
ప్లీనరీలో రెండు అంశాలపై తీర్మానం
ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరిగే ప్లీనరీలో తెలంగాణ తరుఫున రెండు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరిగే ప్లీనరీలో తెలంగాణ తరుఫున రెండు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండు తీర్మానాల్లో ఒకటి.. సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానమని, ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది.. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం అని, ఇందులోనూ తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ప్లీనరీకి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులంతా నిర్ణీత సమయానికంటే ముందే చేరుకోవాలని సూచించారు.