హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికలలో జిల్లాలోని 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలలో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తార న్నారు. ఆదిశగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకుల సహకారంతో త్వరలో సంస్థాగత కమిటీల నియామకాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందన్నారు. వైఎస్సార్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు తిరిగి వైఎస్సార్ స్వర్ణయుగ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని, అలాంటి వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో జిల్లా కన్వీనర్‌గా నియమించారని, అందుకు అనుగుణంగా పని చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు అయిల వెంకన్నగౌడ్, శేఖర్‌రెడ్డి, పోతుల జ్ఞానయ్య, పుల్లారెడ్డి, ఆదినారాయణరెడ్డి, కోడిమల్లయ్య యాదవ్, భిక్షంరెడ్డి, ముత్తయ్య. పి.లక్ష్మమ్మ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
Published Mon, Dec 16 2013 3:53 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement