sitting MLAs
-
BJP: 71 మంది సిట్టింగ్‌లకు టికెట్లు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ ఆదివారం మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.బరిలో మరాఠా అభ్యర్థులు: జరంగేముంబై: మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే ఎన్నికల వేళ మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరాఠాలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దించుతానని ఆయన ప్రకటించారు. గెలుపునకు అవకాశం చోట మాత్రమే మరాఠా అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని మరాఠాల రిజర్వేషన్లకు మద్దతిచ్చే అభ్యర్థులకు పార్టీ, మతం, కులంతో సంబంధం లేకుండా తోడుంటామని ఆయన స్పష్టంచేశారు. తమ షరతులకు అంగీకరిస్తూ అభ్యర్థులు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని జరంగే వెల్లడించారు. -
బీఆర్ఎస్లో 20 మందికిపైగా సిట్టింగ్‌లకు నో టికెట్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు పడటం ఖరారైందా? సుమారు 20–25 మందికి ఈసారి టికెట్ దక్కనట్టేనా? దీనిపై ఆయా ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారా..?.. ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ,ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్.. జాబితాను దాదాపు ఖరారు చేశారని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. రెండు మూడు రోజుల్లో సుమారు 80–90 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నాయి. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు వివరిస్తున్నాయి. ఆ సంకేతాలతోనే భేటీలు! 20మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కదనే సంకేతాల నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరిపై వేటు పడుతుందన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. తమకు అవకాశం దక్కదనే సంకేతాలు అందుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. చివరి ప్రయత్నంగా కేసీఆర్‌తోపాటు కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి సహకరించి, గెలుపు కోసం పనిచేయాలని.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం. పోటీ అవకాశం దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించడం, సర్దుబాట్లు, ఇతర నష్ట నివారణ చర్యలపైనా కీలక నేతలకు కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ నిరాకరణపై ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో తమ ప్రధాన అనుచరులు, కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వేటుపడే సిట్టింగ్‌ల స్థానంలో అవకాశం దక్కిందనే సంకేతాలు అందుకున్న నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సిట్టింగ్‌ల అనుచరులు, క్షేత్రస్థాయి శ్రేణులతో భేటీ అవుతూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వేటు వెనుక కారణాలెన్నో.. గెలుపు అవకాశాలు, ఆరోపణలు, సామాజికవర్గ సమీకరణాలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బాబూమోహన్ (ఆందోల్), మల్కాజిగిరి (కనకారెడ్డి), ఎం.సు«దీర్‌రెడ్డి (మేడ్చల్), కొండా సురేఖ (వరంగల్ తూర్పు), సంజీవరావు (వికారాబాద్), బొడిగె శోభ (చొప్పదండి)లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక వారి పనితీరుతోపాటు నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కీలకంగా మారినట్టు సమాచారం. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పట్ల ఎలాంటి ప్రతికూలతలు లేకున్నా.. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు, బలాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పునకు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. స్థానిక కేడర్‌తో విభేదాలు, అవినీతి, బంధుప్రీతి తదితరాలతో పార్టీకి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరారు. వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగా ఎవరు?.. మారేదెవరు? కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్‌కు టికెట్ ఇవ్వొచ్చనే అంచనా ఉంది. దీనితోపాటు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), లక్ష్మీకాంతరావు (వేములవాడ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), బానోత్ మదన్‌లాల్ (వైరా)లకు కూడా కేసీఆర్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇక మంత్రులు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్)లను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం భావిస్తే.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. – కమ్యూనిస్టులతో పొత్తు కుదరితే మునుగోడు (సీపీఐ), భద్రాచలం (సీపీఎం) వారికి కేటాయించవచ్చని.. తాండూరు, మానకొండూరు, పెద్దపల్లి, కామారెడ్డి తదితర నియోజకవర్గాలపై మలి జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
‘దళితబంధు’లో ఎమ్మెల్యేల అవినీతి.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. లేకుంటే నష్టపోతారని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. నేతలకు క్లాస్‌పీకిన కేసీఆర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే.. నేతలకు క్లాస్ పీకారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. నియోజవర్గంలో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలను పరిష్కరింగే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. చదవండి: వారికే టికెట్లు.. ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ! అవినీతిపై సీరియస్ కాగా పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే జాబితా తన వద్ద ఉందన్నారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. అదే విధంగా డబుల్‌బెడ్ రూం, దళితబంధులో అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం కింద మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఇదే చివరి వార్నింగ్ అంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. మళ్లీ వసూలు చేస్తే గనుక టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. వారి అనుచరులు డబ్బులు తీసుకున్నా సరే ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తలెవరూ అవినీతికి పాల్పడకుండా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. చదవండి: Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్ -
బీజేపీ ఎమ్మెల్యేలకు శుభవార్త.. యడియూరప్ప కీలక ప్రకటన!
బెంగళూరు: రాబోయే ఎన్నికల కోసం కర్నాటకలో అధికార బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి అధికారం కోసం బీజేపీ మరో ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మళ్లీ టికెట్లు దక్కుతాయని యడియూరప్ప సూచనప్రాయంగా చెప్పారు. ఎవరో నలుగురైదుగురు తప్ప, అందరికీ మరోసారి పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గుజరాత్ అసెంబ్లీకి గత ఏడాది ఎన్నికల్లో అధికార బీజేపీ సుమారు 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. ఇక్కడా అదే విధానం పునరావృతం అవుతుందేమోనని సొంతపార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు సీఎం బొమ్మై సారథ్యంలోనే జరుగుతాయన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే శాసనసభా పక్ష సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేననే సంకేతాలిచ్చారు. -
TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే జరగాల్సి ఉంది. కాని ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అదే విధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నాయకులంతా తల కిందుల తపస్సులు చేస్తున్నారు. సాంతం.. సర్వేల మయం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు... కొత్తగా అసెంబ్లీలో ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేనండి... సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్‌గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతల గురించి.. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నదాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గ్రాఫ్ బాగుంటూనే టికెట్ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నట్లు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు... టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తున్నవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేయించుకుంటున్నారు. కొందరిని నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే... గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికే అని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం సిట్టింగులందరికీ అని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలకు అర్థాలు వేరులే అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికే అందరి జాతకాలు ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజల్లో గ్రాఫ్ సరిగా లేకపోతే టిక్కెట్ రాదని భయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పల్లె పల్లెకు ప్రశ్నల రాయుళ్లు మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్మెంట్ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని అక్కడ ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా పరిశీలించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు. టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించింది. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యూత్, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమకున్న గ్రాఫ్ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ప్రతి పార్టీ ఆపరేషన్ ఆకర్ష గ్రామ స్థాయి నుంచి అమలు చేస్తోంది. ముందుస్తు ఊహాగానాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా రాజకీయ జాతర మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సిట్టింగులంటే మీరు కూడా వస్తారా సార్! ఎందుకంటే కుప్పంలో పరిస్థితి ఏమీ బాగోలేదు!
సిట్టింగులంటే మీరు కూడా వస్తారా సార్! ఎందుకంటే కుప్పంలో పరిస్థితి ఏమీ బాగోలేదు! -
హమ్మాయ్యా! టెన్షన్ పోయింది.. కేసీఆర్ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం
సాక్ష, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
సిట్టింగ్‌లకు టికెట్ దక్కేనా..!
సాక్షి, గచ్చిబౌలి: బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వేడి అలుముకుంది. ఆయా పార్టీలు, అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు చేసి తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఆశావహుల పూర్తి వివరాలు సేకరించారు. గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారితో విడివిడిగా ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ కార్పొరేటర్లలో ఒకరిద్దరికి టికెట్ రాకపోవచ్చనే ప్రచారం జరిగింది. దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందడంతో జీహెచ్ఎంసీలో సిట్టింగ్ కార్పొరేటర్లకే టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠా నం మొగ్గు చూపుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ట్రెండ్ చేంజ్.. కాదేదీ గుర్తుకు అనర్హం..! టీఆర్ఎస్ నుంచి.. ► కొండాపూర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్‌పటేల్, కొండా విజయ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ పోటీ పడుతున్నారు. ►గచ్చిబౌలి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో పాటు కొండా విజయ్, గణేష్ ముదిరాజ్, సత్యనారాయణ, శేరిలింగంపల్లి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మారబోయిన రవి యాదవ్, కొండా విజయ్ టికెట్ ఆశిస్తున్నారు. ► మాదాపూర్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ కుటుంబ సభ్యులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ►మియాపూర్ డివిజన్ నుంచి ఉప్పలపాటి శ్రీకాంత్ , గంగాధర్ రావు, వాసవి చంద్రశేఖర్, మోహన్ ముదిరాజ్, అన్వర్ షరీఫ్‌లు ఆశిస్తుండగా, చందానగర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో పాటు మరో 15 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ కసరత్తు.. ►శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ► కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రవికుమార్ ప్రకటించారు. ► గచ్చిబౌలి డివిజన్ అభ్యర్థిగా మన్నె సతీష్, శేరిలింగంపల్లి అభ్యర్థిగా ఎల్లేష్, మాదాపూర్ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్, మియాపూర్ అభ్యర్థిగా ఇలియాస్ షరీఫ్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ► హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్లకు మహిళా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీకీ సై అంటున్న బీజేపీ.. ►ఈ సారి అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అధిష్ఠానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ►కొండాపూర్ నుంచి బాల్ధా అశోక్, చందు యాదవ తో పాటు, ప్రముఖ సినీ నటుడు తన కొడుకు కోసం టికెట్ ఆశిస్తున్నారు. ►గచ్చిబౌలి డివిజన్ నుంచి రవీంద్రప్రసాద్ దూబే, సురేష్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, అనీల్ గౌడ్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ► శేరిలింగంపల్లి నుంచి కుమార్ యాదవ్, నర్రా జయలక్ష్మీ, రాజు శెట్టి, మారం వెంకటేష్, శాంతి భూషణ్, శివకుమార్‌లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ►మాదాపూర్ నుంచి జంగయ్య యాదవ్, హరికృష్ణ, నవీన్, హఫీజ్‌పేట్ డివిజన్ నుంచి మహిళ అభ్యర్థిని బరిలో దింపేందుకు మహేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, కోటేశ్వర్ రావు కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ► మియాపూర్ నుంచి రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, డీఆర్ఎస్కె ప్రసాద్, ఆకుల మహేష్‌లు పోటీ పడుతుండగా చందానగర్ డివిజన్ నుంచి తమ కుంటుంబ సభ్యులను పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజశేఖర్ ఆసక్తిగా ఉన్నారు. ►టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వకుంటే వారిని బీజేపీలో చేర్చుకొని బరిలో దింపే యోచనలో ఉన్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. -
ఏడుగురు దళిత సిట్టింగ్‌లపై వేటు
సాక్షి, అమరావతి: ఏడుగురు దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి మొండిచేయి చూపించారు. వారికి మళ్లీ సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. 14 మందికి మాత్రం అవకాశమివ్వలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో గెలుపొందింది. నవతరం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ తరువాత టీడీపీతో అసోసియేట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో మేడా మల్లికార్జునరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌లు వైఎస్సార్సీపీలో, రావెల కిషోర్‌బాబు జనసేనలో చేరి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో టీడీపీ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. వీరితోపాటు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకుంటే ప్రస్తుతం టీడీపీకి 121 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 107 మందికి తిరిగి సీట్లిచ్చిన చంద్రబాబు 14 మందికి సీట్లు నిరాకరించారు. అందులో ఏడుగురు ఎస్సీలు, ఒక గిరిజనుడు ఉన్నారు. పి.గన్నవరంలో పులపర్తి నారాయణమూర్తి, చింతలపూడిలో పీతల సుజాత, యర్రగొండపాలెంలో పాలపర్తి డేవిడ్‌రాజు, బద్వేలులో జయరాములు, కోడుమూరులో మణిగాంధీ, శింగనమలలో యామినీబాల, సత్యవేడులో తలారి ఆదిత్యకు సీట్లివ్వలేదు. గిరిజనులకు కేటాయించిన పోలవరంలో మొడియం శ్రీనివాస్‌కు సీటు నిరాకరించారు. ఇక జనరల్ స్థానాల విషయానికి వస్తే.. విజయనగరంలో మీసాల గీత, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి, కదిరిలో అత్తార్ చాంద్‌బాషాకు మళ్లీ సీట్లివ్వలేదు. నలుగురు ఎమ్మెల్యేలకు సిట్టింగ్ స్థానాలు కాకుండా వేరే నియోజకవర్గాల సీట్లివ్వగా, ఇద్దరు మంత్రులకు ఎంపీ సీట్లిచ్చారు. గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి విశాఖ నార్త్‌కు, వంగలపూడి అనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు, మంత్రి జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, కదిరి బాబూరావును కనిగిరి నుంచి దర్శికి మార్చారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజుకు నర్సాపురం, దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శిద్ధా రాఘవరావుకు ఒంగోలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని కడపకు, చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు రాజంపేట ఎంపీ సీట్లిచ్చారు. కాగా, టీడీపీలో 9 మంది వారసులకు సీట్లు దక్కాయి. సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం: సీట్ల కేటాయింపులో చంద్రబాబు సొంత సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 38 స్థానాలను తన వర్గం వారికే కట్టబెట్టారు. గుంటూరు జిల్లాలోనే తన వర్గం వారికి ఎనిమిది సీట్లు కేటాయించగా, కృష్ణా జిల్లాలో ఐదు, అనంతపురంలో ఐదు, చిత్తూరు జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే ఆ వర్గానికి ఈ కేటాయింపు చాలా ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 41 సీట్లు కేటాయించడం, అదే సమయంలో ఐదు శాతం కూడా లేని తన వర్గానికి 38 సీట్లు కేటాయించడాన్నిబట్టి సీఎం చంద్రబాబు ప్రాధామ్యాలు అర్థమవుతున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు ఎప్పుడూ ఇచ్చే సీట్లే తప్ప అదనంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 25 ఎంపీ స్థానాలకు గానూ ఆరు స్థానాలను తన సామాజికవర్గానికే కేటాయించగా బీసీలకు ఐదు సీట్లే ఇచ్చారు. -
టీడీపీ సిట్టింగ్‌లకు చెమటలు
ఎన్నికల వేళ టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదిగో...అదిగో అంటూ అభ్యర్థుల ప్రకటనపై తాత్సారం చేస్తుండటంతో సిట్టింగ్‌లకూ చెమటలు పడుతున్నాయి. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఒక్క స్థానాన్ని కూడా నేటికీ ఖరారు చేయకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎంపీ స్థానానికి తొలుత ఓకే అన్న జేసీ పవన్ కూడా ఇపుడు అసెంబ్లీపైనే గురిపెట్టడంతో అంతా గందరగోళంగా మారింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ తాత్సారం చేస్తోంది. గురువారం రాత్రి 126 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు...జిల్లాలో ఐదు స్థానాలపై మాత్రమే ప్రకటన చేశారు. ఇక అనంతపురం పార్లమెంట్‌లోని అసెంబ్లీ స్థానాలను పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో సిట్టింగ్లతో పాటు ఆశావహుల్లో గుబులు రేపుతోంది. వాస్తవానికి మూడు స్థానాలు మినహా తక్కిన అసెంబ్లీల అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. కొందరు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే తాజాగా ‘అనంత’ పార్లమెంట్ స్థానంతో పాటు పలు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలనే ప్రతిపాదనతో అభ్యర్థిత్వాలపై చంద్రబాబు మరోసారి సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. శింగనమల సీటెవరికో..? శింగనమల టిక్కెట్ యామినీబాలకు లేదని తేల్చారు. ఆమె స్థానంలో శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నారు. ఈమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ పవన్ ఎంపీగా బరిలోకి దిగకపోతే జేసీ సిఫార్సు చేసిన శ్రావణిని కూడా పక్కనపెడతారా...? అనే చర్చ కూడా నడుస్తోంది. అనంతపురం, శింగనమల, గుంతకల్లు అసెంబ్లీ అభ్యర్థులను మార్పు చేయకపోతే తాను, తన కుటుంబ సభ్యులు ఎంపీగా పోటీ చేసే విషయమై పునరాలోచిస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతిలో విలేకరుల ఎదుట ప్రకటించారు. ఇదిలా ఉండగా జేసీ పవన్ తప్పుకుంటే కచ్చితంగా కాలవ శ్రీనివాసులు పార్లమెంట్ బరిలో దిగాల్సి వస్తుంది. అప్పడు రాయదుర్గానికి అసెంబ్లీ అభ్యర్థి ఉండరు. కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా బరిలో ఉంటే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ప్రకటించారు. దీపక్‌రెడ్డికి సర్దిచెప్పేకుందుకు దివాకర్‌రెడ్డి ప్రయత్నిస్తే దీపక్ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జేసీ రాజకీయం తాడిపత్రికే పరిమితమా..? జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబరాజకీయం కేవలం తాడిపత్రికే పరిమితమైంది. 2014లో కాంగ్రెస్ నుంచి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన దివాకర్‌రెడ్డి ‘అనంత’ ఎంపీగా తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా ఎన్నికల్లో ‘అనంత’ పార్లమెంట్‌తో తాడిపత్రి అసెంబ్లీ స్థానాల్లో జేసీ బ్రదర్స్ తమ వారసులను బరిలో దింపాలని భావించారు. తొలిజాబితాలో పేర్లు కూడా ఖరారు చేసుకున్నారు. జేసీ పవన్ చేయించుకున్న సర్వేల్లో తనకు ప్రతికూల ఫలితాలు వచ్చినా వెనక్కు తగ్గలేదు. అయితే టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఇదే అంశం వెల్లడికావడంతో చంద్రబాబే పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పవన్‌కు బదులు దివాకర్‌రెడ్డిని బరిలో దింపితే కనీసం గట్టి పోటీ అయినా ఇచ్చినట్టు ఉంటుందని భావించి ఈ మేరకు దివాకర్‌రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు జేసీ పవన్ కూడా తాజాగా చేయించుకున్న సర్వేలో 78 వేల నుంచి 90 వేల ఓట్లతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. పైగా శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు, అనంతపురంలో పార్టీ అభ్యర్థులెవరైనా ఓటమి పాలవుతారన్న రిపోర్టు రావడం...తక్కిన మూడు నియోజకవర్గాల్లోనూ వాతావరణం ఆశాజనకంగా లేకపోవడంతో జేసీ పవన్ ఎంపీ స్థానంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెరపైకి కాలవ పేరు అనంతపురం పార్లమెంట్ నుంచి తాను వద్దని, వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థిని బరిలో ఉండటంతో కాలవ శ్రీనివాసులను పార్లమెంట్ బరిలో నిలుపుదామనే ప్రతిపాదన జేసీ పవన్ చంద్రబాబు ముందు ఉంచిన ట్లు తెలుస్తోంది. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా గుంతకల్లు నుంచి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే జేసీ సిఫార్సును చంద్రబాబు పరిగణలోకి తీసు కుంటారా...? లేదా? అనేది తేలాల్సి ఉంది. జేసీ చేసిన ప్రతిపాదనలతోనే అనంతపురం పార్లమెంట్ గందరగోళమైందన్న ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వంపై పునఃసమీక్ష ‘అనంత’ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పునఃసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీతో పాటు టీడీపీకి చెందిన బలిజ, కమ్మ, మైనార్టీ వర్గాలంతా చౌదరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. చౌదరికి టిక్కెట్ ఇస్తే ఎంపీ ఓట్లు తమకు పడకుండా క్రాస్ ఓటింగ్ చేయిస్తారని, కాబట్టి కచ్చితంగా అతన్ని మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో చౌదరికి ఇవ్వాలా? లేదంటే మైనార్టీ, బలిజ సామాజికవర్గ అభ్యర్థిని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందా? అనే కోణంలోనూ చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం అసెంబ్లీ ఖరారైందని యోచనతో ఉన్న అమిలినేని సురేంద్రబాబును కూడా ‘అనంత’ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్ చౌదరి, దివాకర్‌రెడ్డిని రాజీ చేసి విభేదాలు లేకుండా చేస్తే బాగుంటుందని మంత్రి గంటాతో పాటు దేవినేని ఉమా సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. గుప్తాకు మొండిచెయ్యేనా..? గుంతకల్లు అభ్యర్థిగా మధుసూదన్‌గుప్తాను బరిలోకి దించాలని జేసీ భావించి టీడీపీలోకి రప్పించారు. ఇప్పుడు గుంతకల్లు నుంచి పవన్ బరిలోకి దిగాలనుకోవడంతో గుప్తా కూడా ఆలోచనలో పడ్డారు. మరోవైపు గుప్తా కంటే అక్కడ బీసీ నేత అయితేనే మేలనే కోణంలో తిరిగి జితేంద్రగౌడ్నే కొనసాగిస్తే బాగుంటుందని కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వెంకటశివుడు యాదవ్ పేరు పరిశీలనలోకి వచ్చినా.. చివరకు పక్కనపెట్టేశారని తెలుస్తోంది. ఏదిఏమైనా ‘గుప్తా’కు చంద్రబాబు మొండిచేయి చూపే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇస్తే గౌడ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారనే ఆలోచనతో టీడీపీ మళ్లీ గౌడ్ పేరును పరిశీలిస్తోందని, ఇదే సమయంలో తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ వీడుతానని గుప్తా అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. -
సిటింగ్‌ల వైపే మొగ్గు..
సాక్షి ,శ్రీకాకుళం : ఇక ఒకటి రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేయనుంది! అధికార తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా అభ్యర్థులపై అమరావతిలో రెండ్రోజులుగా ఎడతెగని కసరత్తు చేస్తోంది! దాదాపుగా సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ సీటు దక్కే అవకాశం ఉన్నా ఆదివారం అభ్యర్థులు ఎవరనేదీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పాలకొండ, పాతపట్నం మినహా జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఈసారైనా తనకు అవకాశం వస్తుందని మాజీ మంత్రి, టీడీపీలో సీనియర్ నాయకుడైన గుండ అప్పలసూర్యనారాయణ ఆశించారు. 2014 ఎన్నికలలో ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవివైపే మొగ్గు చూపించారు. దీన్ని అవమానంగా భావించిన అప్పలసూర్యనారాయణ దాదాపు రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే చిరకాల మిత్రుడు కిమిడి కళా వెంకటరావు చొరవతో చంద్రబాబు అరసవల్లి వెళ్లి అప్పలసూర్యనారాయణను బుజ్జగించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రథమ మేయరు అయ్యేందుకు వీలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ ఆ ఎన్నికలు ఇప్పటికీ జరగనేలేదు కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. మేయరు పద వీ లేదు ఎమ్మెల్యే సీటు లేదు అన్నట్లుగా మారి పోయింది అప్పలసూర్యనారాయణ పరిస్థితి. మంత్రులకు పాత స్థానాలే.. శ్రీకాకుళం సీటు కోసం ముద్దాడ కృష్ణమూర్తినాయుడు (నాగావళి కృష్ణ) దరఖాస్తు చేసుకున్నా దాన్ని పట్టించుకున్నదాఖలాలు లేవు. ఇక జిల్లాకు చెందిన మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు తమ పాత స్థానాల్లోనే పోటీ చేయనున్నారు. టెక్కలి సీటు లేదంటే నరసన్నపేటలో తమ కుమారుడు కింజరాపు ప్రసాద్‌కు సీటు ఇవ్వాలని అచ్చెన్నాయుడి సోదరుడైన హరివరప్రసాద్ ఉవ్విళ్లూరినప్పటికీ టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. తన ప్రతిపాదనను ఉపేక్షిస్తే టెక్కలిలో స్వతంత్య్ర అభ్యర్థిగానైనా పోటీకి నిలబెడతానని కూడా ఆయన తన అనుచరుల వద్ద హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కింజరాపు కుటుంబానికి పెద్దదిక్కు దివంగత నాయకుడు ఎర్రన్నాయుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన సమయంలో అచ్చెన్నాయుడి కన్నా ప్రసాద్‌దే టెక్కలిలో హవా. ఎర్రన్నాయుడి మరణంతో అనూహ్యంగా అచ్చెన్న ప్రాధాన్యం పెరగడంతో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ప్రసాద్ కుటుంబాలు కూడా తమ రాజకీయ భవితవ్యంపై కాస్త ఆందోళన చెందినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. గత మూడేళ్లుగా అచ్చెన్న కార్యక్రమాలకు ప్రసాద్ దూరంగా ఉండటం, అన్నదమ్ముల మధ్య పొసగకపోవడం దృష్ట్యా సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీలో చర్చ నడుస్తోంది. ఇక కళా వెంకటరావుకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజాదరణ తగ్గిపోవడం, టీడీపీ నాయకుల అవినీతి పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో పాతపట్నం వైపు దృష్టి పెడతారనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ గత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో అక్కడ అధికార పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. మరోవైపు కింజరాపు కుటుంబానికి పట్టున్న గ్రామాలు 15 వరకూ ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి కళా చివరకు ఎచ్చెర్ల వైపే మొగ్గు చూపించినట్లు తెలిసింది. కళా సొంత ప్రాంతమైన రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభాభారతిని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కే టీడీపీ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రతిభాభారతి తెరవెనుకకే పరిమితమైపోవచ్చు. ఇక కళా చక్రం తిప్పుతున్న పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి ఎవరనేదీ శనివారం రాత్రికైనా కొలిక్కిరాలేదు. ఆదివారం ఉదయం మరోసారి ఇదే విషయమై అధిష్టానం చర్చించే అవకాశం ఉందని తెలిసింది. గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణకే ఈసారి కూడా సీటు ఇప్పించాలని కళా వర్గం కోరుతుండగా, అతనికి తప్ప మరెవ్వరికి ఇచ్చినా పనిచేస్తామని పాలకొండ జడ్పీటీసీ సభ్యుడు దామోదరనాయుడు వర్గం గట్టిగా వాదిస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతికి సీటు వస్తుందని గుసగుసలు వినిపించినా జయకృష్ణకే సీటు ఖరారు కావొచ్చని తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు కష్టకాలం... వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడానికి భారీగా నజరానాలే గాకుండా 2019 ఎన్నికలలో సీటు కూడా ఇస్తామని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు భరోసా ఇచ్చారనే ప్రచారం గతంలో జరిగింది. తీరా ఇప్పుడు సీట్లు ఖరారు చేసే సమయం వచ్చేసరికి కలమట అభ్యర్థిత్వంపై టీడీపీ అధిష్టానం తటపటాయించడం గమనార్హం. గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం, ఇప్పుడీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం, ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి పోటీగా నిలిచే మరో అభ్యర్థి కనిపించకపోవడంతో చివరకు కలమటకే టీడీపీ అధిష్టానం సీటు ఇస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కలమట పేరును చంద్రబాబు వ్యతిరేకించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చివరి వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు. శివాజీ అస్త్ర సన్యాసమేనా? గౌతు లచ్చన్న వారసుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న శ్యామసుందర శివాజీ ఈ ఎన్నికలలో అస్త్రసన్యాసం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. ఆయన కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలైన యార్లగడ్డ శిరీషకే పలాస సీటు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, గత ఐదేళ్ల కాలంలో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నేపథ్యంలో ఆమె గెలుపు నల్లేరుపై నడక కాదని పలాస ప్రజలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాల మధ్య శిరీష గనుక ఇచ్ఛాపురంలో పోటీచేస్తే తనకు పలాస సీటు వస్తుందనే ఆశతో ఇటీవలే టీడీపీలో చేరిన పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావుకు నిరాశ ఎదురైంది. అవినీతి ఆరోపణలు వచ్చినా... ఇచ్ఛాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్, నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలపై కూడా అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా చివరకు వారిద్దరికీ టీడీపీ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. అశోక్‌కు మరోసారి సీటు దక్కకుండా శివాజీ అడ్డుకుంటారని, ఇటీవలే టీడీపీలో చేరిన నర్తు నరేంద్ర యాదవ్‌కు ఆ అవకాశం ఇప్పిస్తారనే ప్రచారం జరిగింది. నరేంద్రకు ఈసారీ ఆశాభంగం తప్పలేదు. ఇక బగ్గు రమణమూర్తిని కాదని నరసన్నపేటలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడిని రంగంలోకి దించుతారని ప్రచారం జరిగినా చివరకు బగ్గు మాటే నెగ్గినట్లు తెలుస్తోంది. -
సిట్టింగులకే సీట్లు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని మెజారిటీ సీట్లలో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డికే సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పాణ్యం, నందికొట్కూరు సీట్ల విషయం మాత్రం ఇంకా తేలలేదు. పాణ్యంలో ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి పనితీరు బాగోలేకపోవడం.. నందికొట్కూరు ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి, గతంలో పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి మధ్య వైరుధ్యాల కారణంగా ఈ రెండు సీట్లను తేల్చలేదని తెలుస్తోంది. నంద్యాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఫరూక్ మాత్రం బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం. ప్రాథమికంగా నంద్యాల సీటు బ్రహ్మనందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరుకు కోట్ల సుజాతమ్మ, ఆదోని బుట్టారేణుక, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే సీట్లతో పాటు నంద్యాల ఎంపీ సీటును టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది. రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని... కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు. నంద్యాల ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇంకా తేలలేదు. మొదట్లో మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ సీటు తమకే కావాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టడంతో చంద్రబాబు కొత్త కొర్రీలను వేసినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని, సదరు మొత్తం డిపాజిట్‌ను తమకు చూపాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసీ రూ. 60 కోట్లు అడగడం ఏమిటని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. తాము అంత మొత్తం సమకూర్చుకోలేమనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొర్రీలు వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ఎంపీ సీటు ఇస్తామని చెబుతూనే ఎగ్గొట్టేందుకు ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఎవరినీ అడగకుండా తమను మాత్రమే డబ్బు గురించి అడగటం ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నేరుగా చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ విధంగా ఖర్చును భరించలేమన్న వారికి సీటు కేటాయిస్తున్నట్టు చెప్పి.. తమను మాత్రం ఎందుకు రూ.60 కోట్లు అడిగారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. -
సిటింగులకు ఫిటింగ్!
టీడీపీ ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాల్లో భారీ మార్పులకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని తన సర్వేలో తేలిందని లీకులు ఇచ్చారు. దీంతో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధినేత తనయుడు లోకేష్ బాబును, మరి కొందరు టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారు చెప్పిందల్లా చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సాక్షి, తిరుపతి: ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీ, మంత్రివర్గ సభ్యులతో తరచూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) పేరుతో సర్వే చేపట్టారు. ఇంకో వైపు ఎప్పటికప్పుడు అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏయే నియోజక వర్గాల్లో ఎవరికి తిరిగి టికెట్ ఇవ్వాలో తెలుసని, తనపై ఎవ్వరూ ఒత్తిడి చెయ్యవద్దని ఆయన తేల్చిచెప్పినట్లు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పలమనేరుపై మల్లగుల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి స్వప్రయోజనాల కోసం టీడీపీ కండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డికి పలమనేరు కేటాయించాలా? వద్దా? అని చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పుకుని పచ్చకండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నా పలమనేరుకు చేసిందేమీ లేదని తేలిపోయింది. నియోజక వర్గ ప్రజలు మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఐవీఆర్ఎస్, తన సొంత సర్వేలోనూ ఇదే విషయం బయటపడడంతో చంద్రబాబు సందిగ్ధంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. పలమనేరులో స్థానిక సహకారం లేనందున పుంగనూరులో పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ♦ చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్థానికులకు అందుబాటులో ఉండడం లేదని సర్వేలో బయటపడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి చిత్తూరుకు చేసిందేమీ లేదని జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ♦ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్య కారణంతో ఈసారిటికెట్ ఇవ్వటం లేదని తేలిపోయింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్‌రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేదని తేలటంతో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ♦ తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌పైనా నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేకపోవటంతో ఇక్కడ వేరొకరిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు అమరావతి సమాచారం. ♦ సత్యవేడు ఎమెల్యే తలారి ఆదిత్య విషయానికి వస్తే అవినీతి అక్రమాల్లో పూర్తిగా కూరుకుపోవటంతో ఇక్కడ కూడా వేరొకరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ♦ తిరుపతిలో ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకు కాకుండా వేరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అధినేత తీవ్ర అసంతృప్తి ఉండటంతో సర్వేలో బాగోలేదని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అమరావతి చుట్టూ ప్రదక్షిణలు అభ్యర్థులను మార్చుతున్నారని తెలియటంతో కొందరు అనుచరులతో అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ పక్కనపెట్టి అమరావతిలో కూర్చొని టికెట్ ఖరారు చేసుకునేందుకు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. మంత్రి లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు అమరావతిలో హోటళ్లో గదులను అద్దెకు తీసుకున్నారు. అత్యవసరమైతే విమానంలో రేణిగుంటకు వచ్చి పనులను చక్కబెట్టుకుని తిరిగి ఫ్లైట్‌లో అమరావతికి ఎగిరిపోతున్నారు. లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలు ఏది చెబితే అది చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బును టికెట్ తెప్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ ఉదయం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద, మధ్యాహ్నం సచివాలయం, సాయంత్రం హోటళ్లలో మద్యస్థాలు నెరుపుతున్నారు. టికెట్ ఇస్తారో లేదో తెలియదు కానీ... ఎమ్మెల్యేలకు మాత్రం ఆర్మీ సెలెక్షన్ కంటే అభ్యర్థిత్వం ఎంపికే కష్టంగా ఉందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
సిటింగ్‌లకు సీట్లు గల్లంతే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు సిటింగ్‌లకు సీట్లు ఎగనామం పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. రెండు రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాకు సంబంధించి నలుగురు సిటింగ్‌లకు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు విశ్వశనీయ సమాచారం. ఆదివారం రాజధానిలో ముఖ్యమంత్రి తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పలుమార్లు సంప్రదించిన ముఖ్యమంత్రి తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా పశ్చిమ ప్రకాశం పరిధిలోని కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురంతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కనిగిరి బరిలో నిలిచేదెవరో... కనిగిరి సిటింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి, ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఉగ్రకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ కదిరి బాబూరావు పలుమార్లు కోరారని, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు సన్నిహితుడైన బాబూరావు అటు బాలకృష్ణ ద్వారా కూడా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బాబూరావును ఒప్పించే బాధ్యతను చంద్రబాబు బాలకృష్ణకు అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల గెలుపు బాధ్యత కందుల భుజాన.. ఇక మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డిని సైతం తప్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. కందుల స్థానంలో ఇన్ఫోటెక్‌కు చెందిన మోహన్‌రెడ్డి సోదరుడు, టీటీడీ బోర్డు సభ్యుడు అశోక్‌రెడ్డిని మార్కాపురం అభ్యర్థిగా నిలపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కందుల నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు పశ్చిమ ప్రకాశం అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి తానే పోటీ చేస్తానని, టిక్కెట్ రాని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీలో ఉంటానని నారాయణరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం నారాయణరెడ్డి అంగీకరించే పరిస్థితి కానరావడం లేదు. అదే జరిగితే మార్కాపురంలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టపోవడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. వై.పాలెంలో గ్రూపుల గోల.. యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌రాజు ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న యర్రగొండపాలెం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితులు లేవు. డేవిడ్‌రాజును ఈ నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా నిలిపితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్నది టీడీపీ వర్గాలే చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో డేవిడ్ రాజును తప్పించి రాజశేఖరంను యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా నిలపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో డేవిడ్ రాజుకు ఎమ్మెల్సీ లేదా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యర్రగొండపాలెంలో టీడీపీ ఇప్పటికే గ్రూపులుగా విడిపోయింది. టీడీపీ అభ్యర్థికి అందరూ కలిసి పనిచేసే పరిస్థితి కానరావడం లేదు. ఎస్.ఎన్.పాడులో ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గంలోని అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చాలని, విజయ్‌కుమార్‌ను అభ్యర్థిగా నిలిపితే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని అసమ్మతి వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌లకు సైతం పలుమార్లు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించి అసమ్మతి నేతలకు వార్నింగ్‌లు ఇచ్చినా ఇక్కడ పరిస్థితి చక్కబడలేదు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయమని ఆ పార్టీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలుపుతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయ్‌కుమార్‌ను మార్చే పక్షంలో ఆయన వర్గం టీడీపీ కొత్త అభ్యర్థికి మద్దతు పలికే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. చీరాలలోనూ సందేహమే.. ఇక చీరాల నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఎంపికపై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడతారన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది. ఆమంచి పార్టీని వీడే పక్షంలో టీడీపీ అభ్యర్థిగా పాలేటి రామారావును ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమంచి పార్టీని వీడే పక్షంలో ఇక్కడ టీడీపీకి గడ్డు పరిస్థి«తి తప్పదు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో పలువురు సిటింగ్‌లకు టీడీపీ అధిష్టానం సీట్లు ఇవ్వడం లేదని ఆపార్టీకి చెందిన ముఖ్యనేతలే పేర్కొంటుండడం గమనార్హం. -
మార్పుకే మొగ్గు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో అసంతృప్తుల గోల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు నియోజకవర్గాల సిట్టింగ్‌లను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన ఫార్ములాకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు రోజుల జిల్లా పర్యటనలో సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం నియోజకవర్గాల పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా అసంతృప్తుల గోల ఆయన్ను తలపట్టుకునేలా చేసింది. సిట్టింగ్‌లను మార్చాల్సిందేనంటూ అసంతృప్త నేతలు, మారిస్తే సంగతి తేలుస్తామంటూ సిట్టింగ్‌లు పరస్పర ఆరోపణలకు దిగడం ముఖ్యమంత్రిని మరింత ఇరుకున పెట్టింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాల మేరకు సిట్టింగ్‌లను మార్చాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. యర్రగొండపాలెం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే డేవిడ్‌రాజుపై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ పాత నేతలు సీఎం ఎదుటే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజును తప్పించి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి దేవానంద్‌తో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అజితారావు ఇటీవల సీఎంను కలిసి తనకు సీటు ఇవ్వాలంటూ కోరినట్లు తెలుస్తోంది. అజితారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ మాగుంట సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన దేవానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజును రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని వారంతా ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్నారు. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు మరి కొందరు నేతలు మద్ధతు పలుకుతున్నారు. సంతనూతలపాడు నుంచి డేవిడ్‌రాజును పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు మినహా తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తేల్చి చెబుతున్నారు. బీఎన్ అభ్యర్థిత్వాన్ని సీఎం తిరస్కరించే పక్షంలో బీఎన్ పార్టీని వీడతారన్న ప్రచారం సాగుతోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నియోజకవర్గంపై టీడీపీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కందుల నారాయణరెడ్డిని తప్పించి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు మాగుంట ఫార్ములా సైతం దోహదం చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఇన్ఫోటెక్‌కు చెందిన అశోక్‌రెడ్డిని మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే కందులను ఒప్పించి ఈ నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కందుల ఒకే అంటారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఒంగోలు పార్లమెంటుకు కొత్త అభ్యర్థి దొరికే పక్షంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మార్కాపురం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ సైతం ఇందుకు మద్ధతు పలుకుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావును అభ్యర్థిగా నిలిపేందుకు సీఎం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఇక కనిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని అభ్యర్థిగా నిలుపుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం ఉగ్రకు హామీ ఇచ్చినట్లు ప్రచారమూ ఉంది. కాదు కూడదంటే ఎమ్మెల్యే బాబూరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. అయితే సిట్టింగ్‌లను ఒప్పించి సీఎం అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సిట్టింగ్‌ల మార్పును ఇప్పటికే ఎమ్మెల్యేలు బాబూరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిని మారిస్తే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. కరణంతో తలనొప్పులు తప్పవా..? రెండు రోజుల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ ప్రకాశం పరిధిలోని మార్కాపురం నియోజకవర్గ సమీక్ష మాత్రమే నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సాధించింది శూన్యం. అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, అందరూ కలిసి పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. వర్గ విభేదాలతో రోడ్డెక్కిన అసమ్మతి వర్గానికి ఇది రుచించలేదు. ఒక వేళ సీఎం సిట్టింగ్‌లను మారిస్తే వారంతా తలొంచుకుని ఆయన చెప్పినట్లు వినే అవకాశం లేదు. ఎదురుతిరిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 4 నియోజకవర్గాల సమీక్ష మాత్రమే పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు, దర్శి నియోజకవర్గాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. సిట్టింగ్‌లకు సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు.కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా రాబోయే ఎన్నికల్లో ఆయన తనయుడు కరణం వెంకటేష్‌కు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని కరణం బలరాం కరాఖండిగా చెబుతున్నారు. వెంకటేష్ భవితవ్యం తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్‌కు ఏ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వెంకటేష్‌కు సీటు ఇవ్వని పక్షంలో కరణం ఊరుకునే పరిస్థితి కానరావడం లేదు. కొడుకు రాజకీయ భవిష్యత్తే ఆయనకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. వెంకటేష్‌కు సీటు దక్కని పరిస్థితుల్లో ముక్కు సూటిగా వ్యవహరించే బలరాం అమీ తుమీకి సిద్ధపడడం ఖాయం. అదే జరిగితే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. బలరాం వ్యవహారం సీఎంకు తలనొప్పులు తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. మాగుంటకు పెరిగిన ప్రాధాన్యం: ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాగుంటకు ప్రాధాన్యం పెంచారు. మరోవైపు ఎమ్మెల్సీ మాగుంట పార్టీని వీడతారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత కల్పిస్తూ హడావిడి చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మాగుంటకు పెద్ద పీట వేయడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఈ నేపథ్యంలో పాతకాపులంతా అదును కోసం ఎదురు చూస్తున్నారు. సీఎంకు తలనొప్పులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సిట్టింగ్‌లకు గండం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అధిష్టానం ఇస్తున్న సంకేతాలతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో టికెట్ల గండం కలవరపెడుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితిపై అధిష్టానం వద్ద చిట్టా ఉంది. పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవటంతో తమ స్థానాలు గల్లంతు కావడం ఖాయంగా భావిస్తున్న సిట్టింగ్‌లు లాబీయింగ్‌లకు దిగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు తమ గాడ్ఫాదర్ల ద్వారా బలమైన లాబీయింగ్‌తో కుల సమీకరణాలకు తెరతీశారు. ఈ పరిణామాలతో అధికార పార్టీలో టికెట్ల గందరగోళం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు, గూడూరు పార్టీ కేడర్‌లో కొత్త చర్చ మొదలయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పది స్థానాలకు ఉదయగిరి, వెంకటగిరి, కోవూరులో మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగిలిన ఏడు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తదనంతరం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో నియోజకవర్గాల వారీగా స్థానాలపై తీవ్ర చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా అందరి దృష్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలపైనే ఉంది. రానున్న ఎన్నికల్లో ఎవరికి మళ్లీ టికెట్ దక్కుతుంది.. ఎవరికి గల్లంతు అవుతుందనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఎలాగూ ఏమీ చేయలేదు, కనీసం పార్టీ క్యాడర్ అయినా ఏం చేశారనే దానిపై అంతర్మథనం పడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తరచూ నిర్వహించే సమావేశాల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవటం, అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పటం, సర్వేల్లో మీ పనితీరు బాగుంటేనే టికెట్ ఇస్తానని ప్రకటించటంతో సిట్టింగ్‌ల్లో గుబులు ప్రారంభమైంది. వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ముఖ్యంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తీరుపై ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వివాదాస్పద వైఖరి, లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ప్రతి సందర్భంలోనూ వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదను అవమానిస్తూ ఆమె సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి తారా స్థాయికి చేరింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవటానికి కొందరు ఆశావహులు తెరపైకి వచ్చారు. పనిలో పనిగా జిల్లా మంత్రులు, ముఖ్యుల సహకారంతో బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డులో చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి మహారాష్ట్ర ఏసీబీలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల రేణిగుంట విమానాశ్రయంలో వివాదం, స్థానికంగా నేతలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటిపై గతంలో చంద్రబాబునాయుడు కూడా నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండాలని బొల్లినేనికి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కదనే యోచనతో ఆశావహులు బలంగా ప్రయత్నాలు మొదలు పెట్టడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపైనా పార్టీ క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో గెలపొంది, పాత టీడీపీ క్యాడర్‌ను పూర్తిగా పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి 60 మంది నేతలతో నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి టికెట్ కోసం ఇద్దరు ఆశావహులు బలమైన లాబీయింగ్‌కు తెర తీసినట్లు సమాచారం. ఇక పోతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ది ఇదే పరిస్థితి. టీడీపీలో చేరిన తర్వాత అవినీతి ఆరోపణలు రావటం, దూకుడు వ్యవహార శైలితో తరచూ వివాదాస్పద వ్యక్తిగా మారారు. అక్కడ పాత టీడీపీ నేతల నుంచి నిత్యం తలనొప్పులు అధికంగా వస్తున్నాయి. గూడూరు స్థానాన్ని ఆశిస్తూ కొందరు టీడీపీ నేతలు, మరికొందరు ఆశావహులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద సిట్టింగ్‌లకు టికెట్ గండం పార్టీలో నేతల్ని కలవర పెడుతుంది. -
ఎమ్మెల్యే ఆదాయం 24.59 లక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏడాదికి సరాసరి ఒక్కొక్కరు రూ. 24.59 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఆ జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు సగటున రూ. కోటికి పైగా వార్షిక ఆదాయంతో ముందంజలో, ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు రూ. 5.4 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ.. దేశవ్యాప్తంగా 4,086 మంది ఎమ్మెల్యేలకు గాను 3,145 మంది ఎన్నికల అఫిడవిట్ల వివరాల్ని విశ్లేషించి జాబితాను రూపొందించింది. 941 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ఆదాయాన్ని ప్రకటించనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నివేదిక అంశాల్ని పరిశీలిస్తే.. 1. దేశంలోని 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సరాసరి ఆదాయం 24.59 లక్షలు.. 2. దక్షిణ భారతదేశంలో 711 మంది ఎమ్మెల్యేల గరిష్టంగా ఒక్కొక్కరు 51.99 లక్షలు ఆర్జిస్తున్నారు. 3. తూర్పు ప్రాంతంలోని 614 మంది ఎమ్మెల్యేలు సరాసరి ఒక్కొక్కరు 8.53 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారు. 4. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలోని 203 మంది ఎమ్మెల్యేలు సరాసరిన ఏడాదికి రూ. 1.12 కోట్లు ఆర్జిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. 5. ఆ తర్వాతి స్థానంలో మహరాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 43.4 లక్షల సంపాదిస్తూ రెండో స్థానంలో ఉన్నారు. 6. ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు అతితక్కువ ఆదాయం పొందుతున్నట్లు ఏడీఆర్ సర్వే విశ్లేషించింది. ఆ రాష్ట్రంలో 63 మంది ఎమ్మెల్యేల ఆదాయాల్ని విశ్లేషించగా.. ఒక్కొక్కరు సగటును రూ. 5.4 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేల ఆదాయం రూ. 7.4 లక్షలు. 7. ఆదాయార్జనలోను లింగ వివక్ష స్పష్టంగా కనిపించింది. మహిళా ఎమ్మెల్యేల కంటే పురుష ఎమ్మెల్యేల ఆదాయం రెండు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పురుష ఎమ్మెల్యేల వార్షికాదాయం 25.85 లక్షలుగా ఉండే మహిళా ప్రజాప్రతినిధుల ఆర్జన కేవలం రూ. 10. 53 లక్షలే. మొత్తం 3,145 మందికిగాను 55 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లో వృత్తి వివరాలు పేర్కొనలేదు. ఇక వ్యాపారాన్ని 777 మంది, వ్యవసాయాన్ని 758 మంది తమ వృత్తిగా పేర్కొన్నారు. 1,052 మంది విద్యార్హత 5 నుంచి 12వ తరగతి వరకూ పేర్కొనగా వారి వార్షికాదాయం 31 లక్షలుగా ఉంది. 1,997 మంది విద్యార్హతను డిగ్రీగా పేర్కొనగా వారి ఆదాయం 20.87 లక్షలు. 134 మంది ఎమ్మెల్యేల విద్యార్హత 8వ తరగతి కాగా.. వారి ఆదాయం 89.88 లక్షలు. -
9 మంది పాత కాపులే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన గులాబీ దళపతి టిక్కెట్ల కేటాయింపులో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 105 అసెంబ్లీ టిక్కెట్లను ప్రకటించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిలో కేవలం ఇద్దరిని మాత్రమే మార్చారు. మెదక్ జిల్లా ఆందోల్‌లో సినీనటుడు బాబూమోహన్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలుకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కలేదు. చెన్నూర్‌లో ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం ఇచ్చిన కేసీఆర్.. మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లిచ్చారు. నలుగురైదుగురికి తప్ప సిట్టింగులందరికీ సీట్లిస్తానని చెబుతూ వచ్చిన ఆయన ముందుగా ఊహించిన విధంగానే చెన్నూర్‌లో ఓదెలుకు చెక్ పెట్టారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకరిద్దరిని మారుస్తారని ప్రచారం జరిగినా, ఓదెలుకు మినహా అందరికీ సీట్లిచ్చి ప్రతిపక్షాలను, రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. చెన్నూర్ విషయంలో ఏడాదిగా సందిగ్ధతే! 2013లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి 2014లో తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ మంత్రి గడ్డం వినోద్ 2017లో మరోసారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్ సోదరులు టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి చెన్నూర్ సీటు విషయంలో పలు అపోహలు చోటు చేసుకున్నాయి. గతంలో మంత్రిగా వినోద్ ప్రాతినిథ్యం వహించిన చెన్నూర్ సీటును వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఇస్తారనే ప్రచారం జరిగింది. పెద్దపల్లి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో వివేక్ పోటీ చేస్తే బాల్క సుమన్‌కు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే గత రెండు నెలల్లో పరిణామాలు మారిపోయాయి. వివేక్‌కు ఎంపీ సీటును ఖాయం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వినోద్‌కు మొండిచెయ్యి చూపారు. అదే సమయంలో బాల్క సుమన్‌కు చెన్నూర్ సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ సమాచారం జిల్లా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేశారు. సుమన్ సైతం తాను మంచిర్యాల జిల్లా నుంచే రాజకీయాల్లో ఉంటానని ఇటీవలే తేల్చిచెప్పారు. ఇందులో భాగంగానే చెన్నూర్ నుంచి ఓదెలు ప్రస్థానం ముగిసింది. మంచిర్యాలలో 14 మంది ఆశావహులు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన కేసీఆర్ ఆశావహుల ఆశలపై నీళ్లు కుమ్మరించారు. మంచిర్యాల సీటు కోసం రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్‌రావుతో పాటు 14 మంది ఆశావహులు ఉన్నారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ బీసీ కార్డుతో రంగంలో నిలవగా, ఓ బట్టల వ్యాపారి, ఓ పారిశ్రామికవేత్త, కాంట్రాక్టులు చేసే మరికొందరు లైన్లో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకే టికెట్టు కేటాయించడంతో టికెట్లు ఆశించిన నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బేర సత్యనారాయణ చెపుతున్నారు. కారెక్కిన ముగ్గురికి మళ్లీ చాన్స్ 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ నుంచి, కోనేరు కోనప్ప సిర్పూర్ నుంచి అనూహ్య విజయం సాధించారు. గెలిచిన వెంటనే వారు రాష్ట్రంలో బీఎస్పీనే టీఆర్ఎస్లో విలీనం చేసి, ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. ఆ వెంటనే ఐకే రెడ్డి రాష్ట్ర మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి జిల్లాలో కేవలం ముథోల్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు వేరే పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఈసారి టీఆర్ఎస్ టికెట్టు పొందడం విశేషం. ఎంపీ నగేష్ బోథ్ ఆశలపై నీళ్లు టీడీపీ తరపున బోథ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన గోడెం నగేష్ గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరి, ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచినప్పటికీ, ఎమ్మెల్యే అయి ఉంటే మంత్రిగా అవకాశం వచ్చేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. అందుకే ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాజా టికెట్ల పంపిణీలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకే తిరిగి అవకాశం లభించడంతో నగేష్ ఆశలు గల్లంతయ్యాయి. ఖానాపూర్‌లో రాథోడ్‌కు ఆశాభంగం గతంలో ఖానాపూర్‌లో టీడీపీ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎం పీగా ప్రాతినిధ్యం వ హించిన రాథోడ్ రమేష్ గత సంవత్స రం టీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పార్టీలో చేరిన రోజే ప్రకటించారు. ఖానాపూర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా సీటు మార్పు ఖాయమనే భావన కల్పించా యి. అనూహ్య పరిస్థితుల్లో ఖానాపూర్ సీటు ను తిరిగి రేఖానాయక్‌కే కేటాయించడం స్థానికంగా రాథోడ్ వర్గంలో విస్మయాన్ని కల్గిం చింది. ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్‌కే కాకుం డా ఆసిఫాబాద్‌లో ఆయన కుమారుడికి కూ డా సీటు వస్తుందని ప్రచారం జరిగింది. రే ఖానాయక్కు తిరిగి సీటు లభించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాథోడ్ వర్గం ఉంది. బెల్లంపల్లిలో ప్రవీణ్‌కు నిరాశే! బెల్లంపల్లి నియోజకవర్గంలో 2014లోనే ప్రస్తుత జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌కు బీఫారం దాకా వచ్చి న టికెట్టు అనూహ్యం గా నెన్నెల ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన దుర్గం చిన్నయ్యకు దక్కింది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం పలుకుబడితో చిన్నయ్యకు అప్పట్లో టికెట్టు లభించిందనే ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా బెల్లంపల్లి సీటు సాధించాలనే పట్టుదలతో ఆయన ఉన్నప్పటికీ, కేసీఆర్ తిరిగి చిన్నయ్యకే సీటును ఖరారు చేశారు. ఇటీవల బెల్లంపల్లి మున్సి పల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గించడంలో ప్రవీణ్ పాత్ర కొంత వివాదాస్పదమైంది. ఈ పరిణామాల్లో ఆయనకు టిక్కెట్టు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. -
సంబరాలు చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల కార్యకర్తలు
-
60మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం ప్రాధాన్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలకే ఈసారీ కూడా టికెట్లు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో జిల్లా లోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. దీంతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. నాలుగేళ్లపాటు వివిధ పనులతో, వ్యక్తిగత వ్యాపకాలతో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పూర్తి సమయా న్ని గెలుపు కోసం కేటాయించేలా రాజకీయ అనుభవం ఉన్న సహచరులతో ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు మరోసారి అవకాశం ఇస్తామని ఇటీవల ప్రకటించడం వీరికి కొండంత ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు నియోజకవర్గాల్లో.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటలలో టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వీరిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయంగా అనుభవం ఉండటంతో ఆయన కొల్లాపూర్‌లో మొదటిసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అసెంబ్లీలో పాదం మోపారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్ మాత్రం అంతర్గత కుమ్ములాటల కారణంగా అప్పట్లో పరాజయం పాలయ్యారు. జిల్లాల విభజన తర్వాత టీఆర్ఎస్ మూడు స్థానాల్లో విజయం సాధించి జిల్లాలో బలమైన పార్టీగా ఉంది. ఈ పట్టును ఇదేవిధంగా కొనసాగించుకునేందుకు ప్రస్తుతం అధిష్టాన వర్గం, స్థానిక నేతలకు స్పష్టమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అసంతృప్తులకు తాయిలాలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలకుండా ఉండేందుకు అసంతృప్తులను గుర్తించి వారిని నయానో, భయానో తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి చేరుకుంటుండంతో వర్గాలు ఏర్పడ్డాయి. జైపాల్‌యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసినా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆయన చురుకుగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీ కార్యకర్తలలో ఉంది. మరోపక్క కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్, ఎడ్మ కిష్టారెడ్డిలు ఇక్కడ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ విజయం కోసం పనిచేయాలని, వీరందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం వీరితో మంతనాలు జరుపుతోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన బీసీ వర్గానికి చెందిన జైపాల్‌యాదవ్‌కు టికెట్ ప్రకటిస్తే ఆయన విజయం కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నారు. మరోపక్క ఆయనకు కాకుండా మరెవరికి టికెట్ వచ్చినా అన్ని వర్గాలు సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా శ్రేణులు సహకరించాలని పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలకు సూచిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో బీసీ ఓటర్లకు గాలం నాగర్‌కర్నూల్ జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు స్వచ్ఛంద సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, బీసీ వర్గాలకు చెందిన బైకని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన ఇటీవల తెరపైకి తీసుకొచ్చారు. బీసీలలో అధిక శాతం ఉన్న కురుమ యాదవుల ఓట్లను ఆకట్టుకునేందుకు కృషిచేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టును టీఆర్ఎస్ విజయం కోసం మళ్లిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు అందుతున్న సాగునీటి ద్వారా అధికార పార్టీకి ఓట్ల పంట పండుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెంచడంతోపాటు ప్రతి గ్రామంలో 10మంది చొప్పున సోషల్ మీడియా ప్రచారకులను నియమించుకుని ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. రాములును బుజ్జగిస్తున్న బాల్‌రాజు అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాములుతో ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇటీవల ఆయనకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర పార్టీలో రాములుకు ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి అధిష్టానం తనకు మరోసారి అవకాశం ఇస్తుందని గువ్వల బాల్‌రాజు గట్టిగా నమ్ముతున్నారు. మాజీ మంత్రి రాములు ప్రస్తావన తెస్తే మాత్రం ఆయన ఒకింత అసహనం వ్యక్తంచేస్తున్నారంటూ మాజీ మంత్రి పి. రాములు అభిమానులు లోలోపల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి ఇలాఖాలో.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ముందెన్నడూ జరగనంత అభివృద్ధిని చేసి చూపేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉధృతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి జూపల్లి ఈసారి అదే ఒరవడిని కొనసాగించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో కొల్లాపూర్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పెద్ద ఎత్తున నిధులను తన నియోజకవర్గానికి మళ్లించి పక్కా భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల కల్పన వంటివి చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మంత్రి కలియదిరుగుతూ ఒక్కో గ్రామంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల, వ్యతిరేకత ఉన్న చోట దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుందని జిల్లా నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఆ నలుగురు ఎవరో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: అధికార పార్టీకి చెందిన 39 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ తగ్గిం దంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయించిన సర్వేలో 39 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జాబితాలో తమ పేరు ఉందేమోననే సందేహం సిట్టింగుల్లో నెలకొంది. దీంతోపాటు సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న వార్తలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోతోంది. నెలరోజుల వ్యవధిలోనే తమ పరిస్థితి తారుమారు కావడంపై అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ‘డైమండ్స్’ అంటూ కితాబు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సర్వే రిపోర్టుతో అలజడి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అర్బన్ ఏరియాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు.. తమ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతున్నారు. మొత్తంగా రాబోయే సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో తెరపైకి కొత్తగా వచ్చిన సర్వే రిపోర్టు వారిలో అలజడి రేపుతోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని విధంగా ఉంది. ఒక్క నర్సంపేటను మినహాయిస్తే మిగిలిన జిల్లా అంతటా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే సమయంలో సగానికిపైగా నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఉన్నారు. ఉదాహరణకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉండగా.. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నన్నపునేని నరేందర్ కూడా ఇక్కడి నుంచే టికెట్‌ను ఆశిస్తున్నారు. మహబూ బాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో శంకర్‌నాయక్ సిట్టిం గ్ కాగా.. మాలోతు కవిత ఆశావహురాలిగా ఉన్నా రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పీకర్ మధుసూదనాచారి సిట్టింగ్ ఎమ్మెల్యేకాగా... ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు గండ్ర సత్యనారాయణ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కొండా సుస్మితాపటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా పోటీ పెరిగిన నేపథ్యంలో నేతలు ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమంటూ పార్టీ వర్గాలు తేల్చిచెప్పడంతో ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియా ప్రచారం.. ప్రజల్లో ఆదరణ తగ్గిన 39 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరేనంటూ సోషల్ మీడియాలో పేర్లు చక్కర్లు కొడుతుండడం పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబం«ధించి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ నేతకు టిక్కెట్ దక్కుతుందా.. లేదా అనే అనుమానంలో వారి అనుచరులు ఉన్నారు. ఇదే విషయాన్ని నేరుగా అడుగుతుండడంతో ప్రతిసారి సమాధానం చెప్పుకోవా ల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో లిస్టు బయటకు రావడం, దాని వెంట సోషల్ మీడియా ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. -
సిట్టింగులంతా వజ్రాలే
సాక్షి, హైదరాబాద్: పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా వజ్రాల్లాంటివారేనని, సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరా బాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం జరిగిన పార్టీ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో 30% మందికి టికెట్లు రావని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయొద్దు. గందరగోళం, అయోమయం సృష్టించాలనే ప్రయత్నంలో ఇలాంటి ప్రచారాలు చేయొద్దు. మా సిట్టింగులంతా డైమండ్లలాగా ఉన్నరు. అందరికీ బ్రహ్మాండంగా టికెట్ ఇస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈ వేదిక ద్వారా చెబుతున్నా. ఎవరైనా బాగా లేకపోతే సెట్ చేస్తాం, సముదాయిస్తాం, బాగుపడేటట్టు చేస్తాం. ఎవరికీ వెన్నుపోటు పొడవం. ఇంతకన్నా గొప్పవారు మాకు ఆకాశం నుంచి రారు. సిట్టింగులందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తం. కాకుంటే ఒకటో.. అరో ఉంటే మార్పులుంటయి తప్ప అందరికీ ఇస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు. రొటీన్ రాజకీయాలు అనే భ్రమతో మంత్రివర్గంలో మార్పులని, రేపే అని, ఎల్లుండే అని కూడా ఒక పత్రిక రాసిందన్నారు. ఇలాంటి ప్రచారాలు, ఊహాజనితమైన వార్తలు వద్దని కోరారు. కేబినెట్ ఏమీ మారదని, అంతా సుభిక్షంగానే ఉంటుందని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేస్తామన్నారు. బలహీనవర్గాలకు ఈ మధ్యనే ఇద్దరికి రాజ్యసభ అవకాశం ఇచ్చామని, మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రావడానికి అవకాశం లేని వారికి ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్ అనే పక్షపాత దృష్టి లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్లతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధి విషయంలో సంపూర్ణ అధికారాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఆర్థికంగా అద్భుతమైన పెరుగుదల ఉంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అదనపు రాబడి ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రభావశీల పాత్ర పోషించాలంటూ టీఆర్ఎస్ ప్రతినిధులంతా నాపై పెట్టిన బాధ్యతను నిర్వహిస్తా’’ అని వివరించారు. రైతులకు మే నెల 10న పాస్‌బుక్కులు, పెట్టుబడి చెక్కులు అందిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 2 గంటల్లోగానే మ్యుటేషన్ అయ్యేలా రెవెన్యూ శాఖ చర్యలను తీసుకుంటుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పత్రాలు రైతుల ఇంటికే పోస్టులో లేదా కొరియర్లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అవినీతికి ఆస్కారమే ఉండదని అన్నారు. ‘‘గతంలో గల్లీగల్లీకో పేకాట క్లబ్బు ఉండేది. సంసారాలు కూలిపోయేవి. ఈ క్లబ్బులో కాంగ్రెస్ నేతలకే వాటాలుండేవి. కానీ ఇప్పుడు క్లబ్బుల్లో లేకుండా చేశాం. దేశంలోనే ధనికులైన యాదవులు తెలంగాణలో ఉండేలా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. గొర్రెల పంపిణీతో ఒక్క ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్ల సంపదను యాదవులు సృష్టించారు’’ అని పేర్కొన్నారు. -
బయలుసీమలో ఆధిపత్యం ఎవరిదో ?
బొమ్మనహళ్లి : మధ్య కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో ఈసారి ఏ పార్టీని విజయం వరిస్తుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాల్లోని అధిక భాగాన్ని బయలు సీమగా పరిగణిస్తారు. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపురం, కోలారు, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో తొలి నుంచీ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కనుక కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య అక్కడ ముఖాముఖి పోటీలు అనివార్యమవుతున్నాయి. మొత్తం 44 స్థానాలున్న ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి లాంటి అంశాలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు వీరశైవ–లింగాయతకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న సిఫార్సు కూడా ఆ పార్టీ పుట్టి ముంచేట్లు ఉన్నాయి. ముఖ్యంగా దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో వీరశైవ–లింగాయత్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఈ జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించే ఎస్సీ, ఎస్టీలు ఈ జిల్లాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉండడం ఆ పార్టీకి లాభించే అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నందున, ఎక్కువ నియోజక వర్గాల్లో కొత్త ముఖాలను పరిచయం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. గత శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇక్కడ గణనీయమైన ఫలితాలను సాధించింది. తుమకూరు జిల్లాలోని మొత్తం 11 స్థానాలకు గాను ఆరింటిని తన ఖాతాలో వేసుకుంది. ఇదే జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర అనూహ్యంగా జేడీఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అలాగే కోలారు జిల్లాలోని మాలూరులో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఎస్ఎన్. కృష్ణయ్య శెట్టి సైతం జేడీఎస్ అభ్యర్థి చేతిలో పరాభవం చెందారు. ఈ జిల్లాల్లోని అనేక నియోజకవర్గాలకు జేడీఎస్ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి 2013 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరిట వేరు కుంపటి పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఈసారి ఈ ప్రాంతంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. 2007లో ఏర్పడిన చిక్కబళ్లాపురం జిల్లాలో ఆ పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి బళ్లారి ఎంపీ బీ. శ్రీరాములును పోటీ చేయించడం ద్వారా ఎస్టీ ఓట్లను పార్టీ వైపునకు సంఘటిత పరచాలని బీజేపీ యోచిస్తోంది. ఇంకా రామనగర జిల్లాలో సీపీ.యోగీశ్వర్ (చన్నపట్టణ), బెంగళూరు గ్రామీణ జిల్లాలో బీఎన్. బచ్చేగౌడ (హొసకోటె), కోలారు జిల్లాలో కృష్ణయ్య శెట్టి లాంటి సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునే దిశగా పావులు కదుపుతోంది. 2013 ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణ జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి స్థానాలను, కోలారు జిల్లాలో కాంగ్రెస్ మూడు, జేడీఎస్, ఇండిపెండెంట్ చెరొకటి, చిక్కబళ్లాపురం జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి, ఇండిపెండెంట్ ఒక చోట, రామనగర జిల్లాలో జేడీఎస్ రెండు చోట్ల, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు చెరో స్థానంలో, తుమకూరు జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, జేడీఎస్ ఆరు, బీజేపీ ఒక స్థానంలో, చిత్రదుర్గ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ, బీఎస్ఆర్ కాంగ్రెస్‌లు చెరో స్థానంలో, దావణగెరె జిల్లాలో కాంగ్రెస్ ఏడు, జేడీఎస్ ఒక చోట గెలుపొందాయి. -
ఐదుగురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఐదుగురు సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని కొన్ని నెలలుగా ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ దిశగా అధిష్టానం తొలి పావు కదిపింది. శింగనమల టిక్కెట్ హామీతో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎంఎస్ రాజును టీడీపీలో చేర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై విప్ యామినీబాల.. ఆమె తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణి ఒంటి కాలిపై లేస్తున్నారు. శింగనమల పరిణామంతో మిగిలిన నలుగురు సిట్టింగ్‌లలోనూ వణుకు మొదలైందని సమాచారం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో గత ఎన్నికల్లో రెండు ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరారు. వీరిలో ఐదుగురు సిట్టింగ్‌లకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనే ప్రచారం కొద్దినెలలుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజును మంత్రి కాలవ శ్రీనివాసులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. శింగనమల టిక్కెట్టు రాజుకు ఇప్పిస్తానని కాలవ హామీ ఇచ్చి పార్టీలో చేర్పించినట్లు ఆ పార్టీలోని కీలక ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ చేరికపై శింగనమల ఎమ్మెల్యే, విప్ యామినీబాల.. ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలిసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావుతో పాటు కాలవ శ్రీనివాసులను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఎంఎస్ రాజు వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు సమక్షంలో చేర్పించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. పైగా శింగనమల టిక్కెట్టు ఇప్పిస్తామని మాట ఇచ్చారంట? మాకంటే రాజుకు ఉన్న స్థాయి ఏమిటి? అసలు రాజు గురించి మీకు పూర్తిగా తెలుసా? అని అడిగినట్లు చర్చ జరుగుతోంది. రాజు చరిత్ర ఏంటో వివరంగా ఓ నివేదికను మీకు పంపిస్తామని, పార్టీ కూడా విచారించాలని, స్వతంత్రంగా అనంతపురంలో ఓ వార్డు మెంబర్‌గా కానీ, లేదా శింగనమల నియోజకవర్గంలోని ఓ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గెలుస్తారని కానీ మీకు అనిపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటామని వారు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్టు విషయాలు తమకేమీ తెలియదని, పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎవరు వచ్చినా చేర్పించే బాధ్యత తమపై ఉందని వారు శమంతకమణి, యామినీబాలకు చెప్పినట్లు సమాచారం. మీకేదైనా సందేహాలుంటే ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిలో అలజడి ♦ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలేని సురేంద్రబాబులో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీలోని ఓ వర్గం పట్టుబట్టినట్లు తెలిసింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా అనంతపురం టిక్కెట్టు కచ్చితంగా మార్చాలని ముఖ్యమంత్రితో గట్టిగా చెప్పినట్లు సమాచారం. కొత్త అభ్యర్థి ఎవరు అనే సంగతి పక్కనపెడితే చౌదరిని మార్చడం ఖాయమని టీడీపీలో చర్చ నడుస్తోంది. ♦ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వయసైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మారుతి.. లేదంటే కోడలు వరలక్ష్మికి టిక్కెట్టు వస్తుందని చౌదరి ఆశిస్తున్నారు. అయితే వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయనే కారణంతో బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరావుకు టిక్కెట్టు ఇప్పించాలని టీడీపీలోని ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ♦ గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్టు దక్కే పరిస్థితి లేదని సమాచారం. గుంతకల్లు నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ♦ ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా టిక్కెట్టు దక్కదనే ప్రచారం ఉంది. అయితే సామాజికవర్గ సమీకరణాలు బేరీజు వేస్తే తనకు టిక్కెట్టు ఖాయమనే ఆలోచనలో పల్లె ఉన్నారు. కాలవపై గుర్రు అనంతపురం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గంతో పాటు పుట్టపర్తిలో సిట్టింగ్‌లను మారుస్తారనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. రాజు చేరిక శింగనమలలో అలజడి రేపగా.. తక్కిన నాలుగు స్థానాల్లోని అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇన్చార్జ్ మంత్రితో పాటు అధిష్టానంతో మాట్లాడి, పార్టీ నిర్ణయం అదే అయితే ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ విషయాల్లో సీఎంకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వీరంతా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శింగనమల విషయంలో రేగిన చిచ్చు టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.