నేడు ‘ఫీజు’ పోరు
• వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
• 4వేల మందితో మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ఆరోపించింది. అసెంబ్లీ సాక్షిగా రూ.3,068 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను గతేడాది ఏప్రిల్ 1లోగా చెల్లిస్తానన్న సీఎం కేసీఆర్ నేటికీ దాన్ని అమలు చేయలేదంది. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకోవాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నాలుగు వేల మందితో మహాధర్నా నిర్వహిస్తు న్నామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థు లకు కూడా ఉన్నత విద్యనందిం చాలనే ఉద్దేశంతో నాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారన్నారు. గతంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం దరఖాస్తు చేసుకుంటే.. 2016–17లో ఆ సంఖ్య 12.97 లక్షలకు ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదంటూ వందలాది మంది విద్యార్థులు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తీరని అన్యాయం: రాఘవరెడ్డి
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ఎన్నో కల లు కన్నారని, వారం దరికీ ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ తెలం గాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యా లయంలో మీడియాతో మాట్లాడారు. ఫీజులు, మెస్‌చార్జీలు, ఉపకార వేతనాలు సకాలంలో అందని కారణంగా ఈ ఏడాది విద్యాసంస్థల్లో 60% అడ్మిషన్లు తగ్గాయ న్నారు.
యాజమాన్యాలు చేస్తున్న అవమానా లకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవా ల్సిన పరిస్థితి దాపురిస్తోందని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి, లక్షలాది మంది విద్యార్థుల భవి ష్యత్తు అంధకారం కాకుండా చూసేందుకు వైఎస్సార్‌సీపీ మంగళవారం ఉదయం 10.30కి ఇందిరాపార్కు వద్ద ఫీజుపోరు మహాధర్నా చేపట్టిందన్నారు. ఈ ధర్నాకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వం వహిస్తార న్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.