సాక్షి, గచ్చిబౌలి: బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వేడి అలుముకుంది. ఆయా పార్టీలు, అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు చేసి తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఆశావహుల పూర్తి వివరాలు సేకరించారు. గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారితో విడివిడిగా ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ కార్పొరేటర్లలో ఒకరిద్దరికి టికెట్ రాకపోవచ్చనే ప్రచారం జరిగింది. దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందడంతో జీహెచ్‌ఎంసీలో సిట్టింగ్ కార్పొరేటర్లకే టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠా నం మొగ్గు చూపుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ట్రెండ్ చేంజ్.. కాదేదీ గుర్తుకు అనర్హం..!
టీఆర్‌ఎస్ నుంచి..
► కొండాపూర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్‌పటేల్, కొండా విజయ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ పోటీ పడుతున్నారు.
►గచ్చిబౌలి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో పాటు కొండా విజయ్, గణేష్ ముదిరాజ్, సత్యనారాయణ, శేరిలింగంపల్లి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మారబోయిన రవి యాదవ్, కొండా విజయ్ టికెట్ ఆశిస్తున్నారు.
► మాదాపూర్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ కుటుంబ సభ్యులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
►మియాపూర్ డివిజన్ నుంచి ఉప్పలపాటి శ్రీకాంత్ , గంగాధర్ రావు, వాసవి చంద్రశేఖర్, మోహన్ ముదిరాజ్, అన్వర్ షరీఫ్‌లు ఆశిస్తుండగా, చందానగర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో పాటు మరో 15 మంది పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ కసరత్తు..
►శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది.
► కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రవికుమార్ ప్రకటించారు.
► గచ్చిబౌలి డివిజన్ అభ్యర్థిగా మన్నె సతీష్, శేరిలింగంపల్లి అభ్యర్థిగా ఎల్లేష్, మాదాపూర్ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్, మియాపూర్ అభ్యర్థిగా ఇలియాస్ షరీఫ్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
► హఫీజ్‌పేట్, చందానగర్ డివిజన్లకు మహిళా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోటీకీ సై అంటున్న బీజేపీ..
►ఈ సారి అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అధిష్ఠానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
►కొండాపూర్ నుంచి బాల్ధా అశోక్, చందు యాదవ తో పాటు, ప్రముఖ సినీ నటుడు తన కొడుకు కోసం టికెట్ ఆశిస్తున్నారు.
►గచ్చిబౌలి డివిజన్ నుంచి రవీంద్రప్రసాద్ దూబే, సురేష్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, అనీల్ గౌడ్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
► శేరిలింగంపల్లి నుంచి కుమార్ యాదవ్, నర్రా జయలక్ష్మీ, రాజు శెట్టి, మారం వెంకటేష్, శాంతి భూషణ్, శివకుమార్‌లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
►మాదాపూర్ నుంచి జంగయ్య యాదవ్, హరికృష్ణ, నవీన్, హఫీజ్‌పేట్ డివిజన్ నుంచి మహిళ అభ్యర్థిని బరిలో దింపేందుకు మహేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, కోటేశ్వర్ రావు కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు.
► మియాపూర్ నుంచి రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, డీఆర్‌ఎస్‌కె ప్రసాద్, ఆకుల మహేష్‌లు పోటీ పడుతుండగా చందానగర్ డివిజన్ నుంచి తమ కుంటుంబ సభ్యులను పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజశేఖర్ ఆసక్తిగా ఉన్నారు.
►టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వకుంటే వారిని బీజేపీలో చేర్చుకొని బరిలో దింపే యోచనలో ఉన్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment