బెంగళూరు: రాబోయే ఎన్నికల కోసం కర్నాటకలో అధికార బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి అధికారం కోసం బీజేపీ మరో ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్నాటక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మళ్లీ టికెట్లు దక్కుతాయని యడియూరప్ప సూచనప్రాయంగా చెప్పారు. ఎవరో నలుగురైదుగురు తప్ప, అందరికీ మరోసారి పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. గుజరాత్ అసెంబ్లీకి గత ఏడాది ఎన్నికల్లో అధికార బీజేపీ సుమారు 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. ఇక్కడా అదే విధానం పునరావృతం అవుతుందేమోనని సొంతపార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించారు.
ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు సీఎం బొమ్మై సారథ్యంలోనే జరుగుతాయన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే శాసనసభా పక్ష సమావేశంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో తాను లేననే సంకేతాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment