► రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు
► పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన నేతలు
కాజీపేట రూరల్: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డిని వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా కలిశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ఈర్మియా తెలిపారు. ఈ నెల 8, 9 వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలకు వరంగల్ జిల్లా నుంచి వచ్చే నాయకుల వివరాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శులు జన్ను విల్సన్ రాబర్ట్, నెమలిపురి రఘు, కార్యదర్శి బొమ్మగాని కార్తిక్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్ ఉన్నారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఎంబీసీ సంఘం నాయకుడు మడేలు వీరన్న, జిల్లా వాకర్స్ సంఘం నాయకుడు రామనంద సాగర్, స్వచ్ఛంద సంస్థ నాయకుడు తిమోతి వైఎస్సార్ సీపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు ఈర్మియా తెలిపారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
Published Wed, Jul 5 2017 9:38 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement
Advertisement