
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించాల్సిన నిరుద్యోగ గర్జన సభను వాయిదా వేసినట్లు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ మార్పును అంతా అర్థంచేసుకోవాలని కోరారు. ఈ నెల 24న జరగనున్న సభకు నిరుద్యోగులు, పార్టీ రాష్ట్ర, అన్ని జిల్లాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment