వైఎస్‌ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే..
మిడ్‌మానేరు ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. మిడ్‌మానేరుకు పడిన గండిని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిడ్‌మానేరు ప్రాజెక్టుకు పడిన గండికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైఎస్‌ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మాన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి.. నిర్వాసితులు కోరినట్టు పరిహారం చెల్లించాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన మిడ్‌మానేరు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు శివకుమార్, బోయినిపల్లి శ్రీనివాసరావు, మహేందర్‌రెడ్డి, మతిన్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.