నల్లగొండ లోక్‌సభ ఉపఎన్నికకు సిద్దం: గట్టు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభకు ఉప ఎన్నికలు వస్తే పోటీకి సిద్దమని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ లబ్ది కోసమే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని విమర్శించారు. రైతు కమిటీల జీవో 39ను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామీణ రాజకీయాన్ని కలుషితం చేసేందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.