
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో అర్హులైన స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా శాట్స్ అవినీతికి పాల్పడిందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాం త్‌రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద సిఫారసుకు విద్యార్థులు సమర్పించిన పత్రాలను క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించకుండా శాట్స్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్, కోచ్‌లు పరిశీలించి సంతకాలు చేశారన్నారు. ఈ కేసును ఏసీబీ నుంచి సీబిఐకి అప్పగించాలని శ్రీకాంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment