
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని గట్టు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment