Chilli crop
-
గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న మిర్చి రైతులను కలవనున్నారు. పర్యటనలో భాగంగా మిర్చి మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. -
మిర్చి రైతులు నష్టపోవద్దు
సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మిరప పంటకు ఈనాడు తెగులు
-
Fact Check: మిరప పంటకు ‘ఈనాడు తెగులు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప పంటకు ‘ఈనాడు తెగులు’ సోకింది. విత్తు నుంచి విక్రయం వరకు మిరప రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం ఆ పత్రిక అక్కసుకు కారణమైంది. మిరప పంటపై ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా మిరప రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. ఆర్బీకేల ద్వారా విత్తనాన్ని అందించడమే కాకుండా, పెట్టుబడి తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు శిక్షణ ఇస్తోంది. ఆర్థికంగా, మార్కెట్పరంగా రైతుకు తోడ్పాటునందిస్తోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా మిరపకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణమూ పెరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే మిరప రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు మరోసారి అవాస్తవాలతో ‘ఎర్ర బంగారానికి.. అప్పులే దిగుబడి’ అంటూ అబద్ధాలను అచ్చేసింది. ఏటా పెరుగుతున్న సాగు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో మిరప అత్యధికంగా సాగవుతుంది. కోల్డ్ స్టోరేజి యూనిట్లతో పాటు గుంటూరు మిర్చి యార్డు, ఐటీసీ వంటి బహుళ జాతి సంస్థలూ మిర్చి కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోంది. వీటి ఫలితంగా మిరప క్వింటా రూ. 20 వేలకు పైగా ధర పలుకుతోంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మిరప పంటకు గడిచిన ఏడాదికన్నా అధికంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసి అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ మద్దతు, మంచి ధర కారణంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇటీవల రాయలసీమ జిల్లాల్లో కూడా మిరప విస్తీర్ణం పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో బాడిగ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా శిక్షణ మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ కార్యక్రమాలను ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం, గుంటూరు లాంలోని మిరప పరిశోధన స్థానం, ఐఐహెచ్ఆర్, బెంగళూరు శాస్త్రవేత్తల సహకారంతో మిరపలో నల్లి నివారణకు చర్యలు చేపట్టారు. రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఐటీసీ వంటి సంస్థల సహకారంతో నారు నుంచి కాయ కోసి ఎండబెట్టే వరకు నాణ్యమైన మిరప దిగుబడి కోసం మొబైల్ యాప్ ద్వారా 3 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. విచక్షణ రహితంగా పురుగు మందుల వినియోగాన్ని నిరోధించేందుకు ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మిరప పంటకు సోకే థ్రిప్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. నల్లతామర, జెమిని వైరస్ తెగుళ్ల నివారణపై ప్రతి 15 రోజులకోసారి అవగాహన కల్పిస్తునారు. మిరపలో అభ్యుదయ రైతుల అనుభవాలు, సూచనలను రైతు భరోసా చానల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మిగతావారికి తెలియజేస్తున్నారు. నాణ్యమైన నారు కోసం నర్సరీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ నర్సరీ చట్టం పగడ్బందీగా అమలు చేస్తున్నారు. షేడ్నెట్లలో మిరప నారు పెంపకం కోసం రైతులకు ఉద్యాన మిషన్ ద్వారా రాయితీలు అందిస్తున్నారు. ఉచిత పంటల బీమా.. పెట్టుబడి రాయితీ మిరప పంటను ఈ–క్రాపింగ్ చేసి, ఉచిత పంటల బీమా వర్తింపజేశారు. విపత్తుల్లో నష్టపోయిన మిరప రైతులకు అదే సీజన్లో పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు. మిరప పంటను వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా 2016 నుంచి వేర్వేరు జిల్లాల్లో నోటిఫై చేస్తున్నారు. అదే విధానాన్ని నేటికీ కొనసాగిస్తున్నారే తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు. పంట కోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడులను లెక్కించి హామీ దిగుబడికన్నా తగ్గితే బీమా పరిహారం మళ్లీ సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తున్నారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు 1,49,180మంది రైతులకు రూ.566.05 కోట్ల బీమా పరిహారం చెల్లించారు. 2022 ఖరీఫ్‌లో ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో దిగుబడి ఆధారిత పథకం కింద, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణ ఆధారంగా నోటిఫై చేశారు. పంట కోత ప్రయోగాల ఫలితాల ఆధారంగా పరిహారం చెల్లించారు. 2023–24 సీజన్లో ఒకే రీతిలో పరిహారం లెక్కించేలా చర్యలు 2023–24 సీజన్లో కూడా మిరప పంటకు పంటల బీమా కవరేజ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా ప్రస్తుతం అమలవుతున్న మిరప పంటను ఒకే విధంగా బీమా పథకంలో చేర్చేలా కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీలో పరిశీలించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి తగిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం మిరప రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడు ప్రభుత్వంపై బురద జల్లేలా కథనాన్ని అల్లింది. -
వ్యాపారంతో నష్టం.. బాగు చేసిన సాగు
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ఆకుల గణపవరానికి చెందిన ఓబుల్‌రెడ్డి ఓ సాధారణ వ్యాపారి. ద్విచక్ర వాహనంపై ఊరూరా తిరుగుతూ ఎలక్ట్రిక్ వస్తువులను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వ్యాపారం కలిసిరాక అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం వ్యవసాయం వైపు మళ్లాడు. ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. బహుళ పంటలు పండిస్తే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందని నిరూపిస్తున్నాడు. తొలి మూడేళ్లు పత్తితో పాటు బీర, సొర, దోస, కాకర వంటి కూరగాయలతోపాటు ఆకు కూరలు, బంతి పంటను సాగు చేశాడు. రూ.35 వేల పెట్టుబడితో సాగు చేసి రూ.1.80 లక్షల చొప్పున ఆర్జించాడు. విరగ పండిన మిరప ఓబుల్‌రెడ్డి ఈ ఏడాది మిరప పంట వేశాడు. నల్ల తామర పురుగు బారిన పడకుండా పంటను కాపాడుకునేందుకు వేప గింజల కషాయం, దోమ నివారణకు తూటికాడ కషాయం పిచికారీ చేశాడు. మొక్క ఎదుగుదలకు కోడిగుడ్డు, నిమ్మరస ద్రావణం, చేప, బెల్లం ద్రావణం, తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడంతో పంట ఏపుగా ఎదిగింది. కషాయాలు, కలుపుతీత, పీఎండీ విత్తనాలకు రూ.35 వేలు, కోతలకు రూ.1.20 లక్షలు, కౌలుకు రూ.12 వేల చొప్పున మొత్తం రూ.1.67 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తొలి కోతలోనే 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అత్తలూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం మార్కెట్ ధర కంటే క్వింటాల్‌కు రూ.3 వేల అదనంగా చెల్లించి.. రూ.23 వేల చొప్పున కొనుగోలు చేస్తోంది. మిగిలిన రెండు కోతల్లో మరో 15నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఒక్క మిరపకే రూ.7 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం కన్పిస్తోంది. పెట్టుబడి పోను రూ.5.30 లక్షల వరకు మిగులుతుండటంతో ఓబుల్‌రెడ్డి ఆనందానికి అవధులు లేవు. అప్పులన్నీ తీర్చేశా వ్యాపారం కలిసిరాక అప్పుల పాలయ్యా. భూమిని నమ్ముకుని అప్పులన్నీ తీర్చేశా. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తోంది. రసాయన రహితంగా పండించిన మిరపను కొనేందుకు పోటీ పడుతున్నారు. మంచిరేటు వస్తోంది. పెట్టుబడికి 4 రెట్లు ఆదాయం ఆర్జించగలుగుతున్నా. – ఓబుల్‌రెడ్డి, గణపవరం, పల్నాడు జిల్లా -
ఏన్కూరులో ఎల్లో చిల్లీ!
ఏళ్ల తరబడి మనం ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చిమిర్చిని, ఎర్ర రంగులో ఉండే ఎండుమిర్చిని చూస్తున్నాం.. వంటల్లో వాడుతున్నాం.. కానీ పసుపు రంగు మిర్చిని ఎప్పుడైనా చూశారా? కూరగాయలు అమ్మే కొన్ని పెద్ద దుకాణాల్లో పసుపు రంగులో ఉండే క్యాప్సికం (బెంగళూరు మిర్చి) కన్పిస్తుంది. కానీ ఎల్లో మిర్చి కనబడదనే చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లాలో ఓ రైతు మాత్రం ఈ వెరైటీ మిరపను సాగు చేస్తున్నాడు. దీని దిగుబడి, ధర ఆశాజనకంగా ఉందని ఆయన చెబుతున్నాడు. ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన రైతు కొండపల్లి నరేష్ ఓ రోజు యూట్యూబ్‌లో సాధారణ మిర్చి సాగుకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకచోట పసుపు రంగులో ఉన్న మిర్చి అతని దృష్టిని ఆకర్షించింది. ఒకింత లోతుగా పరిశీలించే సరికి కొన్నిచోట్ల ఈ పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వివరాలు ఆరా తీశాడు. వరంగల్, గుంటూరు వ్యాపారులు ఈ రకం మిర్చిని కొనుగోలు చేస్తారని తెలిసింది. గతేడాది క్వింటాల్‌కు రూ.65 వేల వరకు ధర పలికిందని కూడా తెలుసుకున్నాడు. దీంతో వరంగల్ వ్యాపారులను సంప్రదించాడు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడమే కాకుండా వారి వద్దే ఎల్లో మిర్చి విత్తనాలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పది కుంటల భూమిలో పంట వేశాడు. సాధారణ మిర్చి పంటలాగే సాగు పద్ధతులు అవలంబించగా రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అయింది. తాజాగా తొలి తీతలో ఐదు క్వింటాళ్ల దిగుబడి రాగా ఇంకా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడికి అవకాశముందని నరేష్ చెబుతున్నాడు. ఈ రకం మిర్చికి తెగుళ్ల బెడద తక్కువేనని.. సాధారణ మిర్చితో పోలిస్తే 50 శాతం తక్కువ వైరస్లు సోకుతాయని చెప్పాడు. నల్లి ప్రభావం తక్కువగా ఉండగా, తెల్లదోమ మాత్రం కాస్త సోకిందని తెలిపాడు. మందులు, రంగులు, చిప్స్‌లో.. పసుపు రంగు మిర్చి సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.65 వేల ధర పలకగా ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యే ఉంది. ధర పెరిగేవరకు ఆగుదామని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఈ మిర్చిని మందులు, రంగుల తయారీతో పాటు బ్రాండెడ్ కంపెనీల చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. – కొండపల్లి నరేష్, రైతు ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది ఖమ్మం జిల్లాలో పసుపు రంగు మిర్చి సాగు ఇటీవలే మా దృష్టికి వచ్చింది. మార్కెట్లో ఈ రంగు మిర్చికి డిమాండ్ ఉంది. ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రైతులు పంట మార్చిడి చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పంట సాగుపై వివరాలు సేకరిస్తున్నాం. – పి.అపర్ణ, వైరా నియోజకవర్గ ఉద్యానవన అధికారి -
మిర్చి మిలమిల.. కలిసొచ్చిన సాగు!
కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి పంట రైతులకు లాభాలను తెచ్చి పెడుతోంది. జిల్లాలో సాధారణ సాగు 50,395 ఎకరాలు ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,26,215 ఎకరాల్లో సాగైంది. గోనెగండ్ల, ఆలూరు, హాలహర్వి, మంత్రాలయం, కోసిగి, హొళగుంద, దేవనకొండ, పెద్దకడుబూరు, ఆస్పరి, సి.బెళగల్, కల్లూరు, చిప్పగిరి తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రెండు కోతలు పూర్తి అయ్యాయి. మరో రెండు కోతలు వచ్చే అవకాశం ఉంది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో నేలపై ఎర్ర తివాచీ పరిచినట్లు మిరప దిగుబడులు మిలమిల మెరుస్తున్నాయి. రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి మిర్చి సాగులోఎకరాకు రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సగటున 25 క్వింటాళ్ల ప్రకారం దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో పండించిన మిర్చి 90 శాతం గుంటూరు మార్కెట్‌కు వెళ్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి ఎక్కువ తెలంగాణ రైతులు తెస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు నాణ్యత పరంగా మొదటి రకాలు రాకపోయినా ఈ ఏడాది క్వింటాకు గరిష్టంగా రూ.39 వేల వరకు ధర లభించింది. జిల్లాలో ఎక్కువగా బ్యాడిగ, సింజెంట, ఆర్మూర్, తేజ, సూపర్ డీలక్స్, దేవనూరు డీలక్స్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలతో పండించిన మిర్చితో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దీంతో సగటున క్వింటాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తోంది. గతేడాది మిర్చి పంటను నల్ల తామర కొంత వరకు దెబ్బతీసింది. ఈ ఏడాది దీని ప్రభావం అంతగా లేదు. ‘డ్రిప్’ సదుపాయం జిల్లాలో ఈ ఏడాది 10వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. అత్యధికంగా మిర్చికే డ్రిప్ సదుపాయం కల్పించడం విశేషం. దీంతో దిగుబడులు నాణ్యతతో వచ్చాయి. నీటి సదుపాయంతో సాగు చేసిన పొలాల్లో రికార్డు స్థాయిలో 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొందరు రైతులు మిర్చిని ఏసీ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. కలిసొచ్చిన సాగు గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామ వాసి అయిన గిడ్డయ్య... 20 ఏళ్లుగా ఎండిమిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. దానిని కొంత రూ.21వేల ప్రకారం, మరికొంత రూ.30వేల ప్రకారం విక్రయించాడు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో సాగు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు కోత కోశాడు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతోంది. మిర్చి సాగు బాగా కలసి రావడంతో గిడ్డయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కష్టానికి తగిన ఫలితం శ్రీనివాసరెడ్డి. గోనెగండ్ల మండలం కలుమూల గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఏడాది 1.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు రెండు కోతలు కోశాడు. మొదటి కోతలో 8 క్వింటాళ్లు రాగా క్వింటా రూ.21వేల ప్రకారం విక్రయించాడు. రెండో కోతలో 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ. 20వేల ప్రకారం అమ్మాడు. ఇంకా రెండు కోతలకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు ఉండడంతో కష్టానికి తగిన ఫలితం వచ్చిందని ఈ రైతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సారి చీడపీడల సమస్యలు లేవు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు భారీగా పెరిగింది. అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలు అనేకం మార్కెట్లోకి వచ్చాయి. గతేడాది మిర్చి పంటను నల్ల తామర దెబ్బతీసింది. ఈ సారి నల్ల తామర నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతేడాదితో పోలిస్తే ఈ సారి చీడపీడల సమస్యలు అంతగా లేవు. దీంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్చికి గిట్టుబాటు ధరలు లభిస్తుండటం రైతులకు ఊరటనిస్తోంది. – రామాంజనేయులు, జిల్లా ఉద్యానాధికారి, కర్నూలు -
Chilli Crop Cultivation: నల్ల తామరను జయించిన దుర్గాడ
మిరప పంటపై నల్ల తామరకు ప్రకృతి వ్యవసాయమే దీటుగా సమాధానం చెబుతోంది. రెండేళ్లుగా నల్ల తామర, మిరప తదితర ఉద్యాన పంటలను నాశనం చేస్తుండడంతో దీన్ని పెను విపత్తుగా ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కాకినాడ జిల్లాలోని మిరప రైతులు నల్ల తామర తదితర చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పంటను నిలబెట్టుకుంటున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సస్యరక్షణ మందులను వినియోగించి నల్ల తామర ఉధృతిని కట్టడి చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. దుర్గాడ గ్రామంలో 650 ఎకరాల్లో గుండ్రటి రకం మిరప సాగవుతుంటే, ఇందులో 180 ఎకరాలలో రైతులు ప్రకృతి సేద్య పద్ధతులు పాటిస్తున్నారు. ఈ మిరప పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడటం విశేషంగా చెబుతున్నారు. దుర్గాడ రకం మిర్చి విరగ పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే, అదే గ్రామంలో ఈ పొలాలకు పక్కనే ఉన్న, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతుల పొలాల్లో మిరప తోటలు నల్లతామర తదితర చీడపీడలతో దెబ్బతి న్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఫొటోలు: వివివి వరప్రసాద్, పిఠాపురం కొత్త పురుగు నల్ల తామరను నియంత్రించడంలో రసాయనక ఎరువులు, పురుగుమందుల కంటే కషాయాలే బాగా పనిచేస్తున్నాయి. ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం వంటివి వినియోగించిన పొలాల్లో మిరప పంట తామర పురుగును తట్టుకుని నిలబడింది. రసాయనిక సేద్యంలో దెబ్బతిన్న మిరప పొలాల్లో కషాయాలు, ద్రావణాలు ఉపయోగించిన చోట్ల పంట తిరిగి పుంజుకుంటుండటం విశేషం. సేంద్రియ ఎరువులు వాడిన పంట మంచి ఆదాయాన్నిస్తుండగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు అవగాహన కల్పించి వచ్చే సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. నల్ల తామర ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నాం. సేంద్రీయ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గింది. – ఇలియాజర్ (94416 56083), డీపీఎం, పకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ కుళ్లిన ఉల్లితో కషాయం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, చేప వ్యర్థాలతో మీనామృతం, అల్లం–వెల్లుల్లితో అగ్ని అస్త్రం వంటివి తయారు చేసుకొని మిరప పంటకు వాడుతూ ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. కుళ్లిన ఉల్లిపాయలు, వేపాకులతో తయారు చేసే ఉల్లి కషాయం మిరప తోటల్లో నల్ల తామరను కట్టడి చేయటంలో కీలక స్థానం పోషిస్తోంది. ఎకరా మిర్చి తోట నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా కొన్ని కాయలు కోయాల్సి ఉంది. – వెలుగుల బాబ్జి (97014 41771), ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు, దుర్గాడ ఎకరానికి రూ. 65 వేల పెట్టుబడి.. రూపాయి కూడా తిరిగి రాలేదు.. నేను గత కొన్నేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులతో మిరప సాగు చేస్తున్నా. ఐతే గత రెండేళ్ళుగా నల్ల తామర పురుగు సోకడంతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి రూ 65 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. పంట పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. రసాయనిక పురుగుమందులు పంటకు రక్షణ కల్పించ లేకపోయాయి. – ఇంటి ప్రసాద్, మిర్చి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా -
పోగొట్టుకున్న చోటనే వెతకాలి..!
సాక్షి, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్) తగ్గేదేలే అంటూ మిర్చి సాగు.. గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్‌లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 2 లక్షలు నష్టం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. వేరే పంట వేయలేక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూడా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు. జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్ గుళికలను వేయాలి. – కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల) ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు -
మిరపకు పునరుజ్జీవం.. నాకైతే నమ్మకం కుదిరింది!
నల్ల తామరపురుగు.. ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో మిరప తదితర పంటల పూతను ఆశించి రైతులకు పెనునష్టం కలిగించింది. యాదాద్రి జిల్లా భువనగిరికి సమీపంలోని రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచించిన హోమియో మందుల వివరాలు, వాడే విధానంపై 2022 జనవరి 11న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించాం. ఈ నేపధ్యంలో.. పీకేద్దామనుకున్న తోటలను సైతం పునరుజ్జీవింపజేయటంలో హోమియో మందులు అద్భుత ఫలితాలనిస్తున్నాయని రైతులు స్వానుభవంతో చెబుతున్నారు. డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త కూడా హోమియో మందులతో మిరప చీడపీడల నియంత్రణలో సానుకూల ఫలితాలు వస్తున్నాయనటం విశేషం. రూ. 5 వేలతో గట్టెక్కాం... మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా. – యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా రూ. 5 వేలతో గట్టెక్కాం... మా ప్రాంతంలో నల్ల తామరపురుగు దెబ్బకు చాలా గ్రామాల్లో మిరప తోటలు పీకేశారు. తోటలు మిగిలిన రెండు, మూడు గ్రామాల్లో మాది కూడా ఒకటి. గత నవంబర్ నుంచి మా 10 ఎకరాల్లో మిరప పొలానికి హోమియో మందులు వాడుతున్నాను. 4–5 రోజుల వ్యవధిలో ఇప్పటికి పది సార్లు పిచికారీ చేశాను. నల్ల తామరపురుగు మీద బాగానే పనిచేశాయి. 10 ఎకరాలకు కలిపి ఎంత తక్కువనుకున్నా పురుగుమందుల ఖర్చు రూ. 2 లక్షలైనా అయ్యేది. హోమియో మందులకు మాకు రూ. 5 వేలతో సరిపోయింది. దిగుబడి నలుగురితో సమానంగా వస్తున్నది. పురుగుమందులు వాడి మాకన్నా తక్కువగా దిగుబడితో సరిపెట్టుకుంటున్న కూడా ఉన్నారు. పంట మొదటి నుంచీ హోమియో మందులు మాత్రమే వాడితే ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం నేనైతే మొదటి నుంచీ హోమియో మందులే వాడతా. – యెనిరెడ్డి శ్రీనివాసరెడ్డి (83286 72773), మిరప రైతు, గొరిజవోలు గుంట పాలెం, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా నాకైతే నమ్మకం కుదిరింది! 6 ఎకరాల్లో మిరప వేస్తే ఈ ఏడాది నల్ల తామరపురుగు సోకి నాశనమైంది. ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెట్టా. అయినా, పురుగు తీవ్రంగా నష్టపరిచింది. నెల రోజులు ఏమీ చేయకుండా వదిలేశా. ఇక గొడ్లకు మేపుదాం అనుకున్నా. ఆ దశలో 3 వారాల క్రితం ‘సాక్షి సాగుబడి’లో హోమియో మందులతో తామరపురుగును నియంత్రించవచ్చని కథనం చదివి తెలుసుకున్నా. ఆర్నేరియా డయాడెమా 30 మందును పిచికారీ చేశాను. చాలా బాగా పనిచేసింది. ఇప్పటికి 2 రోజుల వ్యవధితో 5 డోసులు పిచికారీ చేశాను. ఎర్రగా మారిన తోట అంతా ఆకుపచ్చగా మారింది. ఇగుర్లు, పూత వస్తున్నది. హోమియో మందుల సంగతి ముందే తెలిసి ఉంటే పంట నష్టం చాలా తగ్గి ఉండేది. ఖర్చు కూడా తక్కువే. ఇంగ్లిష్ (రసాయనిక పురుగు) మందులు ఎకరానికి పిచికారీకి రూ. 3 వేల వరకు ఖర్చవుతుంది. దీనికి రూ. 60–70 చాలు. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. హోమియో మందు కలిపి చల్లితే చాలు. నాతో పాటు మా వూళ్లో ఇంకో 15 మంది రైతులు కూడా హోమియో వాడుతున్నారు. – బండారు దేవేందర్‌రెడ్డి (96188 85878), మిరప రైతు, బీరోలు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా తామరపురుగు కంట్రోల్ అయ్యింది 15 ఎకరాల కౌలు భూమిలో మిరప సాగు చేస్తున్నాం. నెల రోజుల నుంచి 4–5 రోజులకోసారి హోమియో మందులు పిచికారీ చేస్తున్నాను. నల్ల తామరపరుగు పూర్తిగా పోలేదు గానీ కంట్రోల్లోకి వచ్చింది. పూత, ఇగుర్లు వస్తున్నాయి. పంట మొదటి నుంచీ ఇంగ్లిష్ (రసాయన పురుగు) మందులు వాడలేదు. నూనెలు వాడేవాడిని. బూడిద తెగులు, తెల్లదోమ, తామరపురుగులకు హోమియో మందులు నెల నుంచి ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేస్తున్నాను. బాగానే పనిచేస్తున్నాయి. సమస్యలు పెరగలేదు. అలాగని పూర్తిగానూ పోలేదు. ఆకుముడత రాలేదు. ఎకరానికి 12.15 క్వింటాళ్ల ఎండు మిరప దిగుబడి వస్తుంది. ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులు కూడా వాడుతున్నారు. నూనెల కన్నా హోమియో మందుల ఖరీదు కూడా తక్కువే. – బొమ్మసాని సాంబయ్య (84669 23488), మిరప రైతు, అయనూర్, రాయచూర్ జిల్లా, కర్ణాటక హోమియో మందుల పిచికారీ ఇలా.. ద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు బాల్‌రెడ్డి ప్రత్యేక పద్ధతిని సూచిస్తున్నారు. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి, సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎం.ఎల్.ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలకొట్టినట్టు వేగంగా ఉపాలి. ఆ తర్వాత ఆ సీసాలోని మిశ్రమాన్ని 20 లీటర్ల తైవాన్ స్ప్రేయర్ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదని, మోతాదు మించితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చని బాల్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, 2,3 హోమియో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి పిచికారీ చేయకూడదన్నారు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయన్నారు. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్ప్రేయర్ ను, బాటిళ్లను శుభ్రంగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయన్నారు. (క్లిక్: మిన్నల్లి పనిపట్టే వై.ఎన్. ద్రావణం!) రెండు పిచికారీలతో సత్ఫలితాలు మిరప పంటపై ఆశించిన వెస్ట్రన్ తామరపురుగును నియంత్రించడానికి హోమియో మందులు తుజ 30, ఆర్నేరియా డైడిమా 30 పిచికారీ చేస్తే సానుకూల ప్రభావం కనిపించింది. రెండు సార్లు మాత్రమే ఈ మందులను వేర్వేరుగా వాడాము. పురుగు తాకిడి నుంచి తట్టుకొని పూత నిలబడడానికి, కొత్త పూత, పిందె రావడానికి ఈ మందులు ఉపయోగపడ్డాయి. నల్ల తామరపురుగుల సంఖ్య తగ్గింది. రసాయనాలతో పోల్చితే ఈ హోమియో మందులు ఖర్చు తక్కువే కాకుండా.. మనుషులకు కూడా హానికరం కాదు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది. – డా. ఎ.రజని (99898 09554), సీనియర్ శాస్త్రవేత్త, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు జిల్లా -
పురుగు సోకి.. రైతు రాలి!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ సాక్షి ప్రతినిధి, వరంగల్: మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది. తెగుళ్లు సోకడంతో లాభాలు పక్కనపెడితే చాలాచోట్ల పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పులు తోడయ్యాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు బతుకు చాలిస్తున్నారు. తెగుళ్లను నివారించలేని ఆ పురుగుల మందులనే తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 50 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలు తెలంగాణలో 3,58,558 ఎకరాల్లో రైతులు మిర్చి పంటలు వేశారు. అత్యధికంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 2,82,598 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. అయితే అంతుబట్టని తెగులుతో 50 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.1.72 లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా.. తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. లొంగని తెగుళ్లతో తీవ్ర నష్టాలు రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంటలో 2 లక్షల ఎకరాలకు పైగా తెగుళ్లు ఆశించాయి. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం జరిగింది. జెమిని (గుబ్బ తెగులు), తామర, వేరు కుళ్లు వంటి తెగుళ్ల దాడితో పంట రైతుల చేతికి అందడం లేదు. ఈ తెగుళ్లు వదిలించేందుకు రైతులు రూ.వేలు వెచ్చించి పురుగుల మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కానరాలేదు. మిర్చి సాగుకు ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని భావిస్తే తెగుళ్ల కారణంగా 8 నుంచి 10 బస్తాలకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన తీవ్ర చలిగాలులు కూడా కొంత దెబ్బతీశాయి కేరింతల ఇల్లు రోదిస్తోంది! మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన నారమళ్ల సంపత్ (25)కు మూడేళ్ల కూతురు ఉండగా ఇటీవలే మరో పాప పుట్టింది. చిన్నారి కేరింతలు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాయి. అంతలోనే ఆ యువరైతు సాగు చేసిన మిర్చికి తెగులు సోకింది. పంట దెబ్బ తినడంతో అప్పటికే ఉన్న అప్పుల భారం ఆత్మహత్యకు ప్రేరేపించింది. మిరప చేనులోనే కలుపు మందు తాగి బలవన్మరణం చెందాడు. సంపత్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో అర ఎకరంలో వరి సాగు చేశాడు. మిగతా మూడెకరాలతో పాటు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. గతంలోనే ఇతనికి పంట కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఉంది. తాజాగా మిర్చి సాగు చేసి అప్పు తీర్చేద్దామనుకున్నాడు. మరో రూ.5 లక్షలు అప్పు చేశాడు. కానీ తామర తెగులు సోకి పంటంతా దెబ్బతినడం, అప్పులు మీద పడడంతో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. ఈసారైనా లాభం వస్తుందని.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని నెమలిపురి గ్రామానికి చెందిన భూక్య వాగ్యా తనకున్న మూడెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. గత ఏడాది ఇదే పంట సాగు రూ.3.50 లక్షల నష్టం మిగిల్చింది. ఈసారైనా లాభం వస్తుందని ఆశించాడు. తొలుత రూ.40 వేల విలువైన విత్తనాలు విత్తినా నారు చేతికి రాలేదు. దీంతో రూ.లక్ష పెట్టి నారు కొనుగోలు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు, తామర పురుగు, వైరస్ సోకడంతో దెబ్బతింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా పంట చేతికి రాలేదు. మొత్తం మీద ఈ ఏడాది రూ.4 లక్షలు, గత ఏడాది ఉన్న అప్పు మొత్తం రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వాగ్యా తన తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అల్లుడు గత నాలుగేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కూతురూ పుట్టింట్లోనే ఉంటోంది. వాగ్యా మృతితో ఈ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది. రూపాయి వచ్చే పరిస్థితి లేక.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దగ్గు సంపత్‌రావు (48). ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామం. భార్య సుమతి, కుమార్తెలు దివ్య, నవ్య ఉన్నారు. తనకున్న ఏడెకరాల భూమిలో నాలుగెకరాలు మొదటి కుమార్తె దివ్యకు ఇచ్చి 2011లో వివాహం చేశాడు. మిగిలిన మూడెకరాలతో పాటు కుమార్తె భూమిని సైతం తానే సాగు చేస్తున్నాడు. గతేడాది ఈ ఏడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని, ఎనిమిదెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో వరి సాగు చేశాడు. అకాల వర్షాలతో మిర్చి దిగుబడి తగ్గడంతో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది తనకున్న ఏడెకరాల్లో మిర్చి పంట వేశాడు. పూతదశలో పంటను తామర పురుగు ఆశించింది. ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు కొట్టినా ఫలితం లేకపోయింది. అన్నీ కలిపి పెట్టుబడికి సుమారు రూ.7 లక్షల ఖర్చు అయింది. పంటతో రూపాయి వచ్చే అవకాశం కూడా కన్పించలేదు. అప్పు చెల్లిం చడం ఎలా అన్న ఆవేదనతో ఈ నెల 20న మిర్చి తోటలోనే పురుగుమందు తాగాడు. ఈ రెండు పట్టికలూ చాలు.. తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి ఎంత దారుణంగా తగ్గిపోతోందో, రైతులు భారీ నష్టాలు ఎలా మూట గట్టుకుంటన్నారో తెలుసుకునేందుకు. -
మిరప సహా కూరగాయలు, అలంకరణ మొక్కలకూ కొత్త రకం తామర పురుగుల బెడద
మిరప రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న కొత్త రకం తామర పురుగులు మిరప పూలతో పాటు లేత మిరప కాయలను కూడా ఆశిస్తున్నట్లు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. లక్షలాది హెక్టార్లలో సాంద్ర పద్ధతిలో సాగులో ఉన్న మిరప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. మిరప తోపాటు టమాటో, బంగాళదుంప, వంగ వంటి సొలనేసియే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలకు కూడా కొత్త రకం తామర పురుగులు సోకే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. గత ఏడాది జనవరి–ఫిబ్రవరిలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా కొత్త రకం తామర పురుగులు మిరప పూలను ఆశిస్తున్నట్లు లాం లోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గుంటూరు జిల్లాలో కొత్త రకం తామర పురుగు మిరప తోటలను ఆశించిందని లాం ఉద్యాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లోని మిరప తోటలను తామరపురుగు ఆశించిందని సమాచారం. బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యవసాయ సంబంధ పురుగు వనరుల జాతీయ బ్యూరో (ఎన్.బి.ఎ.ఐ.ఆర్.) శాస్త్రవేత్తలతో సంప్రదించిన తర్వాత ఇవి ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అనే కొత్త రకం తామర పురుగులని గుర్తించినట్లు డా. వైఎస్సార్ హెచ్.యు. వైస్ ఛాన్సలర్ డా. టి జానకిరాం, పరిశోధనా సంచాలకులు డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త రకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామరపురుగులు సొలనేసియే కుటుంబానికి చెందిన మిరపతో పాటు టమాటో, వంగ, బంగాళ దుంప వంటి కూరగాయ మొక్కలను, అలంకరణ మొక్కలను కూడా ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరు రైతులు కొత్త రకం తామర పురుగులను చూసి ఎర్రనల్లి అని భావించి సంబంధిత మందులు వాడుతున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి తెలిపారు. బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలాల్లో రైతులు భయాందోళనలో విపరీతమైన, విచక్షణారహితంగా పురుగుమందులను కొడుతున్నారు. తద్వారా పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల తాము సిఫారసు చేసిన పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి వివరించారు. సందేహాలు తీర్చుకోవటం ఎలా? ఈ సమస్య గురించి రైతులు మరింత సమచారం తెలుసుకోవాలంటే.. డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని లామ్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి – సీనియర్ శాస్త్రవేత్త డా. సి. శారద (94904 49466), శాస్త్రవేత్త డా. కె. శిరీష (99891 92223)లను అన్ని పని దినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడవచ్చు. రేపు వెబినార్ అధిక వర్షాల సందర్భంగా ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలపై ఈ నెల 24 (బుధవారం) ఉదయం 11 గం. నుంచి మ. 1.30 గం. వరకు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం జూమ్ ఆప్ ద్వారా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. జూమ్ మీటింగ్ ఐ.డి.. 823 5000 1594 పాస్వర్డ్ – 863362. యూట్యూబ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. మిద్దె తోటల సాగుపై 3 రోజుల ఆన్లైన్ కోర్సు ఇంటిపై కూరగాయలు, పండ్ల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనార్థం డిసెంబర్ 16–18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యా సంస్థ (ఇ.ఇ.ఐ.) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆసక్తి గల గృహిణులు, ఉద్యోగులు, యువత తమ ఇంటి నంచే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా శిక్షణ పొందవచ్చని ఇ.ఇ.ఐ. సంచాలకులు డాక్టర్ ఎం. జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్లు డా. ఆర్. వసంత, డా. పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ కోర్సు జరగనుంది. వంద మందికి మాత్రమే ప్రవేశం. కోర్సు ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్ కోసం... https://pjtsau.edu.in/www.eeihyd.org/ https://forms.gle/wPriDddKVao9Ecj16 ఆకాశ్ చౌరాసియా 5 రోజుల శిక్షణా శిబిరం సేంద్రియ సేద్య పద్ధతిలో బహుళ అంతస్థుల వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ 14 జాతీయ అవార్డులు దక్కించుకున్న యువ రైతు శాస్త్రవేత్త ఆకాశ్ చౌరాసియా తెలంగాణలో 5 రోజుల ఆచరణాత్మక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లెలోని ‘ఐ.డి.వి.ఎం. కామ్యవనం’ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుంది. మల్టీ లేయర్ ఫార్మింగ్ సహా 11 అంశాలపై శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ చౌరాసియా ఆరుతడి పంటల ద్వారా ఏడాది పొడవునా అధికాదాయం పొందే ఆచరణాత్మక మార్గాలపై శిక్షణ ఇవ్వటంలో ఆయన ప్రసిద్ధి పొందారు. 50 మందికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనదలచిన వారు భోజనం, వసతి, శిక్షణ రుసుముగా రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాల కోసం.. 94495 96039. - పతంగి రాంబాబు, సాగుబడి చదవండి: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
రైతు ఉసురు తీసిన పంట తెగుళ్లు
తల్లాడ: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట కళ్లముందే తెగుళ్ల కారణంగా నాశనం అవుతుంటే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. గత ఏడాది చేసిన అప్పులు రూ.5 లక్షలకు తోడు ఈ సారి మరో రూ.5 లక్షల అప్పు తోడు కావడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేటకు చెందిన పులి వెంకట్రామయ్య(40) తనకు ఉన్న ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. మూడు నెలల కిందట నాటిన పైరు పిందె దశకు రాగా.. వైరస్‌తో పాటు గుబ్బముడత, ఎర్రనల్లి తెగులు సోకింది. దీంతో పైరు పూర్తిగా దెబ్బతినడంతో తట్టుకోలేకపోయాడు. పంటల పెట్టుబడికోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాలేదు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఆదివారం తన జత ఎడ్లను రూ.50 వేలకు విక్రయించాడు. అయినా మిగతా అప్పు ఎలా తీర్చాలో తెలియక సోమవారం తెల్లవారుజామున ఇంటి వెనకాల రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య జ్యోతితో పాటు ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లాడ తహసీల్దార్ గంటా శ్రీలత, ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఎస్సై సురేశ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వివరాలు ఆరా తీశారు. -
అంతర పంటలతో తామరపురుగు విజృంభనకు చెక్ పెట్టండిలా..!
అధిక వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ పరిస్థితులు తామర పురుగు విజృంభించడానికి దోహదపడ్డాయి. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి 25–30 నుంచి బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఇప్పటికే 12–13 బస్తాల చొప్పున వాడి ఉంటారు. మార్చి వరకు దఫదఫాలుగా ఈ ఎరువులు వేస్తూ.. తరచూ పురుగుమందులు పిచికారీ చేస్తూ ఉంటారు. అధిక రసాయనాలతో మిర్చిని ఏకపంటగా సాగు చేయటం వల్లనే తామరపురుగు విజృంభించింది. విపరీతంగా రసాయనాలు గుప్పించి ఏటా మిరప సాగు చేసే భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 – 0.4 మేరకు మాత్రమే మిగిలి ఉంటుంది. మొక్కలు రసాయనిక ఎరువుల వల్ల ఏపుగా పెరిగినా రోగనిరోధకశక్తి సన్నగిల్లిపోతున్నది. అందువల్లనే మిరప పంటకు ఇప్పుడు తామర పురుగులు ఆశిస్తున్నాయి. తామర పురుగులు ఆశించిన తోటల్లో పూత రాలుతున్నది. ఆకుల పైముడత వల్ల కొత్త పూత రావటం లేదు. అనేక రకాల రసాయనిక పురుగుమందులు కలిపి పిచికారీ చేయటం వల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరపను సాగు చేసే రైతులు చీడపీడల నుంచి చాలా వరకు రక్షణ పొందుతున్నారు. అంతర పంటలు వేయటం.. జిగురు పూసిన పసుపు, నీలిరంగు అట్టలు పెద్ద ఎత్తున పెట్టుకోవటం.. ఘనజీవామృతం, జీవామృతంతోపాటు కషాయాలు, ద్రావణాలు వాడటం ద్వారా చీడపీడలను ఎదుర్కొనే శక్తి పంటలకు చేకూరుతున్నది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతులు కూడా ఇప్పటికైనా వెంటనే మిరప తోటల్లో జిగురు అట్టలు పెట్టుకోవాలి. నీలిరంగు అట్టలు ఎకరానికి 5–10 పెట్టుకుంటే పురుగు తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 100 వరకు పెట్టుకుంటే పురుగును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. మిరప మొక్కల మధ్య ఏదో ఒక అంతర పంట ఉండేలా చూడాలి. అక్కడక్కడా బంతి మొక్కలు నాటుకోవాలి. మిరప మొక్కల మధ్య కొత్తిమీర, ఉల్లి, ముల్లంగి వంటి అంతర పంటల విత్తనాలు విత్తుకుంటే కొద్ది రోజుల్లోనే మొలకెత్తి చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపుతాయి. వీటితోపాటు.. మిరప పొలం చుట్టూతా 3 వరుసలు సజ్జ, మొక్కజొన్న, జొన్న విత్తుకుంటే చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తాయి. 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు ►మిరప పంటపై తామరపురుగులను అరికట్టడానికి వేప నూనె లేదా వేప గింజల కషాయం, అగ్ని అస్త్రం, నల్లేరు కషాయంలను ఒకదాని తర్వాత మరొకటి 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు చేస్తే పంటను రక్షించుకోవచ్చు. ►1,000–1,500 పిపిఎం వేపనూనె పనిచేయదు. 10,000 పిపిఎం వేప నూనె మార్కెట్లో దొరికితే వాడుకోవచ్చు. అర లీటరు వేపనూనెను ఎమల్సిఫయర్ లేదా 100 గ్రాముల సబ్బు పొడిని 200 లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి. ►10,000 పిపిఎం వేప నూనె దొరక్కపోతే.. 5% వేపగింజల కషాయాన్ని వెంటనే పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు. వేప నూనెను లేదా 5% వేప గింజల కషాయాన్ని 4 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ►ఆ తర్వాత 4 రోజులకు అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. 100 లీ. నీటికి 4 లీ. అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. ఆ తర్వాత 4 రోజులకు నల్లేరు కషాయం పిచికారీ చేయాలి. మళ్లీ ఇదే వరుసలో వీటిని పిచికారీ చేయటం ద్వారా మిరప పంటను తామరపురుగుల నుంచే కాదు ఇతర చీడ పీడల నుంచి కూడా రక్షించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు తెలియజెబుతున్నాయి. తామర పురుగు రానీయను గత సంవత్సరం ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు చేశాను. మంచి ధర వచ్చింది. ఈ ఏడాది 1.6 ఎకరాలలో మిర్చి విత్తనాలను వెద పద్ధతిలో ట్రాక్టర్ సీడ్ డ్రిల్‌తో వేసుకొని ఖర్చులు తగ్గించుకున్నా. 70 రోజుల పంట. పూత వస్తోంది. వేపగింజల కషాయం, నీమాస్త్రం రెండేసి సార్లు పిచికారీ చేశా. బొబ్బర రాకుండా గానుగ నుంచి తెచ్చిన వేప నూనె పిచికారీ చేశా. ఇప్పటికైతే తామరపురుగులు కనిపించలేదు. రోజూ పొలాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నా. తామరపురుగులను 90% రానీయను. – చింతా వరప్రసాద్ (91211 47705), కొప్పర్రు, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా జిగురు అట్టలు, కషాయాలతో ఉపయోగం 9 ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నా. ఇందులో 2.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మిగతా పొలానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నా. పచ్చిమిర్చి – ఉల్లిపాయ కషాయం, వేపగింజల కషాయం పిచికారీ చేశాను. పసుపు జిగురు అట్టలు పెట్టాను. మిరప పువ్వుపై 10–15 తామరపురుగులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 4–5కు తగ్గింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు మాత్రమే వాడిన పొలం కన్నా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జిగురు అట్టలు, వేపగింజల కషాయం బాగా ఉపయోగపడ్డాయి. – బైకా వెంకటేశ్వరరెడ్డి (96667 13343), మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట మం., గుంటూరు జిల్లా చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
పండ్లతోటల రక్షణకు చర్యలు అవసరం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటలకు సాధారణ సూచనలు.. ⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి. ⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి. ⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. ⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. అరటి తోటలో.. ⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. ⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి. ⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి. ⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి. ⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి. ⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి. ⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి. ⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి ⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో.. ⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి. ⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి. ⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి. ⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు. బొప్పాయి తోటలో.. ⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. ⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి. ⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి. జామ తోటలో.. ⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి. ⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి. ⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి. మిరప తోటలో.. ⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి. ⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి. ⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు. ⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి. -
మిరప భళా!
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పూర్తి స్థాయిలో అనుసరిస్తే మిరప సాగులో చీడపీడలను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు అధిక దిగుబడి పొందవచ్చని నిరూపిస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు పి. శరత్చంద్ర. పాణ్యం మండలం తొగరచేడులో తన మిత్రుడు వై.రామిరెడ్డితో కలిసి ఏడెకరాల్లో రెండేళ్లుగా మిరప పంటను శరత్ సాగు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కారువంకలో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న లావణ్య రమణారెడ్డి వద్ద నుంచి కావేరి రకం దేశీ మిర్చి విత్తనాలు తెచ్చుకొని గత ఏడాది నుంచి సాగు చేస్తున్నారు. ఎకరానికి రెండు కిలోల విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెద పెట్టి మిరప పంటను సాగు చేయటం విశేషం. సాళ్ల మధ్య రెండు అడుగులు పెడుతున్నారు. మొక్కల మధ్య 9 అంగుళాల నుంచి ఒక అడుగు దూరం ఉంచుతున్నారు. మొలిచిన తర్వాత 2–3 వారాల్లో పోనాటు వేస్తున్నారు. వెద పద్ధతిలో మిరప సాగు చేయటం వల్ల జెమినీ వైరస్‌ను తట్టుకునే శక్తి పెరిగినట్లు తాము గమనించామని శరత్ తెలిపారు. నారు పీకి మొక్క నాటినప్పుడు.. మొక్క తిరిగి వేరూనుకొని తిప్పుకునే లోగా జెమినీ వైరస్ సోకుతున్నదని, విత్తనం వెద పెట్టినప్పుడు ఆ సమస్య రాదన్నారు. గత ఏడాది ఎకరానికి 15–16 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి సాధించామని, అతివృష్టి వల్ల నష్టం జరిగినప్పటికీ ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని అంటున్న శరత్ మాటల్లోనే వారి సాగు తీరుతెన్నులు.. ఘనజీవామృతం, వేపపిండి.. దుక్కిలో ఎకరానికి ఘనజీవామృతం 2 టన్నులు, వేపపిండి ఒక టన్ను వేశాం. మిరప విత్తనం వేసిన వెంటనే ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. మిరప విత్తనాలు మొలిచిన 15 రోజుల తర్వాత 20 లీ. నీటికి 40 ఎం.ఎల్. చొప్పున 10,000 పిపిఎం వేపనూనె పిచికారీ చేశాం. మొక్కలపై పచ్చదోమ, తామరపురగు గుడ్లుంటే దీని వల్ల పగిలిపోతాయి. ఆ తర్వాత వారానికి జీవామృతం పిచికారీ చేశాం. విత్తిన నెల తర్వాత ఎకరానికి టన్ను ఘనజీవామృతం, అర టన్ను వేపపిండి వేసి.. నీటి తడి ఇవ్వటంతో పాటు జీవామృతం పారించాము. 45వ రోజు పంచగవ్య (లీటరుకు 9 లీ. నీరు) పిచికారీ చేశాం. అప్పటినుంచి ప్రతి 15 రోజులకోసారి భూమిలో నీటి తడితోపాటు జీవామృతం పారించడం, పంచగవ్య పిచికారీ చేస్తున్నాం. మిరపతోపాటు ఆముదం, బంతి, జొన్న మిరప విత్తనాన్ని గొర్రుతో సాళ్లుగా వెదపెట్టిన తర్వాత.. ప్రతి 20 అడుగులకు ఒక ఆముదం మొక్క, ప్రతి 6 అడుగులకు ఒక బంతి మొక్క వేశాం. ఆముదం కొన్ని రకాల పురుగులను దరిచేరనీయదు. బంతిమొక్క వల్ల మిరప మొక్కలకు నులిపురుగుల (నెమటోడ్స్) సమస్య, వేరు కుళ్లు రాకుండా ఉంటాయి. బంతి పూలకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వస్తాయి కాబట్టి పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది. పొలం చుట్టూతా 3 వరుసలు పచ్చ జొన్న విత్తాం. తద్వారా బయటి నుంచి పొలం లోపలికి రసం పీల్చే పురుగులు రాకుండా జొన్న పంట కంచె మాదిరిగా ఉపయోగపడుతుంది. జొన్నలు తినటానికి పక్షులు వస్తాయి. మిరప మొక్కలపై కనిపించే పురుగూ పుట్రను కూడా పక్షులు తింటాయి. దోమ నివారణకు ఎకరానికి 30 నూనె పూసిన పసుపు రంగు అట్టలను, తామరపురుగులను అరికట్టేందుకు ఎకరానికి 30 నూనె పూసిన నీలం అట్టలను పెట్టాం. మగపురుగులను మట్టుబెట్టేందుకు ఎకరానికి పది ఫెరమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేశాం. ఈ విధంగా చీడపీడలను జీవనియంత్రణ పద్ధతుల్లో పంటను రక్షించుకుంటున్నాం. ఆకు ముడతకు ఉల్లిగడ్డ కషాయం ఆకు ముడత కనిపిస్తే ఉల్లిగడ్డ కషాయం పిచికారీ చేస్తున్నాం. ఎకరానికి 5 లీ. కషాయం చాలు. 20 లీ. నీటికి ఒక లీ. కషాయం కలిíపి చల్లుతున్నాం. ఆకుముడతను అరికడితే జెమినీ వైరస్ రాదు. ఈ కషాయం ద్వారా పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. ఉల్లిగడ్డ కషాయం తయారీ విధానం : ఈ కషాయం ఒకసారి తయారు చేస్తే 6 నెలలు నిల్వ ఉంటుంది. కిలో ఉల్లి గడ్డలు, కిలో లవంగాలు, అర కిలో ఇంగువ, 100 గ్రా. పచ్చ కర్పూరం కలిపి పొడి చేసి 20 లీ. నీటిలో కలపాలి. అందులో 10 లీ. దేశీ/నాటు ఆవు మూత్రం, అర కిలో పేడ కలిపి.. పొయ్యి మీద పెట్టి 5 పొంగులు వచ్చే వరకూ మరిగించాలి. సుమారు 30 లీ. కషాయం సిద్ధమవుతుంది. వడకట్టి నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. 15–20 రోజులకోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేస్తే ఆకుముడత నుంచి మిరప తోటను కాపాడుకోవచ్చని మా అనుభవంలో రుజువైంది. బవేరియా.. వర్టిసెల్లం.. పూత దశలో 3% (వంద లీ. నీటికి 3 లీ. పుల్లమజ్జిగ) పుల్ల మజ్జిగ పిచికారీ చేశాం. చిన్న పిందె దశలో సప్త ధాన్యాంకు కషాయం పిచికారీ చేశాం. పూత ఆగిపోయిన తర్వాత కూడా మరోసారి చల్లాం. విత్తిన 60–75 రోజుల మధ్యకాలంలో.. బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని (లీ. నీటికి 8 ఎం.ఎల్. చొప్పున) పిచికారీ చేశాం. ఇది చల్లిన 10–15 రోజుల మధ్యలో వర్టిసెల్లం లఖాని శిలీంధ్రాన్ని పిచికారీ చేశాం. తామరపురుగులు, దోమను అరికట్టడానికి ఈ శిలీంధ్రాలు బాగా తోడ్పడ్డాయి. మిరప పంటను ఆశించే చీడపీడలను సమర్థవంతంగా నివారించాలంటే ఇలా బహుముఖ వ్యూహాన్ని అమలు పరచక తప్పదు. జూలై 28న మిరప విత్తనం వేశాం. మార్చి 2 నుంచి మిరప పండ్లు కోస్తున్నాం. 60–70% కాయలు ఎర్రబడిన తర్వాత నీటితడితోపాటు జీవామృతం పారించిన రెండు వారాల తర్వాత మొదటిసారి మిర్చి పండ్లు కోస్తున్నాం. మొదటి కోతలో 80%, ఆ తర్వాత రెండు మూడు కోతల్లో మిగతావి కోసి ఎండబెట్టి, తేమ 10–15%కు తగ్గిన తర్వాత బస్తాలకు ఎత్తి అమ్ముతాం. లేదా కోల్డ్ స్టోరేజ్‌కి తరలిస్తాం. ఈ ఏడాది అతివృష్టి వల్ల మిరప తోటలు దెబ్బతిన్నాయి. అయినా మా తోటలో ఎకరానికి 15 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ప్రకృతి సాగు ప్రారంభించిన గత ఏడాది ఎకరానికి 16 క్వింటాళ్ల వరకు ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే మిరప రైతులకు మా ప్రాంతంలో సగటున 18 క్వింటాళ్ల (అత్యధికంగా 24 క్వింటాళ్ల) దిగుబడి వస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రకృతి/సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాకు ఎకరానికి రూ. 40 వేలు– రూ. 50 వేలు ఖర్చు అయ్యింది. రసాయనాలు వేసే వారికి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. ఎండుమిర్చిని మనదేశం నుంచి చైనా వాళ్ళు కొనకపోవడం వల్ల ధర కొంత తగ్గింది. అయినా మాకు ఎకరానికి కనీసం రూ. 1,20,000 నికరాదాయం వస్తుందని ఆశిస్తున్నాం. మేం వేసింది దేశీ రకం కావేరి మిరప. పంట నుంచి తీసిన విత్తనాలనే అడిగిన రైతులకూ ఇస్తున్నాం.. మేమూ వాడుతున్నాం. (పి. శరత్చంద్ర –99898 53366, వై.రామిరెడ్డి – 98667 60457) -
మిర్చి దందా మొదలైంది...
సాక్షి, హైదరాబాద్ : మిర్చి దందా మొదలైంది. వ్యాపారులు, దళారులు అక్రమాలకు తెరలేపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి డిమాండున్నా రైతుకు ధర ఇవ్వడంలో వ్యాపారులు మొండిచేయి చూపిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. 15–20 రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.11,275 వరకు ఉండగా, ఈ నెల పదో తేదీ నాటికి రూ.9 వేలకు పడిపోయింది. ఏకంగా రూ.2 వేలకుపైగా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలపాటు మార్కెట్‌కు మిర్చి తరలిరానుంది. కీలకమైన ఈ సమయంలో ధర పతనం అవుతుండటంతో రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. మున్ముందు ధర ఆశాజనకంగా ఉంటుందా?.. లేదా?.. అన్న భయం వారిని వెన్నాడుతోంది. గతేడాది జనవరి 10న మిర్చి ధర రూ. 11,500, 11న రూ. 11,200 పలికింది. ఫిబ్రవరి ఒకటో తేదీన రూ. 10,400, మూడో తేదీన రూ. 9,900, ఆరో తేదీన రూ. 9,100 పలికింది. చివరకు ఏప్రిల్ 27వ తేదీ నాటికి క్వింటా మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతున్న వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేశాసి బీభత్సం సృష్టించాడు. ఈ దాడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాడిలో పాల్గొన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం కూడా రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతుందా అన్న భయం అందరిలో నెలకొంది. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేశారు. దీంతో ఈసారి 87,220 మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ధర మున్ముందు కొనసాగే పరిస్థితి ఉంటుందా?.. లేదా?.. అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు పెద్దలను కూడా కలవరపరుస్తోంది. మిర్చికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదని కూడా చెబుతున్నారు. ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. అంటే ఈసారి కూడా వ్యాపారులు దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు దందా మొదలుపెడతారు. డిమాండ్ పెరిగిన సమయంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో రైతులు తమ మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిలువ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటారు. అటువంటి సమయంలో రైతులకు కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉండాలి. కానీ అవి కేవలం వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరి రైతుల నుంచి కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి
సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం సిగ్గుచేటు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళ వారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రైతును ఏడిపించే రాజ్యం, ఎద్దేడ్చిన ఎవుసం ఎన్నటికీ ముందుకు పోవని హెచ్చ రించారు. ముఖ్యమంత్రి ఇంటి ముందే రైతు ఆత్మహత్యకు పాల్పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, అంతకంటే సిగ్గు చేటు ప్రభుత్వానికి ఏముంటుందని ప్రశ్నిం చారు. రైతుల పట్ల ఎంత పాశవికంగా, నిర్ద యగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుటనే గద్వాలకు చెందిన రైతు మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదన్నారు. వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యా నని, ఆదుకోవాలని గతంలో ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయానికి మల్లేశం వచ్చాడని వివరించారు. ప్రగతిభవన్‌లో రాచరికపు భోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలను కలవడానికి సమయం లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ఇప్పిస్తా మని చెప్పడంతో ఆశ పడిన మల్లేశం కాగితాలు పట్టుకొని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని వివరించారు. ఎన్నిసార్లు తిరిగినా కనికరించకపోవడంతో అవమానభారంతో, విరక్తితో మల్లేశం ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ రైతు చావుబతుకులతో కొట్టు మిట్టాడుతున్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా పరామర్శించలేదని విమర్శించారు. మిర్చి పంటలకు గిట్టు బాటు ధరలు కావాలని అడిగితే లాఠీచార్జ్ చేసి, రైతులను రౌడీలుగా చిత్రీకరించి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, చేతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలతో ఇప్పటికే 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం ఇంటి ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి సమస్యలను పక్కన పెట్టి వచ్చే ఏడాది ఖరీఫ్ గురించి మాయమాటలు చెబుతున్నారని, ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
మిర్చి సాగుచేయమన్నది మీరేగా..
- ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి మీరే కొనండి - రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: మిర్చి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయమని గత ఏడాది రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు ప్రోత్సహించడంతోనే వారు ఎక్కువ మొత్తంలో సాగు చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దీంతో పంటకు మద్దతు ధర లభించడం లేదని పేర్కొన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంపై సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌తో చర్చించిన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతు ధర నిర్ణయించలేదని, అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేంద్రం కల్పించుకొని రూ.5 వేలు ధర, రూ.1,250 ఓవర్‌హెడ్ చార్జీలు ప్రకటించిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అనంతరం రైతులను ఆదుకోవడానికి కేంద్రం తనవంతు సాయం చేస్తుందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్ల శాతాన్ని 30 నుంచి 42 శాతానికి పెంచిందన్నారు. పెంచిన 12 శాతంలోంచి మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని ఆయన కోరారు. అంబర్పేట్ ఫ్లైఓవర్‌కు రూ. 254 కోట్లు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సమావేశమైన దత్తాత్రేయ తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. ఈ ఏడాదికి రాష్ట్రానికి 31 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు గడ్కరీ చెప్పినట్టు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.254 కోట్లు మంజూరు చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. అలాగే ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.950 కోట్లు మంజూరు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. -
మిర్చిని ఎందుకు కొనడం లేదు?: చాడ
సాక్షి, హైదరాబాద్: పత్తి పంట వేయొద్దు, మిర్చి పంట వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్, అందుకు అనుగుణంగా మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొన్ని మిర్చి రకాలు క్వింటాల్ రూ. 2 వేలు కూడా ధర లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరంగల్ ఎనుమాముల మిర్చి మార్కెట్‌ను పోలీసులతో నింపేసి రైతులను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో రౌడీలు, గూండాలు దాడి చేశారని మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం చాడ లేఖ... భూపాలపల్లి జిల్లా పరిధిలోని తాడిచెర్ల బ్లాక్ 1, బ్లాక్ 2 బొగ్గుగనుల ప్రైవేటీకరణ విషయంపై వివిధ రాజకీయపార్టీల ఆధ్వర్యంలో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి విజ్ఞఫ్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. -
మిర్చి పంటకు బోనస్ ప్రకటించాలి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ - రూ.100 కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయించాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర లేక రైతుల వద్ద మిగిలిపోయిన మిర్చి పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మద్దతు ధర లేక ఖమ్మంలో ఆందో ళనకు దిగిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. శనివారం ఢిల్లీ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లా డుతూ.. మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని, రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల వద్ద మిగిలిన పంట కొనుగోలుకు ఒక ధర నిర్ణయించి, దానికి అదనంగా బోనస్ ప్రకటించా లని కోరారు. మిర్చి రైతులను ఆదుకోవడాన్ని కేంద్రం విస్మ రించిందని ఎంపీ కవిత చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతు ధర నిర్ణయించలేదని, ఈ విషయంలో రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం (ఎంఐఎస్) కింద పంట కొను గోలుకు నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిర్చి మద్దతు ధరపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో చర్చించామని చెప్పా రు. గతేడాది మిర్చి పంటకు మద్దతు ధరకు మించి రైతులకు లాభాలు వచ్చాయని, దీంతో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున మిర్చి సాగు చేయడం వల్ల ధర పడిపోయిందన్నారు. సాగుపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వారి పంట నిల్వకు కోల్డ్ స్టోరేజీలను ఉచితంగా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 2 వేల మొబైల్ ఏటీఎంలు తపాలా శాఖతో కేంద్ర కార్మిక శాఖ ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదని, తపాలా కేంద్రా ల్లో నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించి నట్టు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో 36, ఏపీలో 56 పోస్టల్ కేంద్రాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా త్వరలో తెలంగాణలోని 2 వేల గ్రామాల్లో మొబైల్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. వాటి ద్వారా పింఛన్లు, గ్యాస్ సబ్సిడీ, ఉపాధి హామీ పథకం నిధులను పోస్టల్ సిబ్బంది ఇంటికే వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కేఎల్ఎస్ఎస్ కింద ఈపీఎఫ్‌వో సభ్యులకు రూ. 2.20 లక్షలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లకు ఇళ్ల నిర్మాణానికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం–2017లో భాగంగా సబ్సిడీ ఆన్ ఇంట్రస్ట్ కింద రూ.2.20 లక్షలు మంజూరు చేయనున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో సభ్యులు 10 మంది ఒక సహకార బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రూ.6–12 లక్షల లోపు రుణాలపై 3 శాతం వడ్డీ సబ్సిడీ, రూ.18 లక్షల వరకు రుణాలపై 4 శాతం వడ్డీ సబ్సిడీ ఉంటుందని చెప్పారు. ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి సబ్స్క్రైబర్లు ఇంటి నిర్మాణానికి 90 శాతం నిధులు తీసుకోవచ్చని తెలిపారు. ఈ స్కీం కింద రెండేళ్ల లోపు 10 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. -
ఐస్‌క్రీమ్ కాదు.. మిర్చి అమ్మండి
-
ఐస్‌క్రీమ్ కాదు.. మిర్చి పంటను అమ్మండి
టీఆర్ఎస్కు జీవన్‌రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: ఏసీ రూముల్లో ఐస్ క్రీమ్‌లు అమ్మినట్లే రైతులు కష్టపడి పండిం చిన మిర్చి పంటను అమ్మించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ నేతలకు సూచించారు. మంగళవారం విలే కరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఐస్‌క్రీమ్‌ను నిమిషాల్లో అమ్మి రూ.7లక్షలు సంపాదించాడని, కానీ ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేక పోతున్నారన్నారు. కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు, కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారన్నారు. అదే మా ర్కెటింగ్ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలన్నారు. గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక రైతులు అలమటిస్తుం టే, కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా పంటకు బోనస్ ప్రకటించాలన్నారు. రూ.1,800 ఉన్న పత్తి విత్తనాల ధరను రూ.800కి తగ్గించిన ఘనత నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిది అని చెప్పారు. -
మిర్చి రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి భూపాలపల్లి అర్బన్: మద్దతుధర లేక అల్లాడిపోతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రం గంలోకి దిగి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష రెండోరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పం కిషన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పత్తి సాగు వద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో మిర్చి, కంది సాగు చేశారని, తీరా పంట చేతికి వచ్చాక ధర లేకుండా పోయిందన్నారు. దీంతో పంట లను చేలలోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మిర్చి రైతుల పడిగాపులు
⇒ బస్తాలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్న సిబ్బంది ⇒ 15 వేల బస్తాలకు 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు ⇒ ఏప్రిల్ 2 వరకు మార్కెట్ బంద్ సాక్షి, మహబూబాబాద్: మిర్చి పంట ఈ సారి రైతాంగాన్ని చిన్నబుచ్చింది. గతేడాది మంచి ధర పలికిందని ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు మార్కెట్ అధికారుల తీరు వారిని మరింత కుంగదీస్తోంది. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో వారంలో మూడు రోజులు(సోమ, మంగళ, బుధ) మాత్రమే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆదివారమే భారీగా మిర్చితో మార్కెట్‌కు చేరుకుంటుండడంతో యార్డ్ అంతా మిర్చి బస్తాలతో నిండి పోతోంది. రోజూ వందలకొద్దీ బస్తాలు మార్కెట్‌కు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ అధికారులు పేర్కొంటుండగా రైతులు మాత్రం సరుకు అమ్ముడుపోక రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోందంటున్నారు. వాహనాలను అడ్డుకుంటున్న సిబ్బంది రైతులు మార్కెట్‌కు మిర్చిని తీసుకొస్తే మార్కెట్ సిబ్బంది మూడు రోజులుగా అడ్డుకుంటున్నారు. గేట్‌కు తాళం వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు వస్తున్న రైతులను లోపలికి రానివ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం నుంచి బుధవారం వరకు 15 వేల బస్తాలు మార్కెట్‌కు చేరుకోగా కేవలం 4,459 బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు. గిట్టుబాటూ దక్కడం లేదు.. నకిలీ విత్తనాలకు సరిగా దిగుబడిరాక ఇప్పటికే అవస్థలు పడుతున్న రైతులను గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కలవరపరుస్తోంది. మిర్చికి క్వింటాకు గరిష్ట ధర రూ.7,400 నుంచి కనిష్ట ధర రూ.5,575 వరకు పలుకుతోంది. ఏప్రిల్ 2 వరకు కొనుగోళ్లు బంద్ సోమవారం ప్రారంభమైన కొనుగోళ్లు శుక్రవారంతో ముగియనున్నాయి. వాస్తవానికి బుధవారంతోనే కొనుగోళ్లు ఆపాల్సి ఉన్నప్పటికీ మరో రెండు రోజులు మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు కొనుగోలు చేస్తామని మార్కెట్ సిబ్బంది పేర్కొన్నారు. అందుకే కొత్తగా బస్తాలు తీసుకురావొద్దంటూ గేట్ వద్ద నుంచే వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. వచ్చే శని, ఆదివారాలు బ్యాంకులు బంద్ ఉండడం వల్ల సోమవారం కూడా కొనుగోళ్లు చేయబోమని, మంగళ బుధవారాలు మార్కెట్‌కు ఉగాది సెలవు ప్రకటించినట్లు సిబ్బంది వెల్లడించారు. అందుకే ఏప్రిల్ 2 వరకు మిర్చిని కొత్తగా మార్కెట్‌కు తీసుకురావొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. -
నకిలీ విత్తనాలు అంటగట్టారు..
మోసపోయామని తెలుసుకుని మొక్కలు తీసేస్తున్న రైతులు అమరావతి: కౌలు తీసుకుని, అప్పులు చేసి మిరపసాగు చేస్తే..తీరా చెట్టు పెరిగి కాపునకు వచ్చేసరికి అవి నకిలీ అని తెలుసుకుని రైతులు తాము పెంచుకున్న మిరప మొక్కలను తామే తీసేశారు. వివరాలు..ఈ సంవత్సరం అత్తలూరు, శివారు గ్రామం నూతలపాటివారిపాలెంకు చెందిన 15మంది రైతులు 25ఎకరాలలో జీవా కంపెనీకి చెందిన జేసీహెచ్ 802 రకం హైబ్రీడ్ మిరప విత్తనాలను వేసి సాగు చేశారు. పెదకూరపాడు మండలంలోని త్రివేణి ఫెస్టిసైడ్స్ దుకాణం నుంచి ఈ విత్తనాలను తీసుకు వచ్చి నారుమళ్ళు పెంచి చేలలో నాటారు. సుమారు రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వేలరూపాయలు పెట్టుబడులు పెట్టి ఎరువులు, పురుగుమందులు వాడి తోటను పెంచారు. కాగా, కాపునకు వచ్చే సమయానికి తాము మోసపోయినట్లు తెలుసుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిరపమొక్కలు నాటిన నుంచి ఆకుల నుంచి బంతిరావటం, పూతరాకపోవటం, కాయలు పైకిలేవటం, కాసినకాపు రాలిపోవటం, పూతకూడా నిలబడకపోవటంతో తొలుత సోమవారం దుకాణదారుని ఆశ్రయించగా సమాధానం కూడా సరిగా చెప్పలేదని రైతులు వాపోయారు. సమయం మించి పోతుండటంతో కొందరు రైతులు మంగళవారం తమ మిరపచేలను పీకి వేసి మరల ఖర్చు చేసి మిరప నారు నాటటానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. మరికొందరు రైతులు స్థానిక వ్యవసాయాధికారులను ఆశ్రయించారు. నకిలీ విత్తనాల కారణంగా ఎకరాకు సుమారు 30 నుంచి 40వేల వరకు నష్టం వస్తుందని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుని, పేద కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
నర్సంపేట టు నాగ్‌పూర్
దొడ్డు మిర్చికి డిమాండ్ రోజూ ఎనిమిది లారీల సరుకు ఎగుమతి క్వింటాల్‌కు రూ.11 వేలు పలుకుతున్న ధర నర్సంపేట, న్యూస్‌లైన్: రైతులు ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి పంట సాగులో నర్సంపేట ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ప్రాంతంలో పండిన దొడ్డు మిర్చికి డిమాండ్ ఉంది. ఈ పంటకు గతంలోనే వుహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు లభిం చింది. అరుుతే కొన్ని సంత్సరాలుగా సరైన గిట్టుబాటు ధర లభించ లేదు. ఈ ఏడాది తిరిగి అత్యధిక ధర లభించడంతో నర్సంపేట నుంచి నాగ్‌పూర్‌కు మిర్చి ఎగువుతి అవుతున్నది. జిల్లాలో 20వేల హెక్టార్ల విస్తీర్ణంలో మిర్చి సాగు కా గా.. అందులో నర్సంపేట ప్రాంతంలోనే 5వేల హెక్టార్లలో సాగైంది. 80 శాతం వరకు దొడ్డు మిర్చిని సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో పాటు వర్షాలు సంమృద్ధిగా కురియుడంతో ఈ ఏడాది మిర్చి దిగుబడి కూడా బాగానే వస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలోని దాసరిప ల్లి, ఖవ్ముపల్లి, చంద్రయ్యుపల్లి, నల్లబెల్లి వుండలంలోని వూమిండ్ల వీరయ్యుపల్లి, పంతుల్‌పల్లి, రుద్రగూడెం, ఇటుకాలపల్లి, దుగ్గొండి వుండలంలోని తొగర్రారుు, చాపలబండ, గిర్నిబావి, వుల్లంపల్లి, తివ్ముంపేట, వు ర్రిపల్లి, చెన్నారావుపేట వుండలంలోని సూరిపల్లి, కోనాపురం, గురిజా ల, అమీనాబాద్, జల్లి, బోజెర్వుతో పాటు నెక్కొండ వుండలంలో కూడా మిర్చి అధికంగా సాగైంది. ఈ ప్రాంతం నుంచి రోజుకు 5 నుంచి 8 లారీ ల మిర్చి ఎగువుతి అవుతోంది. వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర లభిస్తుండగా.. నాగపూర్‌లో రూ.15 వేల వరకు ధర లభిస్తుండడంతో నాగ్‌పూర్‌కు ఎగువుతి అవుతోంది. ధర బాగా వస్తున్నది నాకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో దొడ్డు(టవూట) మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.20వేల చొప్పున రూ.40వేలు పెట్టుబడి పెట్టిన.ఎకరాకు 16 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ మిర్చిని వుహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వారం రోజుల్లో తరలిస్తా. అక్కడ క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.15 వేల ధర లభిస్తుంది. నాకు రూ.5 లక్షల మేర ఆదాయం రానుంది. గిట్టుబాటు ధర వస్తున్నందుకు సంతోషంగా ఉంది. - ఎల్లబోరుున రాములు, దాసరిపల్లి నాలుగేళ్ల తర్వాత వుంచి రోజులు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ పండించిన మిర్చి పంటకు నాగ్‌పూర్‌లో వుంచి ధర లభించేది. ఆ తర్వాత పెరిగిన ధరలు, త గ్గిన దిగుబడులతో మిర్చి పంట న ష్టాన్ని కలిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురియుడంతో రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేసిన నాకు సువూరు 30 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. వారం రోజుల్లో నాగపూర్‌కు వూ గ్రావు రైతులందరం కలిసి మిర్చిని అవుు్మకునేందుకు వెళ్తున్నాం. - వూలోతు వీరన్న, బాంజీపేట -
మిరపకుచెరుపు
పెదకూరపాడు, న్యూస్‌లైన్: మిర్చి పంటకు ఆశించిన బబ్బరు తెగులు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెగులు సోకిన మొక్కలు ఎదుగుదల లేకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో నీరు పెట్టినా ఆకులు ముడుచుకుపోయి మొక్కలు ఎండిపోతున్నాయని బెంబేలెత్తుతున్నారు. బబ్బరు తెగులుకు తోడు మాడు, కుళ్లుడు తెగుళ్లు కూడా మిర్చి పంటను పట్టిపీడిస్తున్నాయి. రసం పీల్చే పురుగులు అధికంగా ఉండి పంటకు చెరుపుచేస్తున్నాయి. ఈ తరహా పురుగులను అరికట్టేందుకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేస్తున్న ప్రయోజనం ఉండటం లేదని రైతులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 55వేల హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో అధిక విస్తీర్ణంలో మిర్చి పంట వేశారు. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో మిర్చి పంటను బబ్బరు తెగులు ఆశించడంతో రైతులు అల్లాడుతున్నారు. రసం పీల్చే పురుగులు, బొబ్బరు తెగులు కారణంగా పలు చోట్ల రైతులు మిర్చి మొక్కలను పీకి వేస్తున్నారు. పెదకూరపాడు, లగడపాడు, 75 త్యాళ్ళూరు, జలాల్పురం, హుసేన్‌నగరం తదితర ప్రాంతాల్లో మిర్చిని ముందుగా సాగు చేశారు. ఇలా సాగు చేసిన చోట్ల తెగుళ్లు అధికంగా ఉండటంతో మొక్కలు ఎదుగుదల లేక దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇచ్చే నాథుడే లేరు... తెగుళ్లతో మిర్చి రైతులు అల్లాడుతుంటే రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులు కరువయ్యారు. ఖరీఫ్ సీజన్ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరగడంతో వ్యవసాయ శాఖ అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో పొలంబడి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆ తరువాత కూడా పంటలను ఆశిస్తున్న తెగుళ్లపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యారు. తెగుళ్లకు ఏ మందులు పిచికారీ చేయాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు.