ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు | Reach the plenary timely says gattu Srikanth reddy | Sakshi
Sakshi News home page

ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు

Published Fri, Jul 7 2017 6:38 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు - Sakshi

ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు

ప్లీనరీ సమావేశాలకు తెలంగాణలోని పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని గట్టు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

సిటీబ్యూరో: ఈ నెల 8, 9 తేదీల్లో  గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనున్న వైఎస్సార్‌ సీపీ 3 వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు తెలంగాణలోని పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎనమిదవ తేదీ ఉదయానికి నిర్ణీత సమయానికన్నా ముందే పార్టీ ప్రతినిధులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.

8 వ తేదీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజు అని కూడా ఆయన గుర్తు చేశారు. ప్లీనరీ తెలంగాణ తరపు నుంచి రెండు ముఖ్య తీర్మానాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఒకటి సామాజిక , రాజకీయ ఆర్థిక తీర్మానం కాగా ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో - ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం. ఇందులో కూడా తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ఉప అంశాలను వేదికపైనే నేరుగా తెలియజేస్తామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement