కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాలలో జరిగిన ప్రమాదాలపై న్యాయ విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాలలో జరిగిన ప్రమాదాలపై న్యాయ విచారణ చేపట్టి.. కనీస రక్షణ చర్యలు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు. సొరంగ ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అలుగునూర్‌లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్, యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.