CM KCR Serious Warning To Sitting MLAs At Party Foundation Day Meeting - Sakshi
Sakshi News home page

CM KCR: ‘దళితబంధు’లో ఎమ్మెల్యేల అవినీతి.. కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌

Published Thu, Apr 27 2023 6:44 PM | Last Updated on Thu, Apr 27 2023 7:47 PM

CM KCR Warning To Sitting MLAs At Party Foundation Day Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. లేకుంటే నష్టపోతారని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

నేతలకు క్లాస్‌పీకిన కేసీఆర్‌
ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే.. నేతలకు క్లాస్‌ పీకారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. నియోజవర్గంలో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. పార్టీలో గ్రూప్‌ తగాదాలను పరిష్కరింగే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. 
చదవండి: వారికే టికెట్లు.. ఎన్నికలపై కేసీఆర్‌ క్లారిటీ!

అవినీతిపై సీరియస్‌
కాగా పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే జాబితా తన వద్ద ఉందన్నారు సీఎం కేసీఆర్‌. కానీ ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్‌.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. అదే విధంగా డబుల్‌బెడ్‌ రూం, దళితబంధులో అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్‌ సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలకు వార్నింగ్‌
కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం కింద మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఇదే చివరి వార్నింగ్‌ అంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ హెచ్చరించారు. మళ్లీ వసూలు చేస్తే గనుక టికెట్‌ ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. వారి అనుచరులు డబ్బులు తీసుకున్నా సరే ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తలెవరూ అవినీతికి పాల్పడకుండా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 
చదవండి: Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement