
ఐస్‌క్రీమ్ కాదు.. మిర్చి పంటను అమ్మండి
టీఆర్‌ఎస్‌కు జీవన్‌రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ఏసీ రూముల్లో ఐస్ క్రీమ్‌లు అమ్మినట్లే రైతులు కష్టపడి పండిం చిన మిర్చి పంటను అమ్మించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. మంగళవారం విలే కరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఐస్‌క్రీమ్‌ను నిమిషాల్లో అమ్మి రూ.7లక్షలు సంపాదించాడని, కానీ ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేక పోతున్నారన్నారు.
కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు, కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారన్నారు. అదే మా ర్కెటింగ్ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలన్నారు. గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక రైతులు అలమటిస్తుం టే, కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా పంటకు బోనస్ ప్రకటించాలన్నారు. రూ.1,800 ఉన్న పత్తి విత్తనాల ధరను రూ.800కి తగ్గించిన ఘనత నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిది అని చెప్పారు.