ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పాదయాత్ర | Gattu srikanth reddy on praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పాదయాత్ర

Published Tue, Sep 25 2018 1:50 AM | Last Updated on Tue, Sep 25 2018 6:53 AM

Gattu srikanth reddy on praja sankalpa yatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలంతా వైఎస్‌ జగన్‌ కోసం వేచి చూస్తుంటే జనం కోసం వైఎస్‌ జగన్‌ వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. జనం కోసమే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని, జగన్‌ కోసం జనం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ నవచరిత్ర సృష్టించారన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా అది మహానేత వంశానికే సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తు బాగుంటుందనే భరోసా ను పెంపొందిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రలో సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలం తా వైఎస్‌ జగన్‌ ధృడమైన నాయకత్వాన్ని చూశారని, ఆయన వస్తే ఆశలు, ఆశయాలు తీరుతాయనే ప్రగా ఢ విశ్వాసం ప్రజల్లో నెలకొందన్నారు. మరే నాయ కుడు పాదయాత్ర చరిత్రను తిరగరాసే ప్రసక్తే ఉండదన్నారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌ సీఎం ఎప్పుడు అవుతారా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడుగా, రైతు రాజుగా అవుతారన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు.

ఏపీలో పోలవరం, పట్టిసీమ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు దుర్నీతిని ఎండగడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీకి అండగా ఉండా లని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు బి.అనిల్‌కుమార్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, వి.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement