సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘కొలువుల కోసం సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ఆగస్టు 8 నుంచి 16 వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పట్టుదలతో నిర్వహించాలన్నారు.
కార్యకర్తలు ప్రతీ ఇంటికి తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిన తీరును ఓటర్లకు వివరించాలని కోరారు. పార్టీ జూలై 25న మండల కేంద్రాలలో, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే పనిచేస్తుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment