
మిర్చి రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: మద్దతుధర లేక అల్లాడిపోతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రం గంలోకి దిగి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష రెండోరోజు కార్యక్రమానికి హాజరయ్యారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పం కిషన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పత్తి సాగు వద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మిర్చి, కంది సాగు చేశారని, తీరా పంట చేతికి వచ్చాక ధర లేకుండా పోయిందన్నారు. దీంతో పంట లను చేలలోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.