సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట భారీ ఎత్తున మార్కెట్‌లోకి వస్తోందనీ, ధర విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలంటూ మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు.
రాష్ట్రంలో 3.91 లక్షల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94395 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని వివరించారు. ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు.
ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, స్వంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రైతులు నష్టపోయారని, ఈ పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిందని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: తుమ్మల
జంగారెడ్డిగూడెం రూరల్ (ఏపీ): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాష్ట్రాలూ కలిసికట్టుగా ముందుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు నిర్వహిస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసు కుని అన్నదాతలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రి పోర్టు ఆధారంగా ఖర్చులకు ఒకటిన్నర రెట్లు రైతు కు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment