
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది(2016) పత్తి ధర క్వింటాలుకు రూ.5,500 గిట్టుబాటు ధర వచ్చిందని.. ఈసారి కనీసం రూ.5 వేల మద్దతు ధరనైనా ఇవ్వాలని అన్నారు.
లేనిపక్షంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment