త్వరలో వైఎస్సార్‌ జనచైతన్య బస్సుయాత్ర  | YSR JanaChaithanya Yatra will be soon | Sakshi
Sakshi News home page

త్వరలో వైఎస్సార్‌ జనచైతన్య బస్సుయాత్ర 

Published Tue, Apr 17 2018 3:05 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSR JanaChaithanya Yatra will be soon - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: త్వరలో రాష్ట్రంలో వైఎస్సార్‌ జనచైతన్య బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి కరీంనగర్‌ జిల్లా వరకు పది రోజుల పాటు వైఎస్సార్‌ జనచైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విధానాలను కొనసాగించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ పథకాలను కొనసాగించాలని  చేపట్టనున్న జనచైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలంలోని అలంకృత గార్డెన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షుల సమావేశంలో గట్టు ప్రసంగించారు. రాష్ట్రంలో యాత్ర విజయ వంతం కావడానికి వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 

అందరి శ్రేయస్సే లక్ష్యంగా మ్యానిఫెస్టో 
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)కు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బస్సు యాత్రలో ఉపన్యాసకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు.    

బస్సు యాత్ర కమిటీలివే... 
- జనచైతన్య బస్సు యాత్ర కమిటి చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా మహేందర్‌రెడ్డి, కె. శివ కుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయి నాథ్‌రెడ్డి, బి.అనిల్‌కుమార్, కె.అమృతా సాగర్, డాక్టరు ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, వెల్లాల రామ్మోహన్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, శాంతికుమార్, బండారు వెంకటరమణ 
- క్రమశిక్షణ సంఘం(కమిటీ) చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా అనిల్, వెల్లాల రామ్మోహన్, బి.సంజీవరావు, మహేందర్‌రెడ్డి. 
- రూట్‌మ్యాప్‌ కమిటీ చైర్మన్‌గా వెల్లాల రామ్మోహన్, సభ్యులుగా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, ఎన్‌.రవికుమార్, బి.వెంకటరమణ, కుసుమ కుమార్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, టి. జగదీశ్వర్‌ గుప్తా. ఆర్‌. చంద్రశేఖర్, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ. 
- కరపత్రాల కమిటీ చైర్మన్‌గా బి.అనిల్‌ కు మార్, సభ్యులుగా శాంతికుమార్, భగవంత్‌రెడ్డి, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, ఎన్‌.రవికుమార్‌ 
- పోస్టర్‌ కమిటీ చైర్మన్‌గా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, సభ్యులుగా ఎం. భగవంత్‌రెడ్డి, బి. బ్రహ్మానందరెడ్డి. 
- లీగల్‌ అనుమతుల కమిటీ ఇన్‌చార్జిగా ఎం. సరోజ్‌రెడ్డి,  
బస్సు యాత్ర సాంస్కృతిక (పాటల)కమిటీ ఇన్‌చార్జిగా ఎన్‌.రవికుమార్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement