
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఏర్పాటై మార్చి 12 నాటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని, 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. దీన్ని పునస్కరించుకొని లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తప్పక పాల్గొనా లని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment