను విలవిలలాడేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా పెద్ద నోట్ల రద్దు దెబ్బ రైతుల గుండెల్ని తాకిందని, రాష్ట్రంలో పెసలు, పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై పెద్దనోట్ల రద్దు ప్రభావం 30 శాతం పడిందని అన్నారు.

నల్లధనం వెలికితీత ఆహ్వానించదగ్గ పరిణామమేనని, అరుుతే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకోకపోవడం గురించే తాము మాట్లాడుతున్నామన్నారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, నోట్ల దెబ్బ పేదలను, మధ్యతరగతి వారిని బాగా ఇబ్బందులకు గురి చేసిందని, ఇప్పటికీ ఆ సమస్య నుంచి ప్రజలు బయటపడలేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.96 లక్షల మంది ‘ఆసరా’లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.395.60 కోట్లు విడుదల చేసిందని, కానీ సర్కారు నిధులిచ్చి వారం రోజులవుతున్నా.. లబ్ధిదారుల చేతికి ఫించను సొమ్ము చేరలేదని చెప్పారు. రూ.500 నోట్లు ఇంకా అందుబాటులోకి రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకు ల్లో ఇస్తున్న రూ.2 వేల కొత్త నోట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్నారు. నేటికీ బ్యాం కులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద జనం బారులు తీరుతున్నారని, చిల్లర సమస్యతో చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయన్నారు. 

 సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి..
కొత్తగా ఎన్నికై న పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, క్రమశిక్షణతో నడుచుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రజల్లోకి చొరవగా వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉన్న వారినే నియోజకవర్గ కన్వీనర్లుగా నియమించాలన్నారు. పార్టీ జిల్లా కమిటీల ఎంపికను పూర్తి చేయాలని, మండల కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో మండల కమిటీల్లో ప్రతి గ్రామం నుంచి ఐదుగురికి చోటు కల్పించాలని తెలిపారు. జిల్లాల భౌగోళిక పరిస్థితుల్ని బట్టి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యపై జిల్లా స్థారుు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

ఎవ్వరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా పార్టీ విధివిధానాల ప్రకారమే చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ముందుకు సాగాలన్నారు. పార్టీ జిల్లా అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్‌రెడ్డి, బోరుున్‌పల్లి శ్రీనివాస్‌రావుతో పాటు జిల్లాల అధ్యక్షులు బొడ్డు సారుునాథ్‌రెడ్డి(జీహెచ్‌ఎంసీ), బి.సుధాకర్‌రెడ్డి(రంగారెడ్డి), బి.శ్రీనివాస్‌రెడ్డి(మేడ్చల్ మల్కాజ్‌గిరి), జి. శ్రీధర్‌రెడ్డి(సంగారెడ్డి), టి.జగదీశ్వర్ గుప్తా(సిద్దిపేట్), డాక్టర్ కె.నగేష్(కరీంనగర్), సెగ్గం రాజేష్(పెద్దపల్లి), ఎ.రాజీవ్‌రెడ్డి(జగిత్యాల), చొక్కాల రాము(రాజన్న సిరిసిల్ల), వొడ్నాల సతీష్(మంచిర్యాల) పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
మంచిర్యాల జిల్లాకు చెందిన డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు, న్యాయవాది ప్రజ్యోత్ సహా 30 మంది నాయకులు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థారుు నుంచి బలోపేతం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు వొడ్నాల సతీష్, సెగ్గం రాజేశ్, మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి రాంబాబు, జావీద్, సలీం, వంశీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement