నర్సంపేట టు నాగ్‌పూర్ | Narsampet to Nagpur | Sakshi
Sakshi News home page

నర్సంపేట టు నాగ్‌పూర్

Published Thu, Feb 27 2014 2:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

నర్సంపేట టు నాగ్‌పూర్ - Sakshi

నర్సంపేట టు నాగ్‌పూర్

  •       దొడ్డు మిర్చికి డిమాండ్
  •      రోజూ ఎనిమిది లారీల సరుకు ఎగుమతి
  •      క్వింటాల్‌కు రూ.11 వేలు పలుకుతున్న ధర
  •  నర్సంపేట, న్యూస్‌లైన్: రైతులు ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి పంట సాగులో నర్సంపేట ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ప్రాంతంలో పండిన దొడ్డు మిర్చికి డిమాండ్ ఉంది. ఈ పంటకు గతంలోనే వుహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభిం చింది. అరుుతే కొన్ని సంత్సరాలుగా సరైన గిట్టుబాటు ధర లభించ లేదు. ఈ ఏడాది తిరిగి అత్యధిక ధర లభించడంతో నర్సంపేట నుంచి నాగ్‌పూర్‌కు మిర్చి ఎగువుతి అవుతున్నది. జిల్లాలో 20వేల హెక్టార్ల విస్తీర్ణంలో మిర్చి సాగు కా గా.. అందులో నర్సంపేట ప్రాంతంలోనే 5వేల హెక్టార్లలో సాగైంది. 80 శాతం వరకు దొడ్డు మిర్చిని సాగు చేశారు.

    వాతావరణం అనుకూలించడంతో పాటు వర్షాలు సంమృద్ధిగా కురియుడంతో ఈ ఏడాది మిర్చి దిగుబడి కూడా బాగానే వస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలోని దాసరిప ల్లి, ఖవ్ముపల్లి, చంద్రయ్యుపల్లి, నల్లబెల్లి వుండలంలోని వూమిండ్ల వీరయ్యుపల్లి, పంతుల్‌పల్లి, రుద్రగూడెం, ఇటుకాలపల్లి, దుగ్గొండి వుండలంలోని తొగర్రారుు, చాపలబండ, గిర్నిబావి, వుల్లంపల్లి, తివ్ముంపేట, వు ర్రిపల్లి, చెన్నారావుపేట వుండలంలోని సూరిపల్లి, కోనాపురం, గురిజా ల, అమీనాబాద్, జల్లి, బోజెర్వుతో పాటు నెక్కొండ వుండలంలో కూడా మిర్చి అధికంగా సాగైంది. ఈ ప్రాంతం నుంచి రోజుకు 5 నుంచి 8 లారీ ల మిర్చి ఎగువుతి అవుతోంది. వరంగల్ మార్కెట్‌లో క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర లభిస్తుండగా.. నాగపూర్‌లో రూ.15 వేల వరకు ధర లభిస్తుండడంతో నాగ్‌పూర్‌కు ఎగువుతి అవుతోంది.
     
    ధర బాగా వస్తున్నది

    నాకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో దొడ్డు(టవూట) మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.20వేల చొప్పున రూ.40వేలు పెట్టుబడి పెట్టిన.ఎకరాకు 16 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ మిర్చిని వుహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వారం రోజుల్లో తరలిస్తా. అక్కడ క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.15 వేల ధర లభిస్తుంది. నాకు రూ.5 లక్షల మేర ఆదాయం రానుంది. గిట్టుబాటు ధర వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
     - ఎల్లబోరుున రాములు, దాసరిపల్లి
     
     నాలుగేళ్ల తర్వాత వుంచి రోజులు  
     నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ పండించిన మిర్చి పంటకు నాగ్‌పూర్‌లో వుంచి ధర లభించేది. ఆ తర్వాత పెరిగిన  ధరలు, త గ్గిన దిగుబడులతో మిర్చి పంట న ష్టాన్ని కలిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురియుడంతో రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేసిన నాకు సువూరు 30 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. వారం రోజుల్లో నాగపూర్‌కు వూ గ్రావు రైతులందరం కలిసి మిర్చిని అవుు్మకునేందుకు వెళ్తున్నాం.
     - వూలోతు వీరన్న, బాంజీపేట
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement