Ice creams
-
ఆర్గానిక్ ఐస్‌బర్గ్
లక్డీకాపూల్: ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒక్క స్పూన్ చల్లని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తే.. ఆ ఫీల్ వేరే లెవెల్ అంటారు.. హిమక్రీములను ఇష్టపడేవారు.. ఈ ఐస్ క్రీములు గతంలో వేసవిలో మాత్రమే విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉండేవి.. అయితే గత కొంత కాలంగా కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా లాగించేస్తున్నారు నగర ప్రియులు. దీంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త తరహా ఐస్ క్రీములు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త రుచులు ఐస్‌క్రీమ్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి ఐస్‌బర్గ్ నుంచి ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వచి్చంది. రుచిలో ఏ మాత్రం రాజీలేని విధంగా సరికొత్త ఫ్లేవర్‌తో రూ.30 నుంచి రూ.3వేల వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. పుల్ల ఐస్ నుంచి.. కాలక్రమంలో ఐస్ క్రీం అనేక రూపాలను సంతరించుకుంది. గతంలో ఐస్ అనగానే పుల్ల ఐస్ మాత్రమే ఉండేవి. అందులోనూ అనేక ఫ్లేవర్లు ఉండేవి. మ్యాంగో, ఆరెంజ్, మిల్‌్క, గ్రేప్, కొబ్బరి ఐస్ ఇలా అనేక రుచులు ఇళ్ల వద్దకే అమ్మకానికి వచ్చేవి.. ప్రస్తుతం వాటి స్థానంలో అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. కోన్, చాకోబార్, కప్, స్కూప్, చాక్లెట్ వంటి రకాల్లో అనేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మరిపించే రీతిలో ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వస్తున్నాయి. -
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు కలకలం రేపుతున్నాయి. వన్ అండ్ ఫైవ్ పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా, విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. పిల్లలకు ఐస్‌క్రీమ్‌కు విస్కీ కలిసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐస్‌క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. వన్‌అండ్ ఫైవ్ నిర్వాహకులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను అరెస్ట్ చేశారు.60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీని కలుపుతున్నారు. ఐస్‌క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 అండ్ 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. -
Success Story: 9వ తరగతి ఫెయిలైనా రూ.1900 కోట్ల కంపెనీకి ఓనర్..
రాజేష్ గాంధీ (Rajesh Gandhi).. వాడిలాల్ ఇండస్ట్రీస్ (Vadilal Industries) చైర్మన్. 1979లో కంపెనీలో చేరిన నాలుగో తరం వ్యాపారవేత్త. తన ఆధ్వర్యంలో 90వ దశకంలో వాడిలాల్ కోల్డ్-చైన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తూ ప్రాసెసెడ్ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించింది. చదువే అన్నింటికీ పరమార్థం కాదు. చదువులో వెనుకబడినవారు కూడా తమదైన రంగంలో అద్భుత విజయాలు సాధించగలరని చెప్పడానికి రాజేష్ గాంధీ ఒక ఉదాహరణ. ఈ ప్రముఖ ఐస్ క్రీం కంపెనీని 1907లో వాడిలాల్ గాంధీ స్థాపించారు. ఇది అహ్మదాబాద్‌లోని ఒక చిన్న వీధి సోడా దుకాణంతో ప్రారంభమైంది. 2023 సెప్టెంబర్ 18 నాటికి వాడిలాల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,843 కోట్లుగా ఉంది. 9వ తరగతి ఫెయిల్ రాజేష్ గాంధీ తన పాఠశాల విద్యను అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదివారు. అయితే తాను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యానని ఒకసారి ఫార్చ్యూన్ ఇండియాతో మాట్లాడుతూ రాజేష్ గాంధీ చెప్పారు. ఆ స్కూల్లో ఫెయిలైన తాను బయటకు వెళ్లి మరో స్కూల్లో 10వ తరగతిలో చేరాలనుకోగా దానికి తన తండ్రి ఒప్పుకోలేదని, పట్టుబట్టి మరీ తనను ఆ స్కూల్లోనే మరో సంవత్సరం 9వ తరగతి చదివించాడని గుర్తు చేసుకున్నారు. వాడిలాల్ కంపెనీ పలు ఫ్లేవర్లతో కోన్లు, క్యాండీలు, బార్లు, కప్పులు, ఫ్యామిలీ ప్యాక్‌లతో సహా అనేక రూపాల్లో ఐస్క్రీంను తయారు చేస్తోంది. కంపెనీ సూపర్ మార్కెట్లు కాకుండా దాని ఫ్రాంఛైజ్ ఆధారిత హ్యాపిన్నెజ్ ఐస్ క్రీం పార్లర్ల ద్వారా రిటైల్ అమ్మకాలు సాగిస్తోంది. 1990వ దశకంలో బాగా స్థిరపడిన కోల్డ్ చైన్ నెట్వర్క్ని ఉపయోగించి ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిశ్రమలోకి ప్రవేశించిన వాడిలాల్ కంపెనీ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించింది. 1972-73 వరకు అహ్మదాబాద్‌లో వాడిలాల్ కంపెనీకి 8 నుంచి 10 అవుట్లెట్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రమంగా గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు, 1985 నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు విస్తరించింది. నేడు వాడిలాల్ భారతదేశంలోని ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటిగా నిలిచింది. -
వీడియో: కొండాపూర్ ఐస్‌క్రీం పార్లర్లో విజయ్ దేవరకొండ సందడి
-
ఐస్‌క్యాండీ ఐస్‌క్రీమ్ తింటున్నారా..?
చిత్తూరు అర్బన్: ఐస్ క్రీములంటే లొట్టలేసుకుని తినేయడమే తెలుసు. ఇక అందులోంచి వచ్చే మత్తెక్కించే ఫ్లేవర్లు వాటిని ఆస్వాదిస్తూ తినమంటాయి. కళ్లకు ఇంపుగా కనిపించే రంగులు.. వాటిపై అలంకరించే డ్రైఫ్రూట్స్, చివర్లో వేసే తేనె.. అబ్బో చెబుతుంటూనే నోట్లోంచి లాలాజలం ఊరిస్తూ అర్జెంటుగా వెళ్లి ఓ ఐస్ క్రీమ్ తినేయాలన్నంత ఆత్రుతను కలిగిస్తోంది. కానీ గతవారం విజయవాడలో జరిగిన ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీల తనిఖీలను చూస్తే జన్మలో ఐస్ క్రీమ్ వద్దంటారు. అలాగని అన్నింటినీ తప్పు పట్టడం లేదు. పూర్తిగా రసాయనాలతో నింపేసిన ఐస్‌క్రీములు, ఐస్బార్లను మార్కెట్లోకి వదులుతున్నారు. కనీసం ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను ప్యాక్‌లపై ముద్రించడం కూడాలేదు. ఇక వీటి తయారీలో వాడే రంగులు, ప్రొటీన్లు, కొవ్వులు తదితర పదార్థాల ప్రమాణాలను ఏమాత్రమూ పట్టించుకోవడంలేదు. పేరున్న సంస్థల ఉత్పత్తులు కూడా ప్రమాణాలు పాటించడం లేదని ఆహార నియంత్రణ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉంది. కొన్నింటికే అనుమతి జిల్లా వ్యాప్తంగా ఐస్ క్రీమ్ తయారీ లకు అనుమతులు ఉన్నవి కేవలం 18 మాత్రమే. ఈ కంపెనీలు మాత్రమే డేంజరస్ అండ్ అఫెన్స్ (డీఅండ్‌వో) ట్రేడ్ లైసెన్సు, ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకున్నాయి. ఇందులో 7 ఐస్ క్రీమ్ 8 క్యాండీ తయారీ కంపె నీలున్నాయి. అనధికారింగా వీటి సంఖ్య జిల్లాలో 120 వరకు ఉన్నాయి. ఎటువంటి బ్రాండ్లు లేకుండా నడిచేవి లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.80 కోట్ల వ్యాపారం జరుగుతుంటే ప్రజలకు విషాన్ని తినిపిస్తూ కొందరు వ్యాపారులు 60 శాతం లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్క వేసవి కాలంలో మాత్రం రూ.65 కోట్ల లాభాలు వస్తున్నాయంటే ఈ వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లోంచి అధికారులకు వెళుతున్న వాటాలు 10 శాతం. అంటే రూ.8 కోట్లు. ఇంత జరుగుతున్నా తినే ఐస్ క్రీమ్ ఏ రకమైందో తెలుసుకునే అవకాశం వినియోగదారుడికి ఉండడం లేదు. ఐస్ క్రీమ్‌ల విషయంలో సామాన్యులకు అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పాటించేది ఎక్కడ? జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌లను తయారు చేసిన తర్వాత ఆ ప్యాక్‌పై తయారీ గడువు తేదీలను ము ద్రించడం లేదు. డిమాండ్ ఉన్నా లేకున్నా భారీగా తయారుచేసి నిల్వ ఉంచుతున్నారు. ఆర్డర్ వచ్చి సరుకును బయటికి పంపించే సమయంలో తయారీ తేదీని వేస్తున్నారు. కృత్రిమ రంగును పరిమితికి మించి విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐస్ క్రీమ్ తయారీలో ఎంతో కీలకమైన నీటి నాణ్యత దారుణంగా ఉంటోంది. ఒక్కటంటే ఒక్క చోటకూడా శుద్ధినీటిని ఉపయోగించడం లేదు. కనీ సం తాగేనీళ్లను వాడకపోగా ఇంట్లో అంట్లు తోమడానికి ఉపయోగించేదానికన్నా దారుణంగా ఉంటోంది. ప్రమాణాలు ఇవీ.. ఐస్ క్రీమ్‌లను పాల పదార్థాలతో తయారు చేయాలి. వీటిని పలు రకాల రుచులతో పాటు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో పరీక్షించి వినియోగించాలి. ఉత్పత్తుల్లోని కొవ్వు శాతం ఆధారంగా సమాచారాన్ని ప్యాకెట్‌పై ముద్రించాలి. ఐస్ క్రీమ్‌లను మరో రకమైన డెజర్ట్ పాలు లేదా కూరగాయల నుంచి తీసిన నూనె, కొవ్వుతో కూడా తయారుచేస్తారు. ఈ రెండింటిని కలిపి కూ డా తయారుచేసే అవకాశం ఉంది. ఈ రకమైన వాటిల్లో తక్కువ, మోస్త రు కొవ్వు అని రెండు రకాలుగా విభజించారు. తప్పనిసరిగా ఈ వివరా లు ప్యాకెట్‌పై ఉండాలి. పలు రకాల రుచుల కోసం ఐస్ క్రీమ్ల్లో సహజ, కృత్రిమ, సింతటిక్ రంగులను వాడొచ్చని చట్టం చెబుతోంది. టాట్రాజిన్, కార్మోసిన్, రూడామిన్, సన్‌సెట్ ఎల్లో వంటి వాటిని తయారీదారులు వాడుతున్నారు. వీటి పరిమితి 100 పీపీఎం దాటకూడదు. పాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్రీముల్లో కొవ్వు 2.5 శాతం మించకూడదు. ప్రొటీన్లు 3.5 శాతం, మొత్తం ఘన పదార్థాలు 26 శాతానికి తగ్గకూడదు. చక్కెర 10 శాతానికి మించకూడదు. నాసిరకం పంచదార కొంతమంది ఐస్ క్రీమ్ తయారీదారులు నాసిరకం పంచదారను వాడుతున్నారని తెలుస్తోంది. మరి కొంతమంది చక్కెరకు బదులుగా శాక్రీన్ వాడుతారు. దీనిని ఎక్కువగా ఐస్ ఫ్రూట్లలో వినియోగిస్తారు. ఇది కేన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుర్తించడం కష్టం ఐస్ క్రీములు చెడిపోయాయో లేదో గుర్తించడం చాలా కష్టం. బూజు వాసన వచ్చినా, జిగురుగా ఉన్నా తినకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుబయట ఎక్కువసేపు నిల్వ ఉంచి తింటే బ్యాక్టీరియా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. -
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
ఈట్ కాన్ఫెట్టీ..
ఒకప్పుడు పీచుమిఠాయి ఫుల్ ఫేమస్. చిన్నాపెద్ద అందరూ ఆ మిఠాయికి దాసోహులే. అయితే కాలక్రమంలో పీచుమిఠాయి అంతరించిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఓ చోట అరుదుగా కనిపిస్తోంది. చాలామందికి దాన్ని టేస్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని సరికొత్త కాన్సెప్ట్‌తో ‘ఈట్ కాన్ఫెట్టీ’కి శ్రీకారం చుట్టారు నిహారిక, వెంకట్. పీచు మిఠాయితో దాదాపు 100 రకాల్లో ఐస్‌క్రీమ్స్ అందిస్తున్నారు. హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్‌కు చెందిన నిహారిక గొల్లపల్లి, వెంకట్ వేక్లు ఇంజినీరింగ్‌లో స్నేహితులు. బీటెక్ అయిపోయాక ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో ఫ్రెండ్స్‌తో కలసి సిటీలోని రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ స్టోర్స్‌ను సందర్శించారు. ఐస్‌క్రీమ్స్‌లో ఫ్లేవర్స్ వస్తున్నాయే తప్పా... ఆకట్టుకునే విధమైన ఐస్‌క్రీమ్స్ రావడం లేదు. దీంతో వీరికో ఐడియా పుట్టుకొచ్చింది. విభిన్న ఆకారాల్లో ఐస్‌క్రీమ్స్‌ను రూపొందించి పార్లర్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.22లో ‘ఈట్ కాన్ఫెట్టీ’ పేరుతో ఐస్‌క్రీమ్ పార్లర్‌ను ప్రారంభించారు. చుట్టూ పీచు... విభిన్న ఆకారాల్లో ఐస్‌క్రీమ్స్ రూపొందించి, దాని చుట్టూ పీచు మిఠాయి ఏర్పాటు చేసి అందిస్తున్నారు. టెడ్డీబేర్, పుల్ల ఐస్, చాక్లెట్, గర్ల్... ఇలా విభిన్న రూపాల్లో వీటిని రూపొందిస్తున్నారు. క్లవ్డ్, మౌంట్ కాన్ఫెట్టి, యూనికోన్, క్యాడీ ఫ్లవర్స్, బురిటో, షుగర్ క్యాడీ, ఫ్రెంచ్ వెన్నెల, బ్లూబెర్రీ, లెమన్ గ్రేస్, ఐరీష్ క్రీమ్, లావండర్, బబుల్గమ్, కొకొనట్ తదితర డిజార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మేమే ఫస్ట్... ఇండియాలో ఈ తరహా ఐస్‌క్రీమ్ పార్లర్ ఫస్ట్ మాదే. మూడు నెలల క్రితం దీనిని ప్రారంభించాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశాం. హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, దిల్‌షుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంచైజీలు ఏర్పాటుచేయనున్నాం. – నిహారిక, వెంకట్, నిర్వాహకులు -
ఐస్‌క్రీమ్ తింటున్నారా ? జాగ్రత్త.. !
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఐస్‌క్రీములను ఇష్టపడనివారు ఉండరు. వేసవిలో అయితే అందరూ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఐస్‌క్రీములు తినాల్సిందే. అయితే మనం తినే ఐస్‌క్రీముల వెనుక అనేక చేదు నిజాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీముల్లో విపరీతంగా రంగులు వాడుతున్నారని, వీటివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మోతాదుకు మించి రంగులు వాడటం, అనుమతి లేని కల్తీ రంగులు వినియోగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. సాక్షి, అమరావతి : ఈ వేసవిని ఐస్‌క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అనేక రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఐస్‌క్రీముల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రతి ఐస్క్రీములోనూ నాసిరకం రంగులే వాడుతున్నారని తేలింది. అంతేకాకుండా ఐస్‌క్రీముల్లో వాడే ప్రతి పదార్థం నాసిరకమైందేనని లేదా కల్తీ జరుగుతున్నదేనని స్పష్టమైంది. రాష్ట్రంలో మూడు వేలకుపైగా చిన్నాపెద్ద ఐస్క్రీము ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 90 శాతం ఫ్యాక్టరీలకు అనుమతి లేదు. లైసెన్స్ ఉందా? లేదా? అని అడిగే అధికారులూ లేరు. దీంతో వేసవిలో నాలుగు నెలలపాటు ఐస్‌క్రీముల వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది. ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నా ఐస్‌క్రీముల్లో నాణ్యత ఉందా? లేదా?, ఆహార భద్రతా ప్రమాణాల మేరకే ఇవి తయారవుతున్నాయా వంటి విషయాలపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదు. లక్షలాది మంది నిత్యం ఐస్‌క్రీములను తింటూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు కల్తీ పదార్థాలతో కూడిన ఐస్‌క్రీములు తినడం వల్ల శ్వాసకోశ, గొంతువాపు, జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. అన్నింటా అనుమతి లేని రంగులే.. ఎక్కువ శాతం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతున్నారు. దీంతోపాటు తయారీ కంపెనీలకు లైసెన్సులు లేవు. అత్యంత హాని కలిగించే శాక్రిన్ను మోతాదుకు మించి వాడుతున్నట్టు తేలింది. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. డ్రమ్ముల్లో నీళ్లు నింపి వారం పది రోజుల తర్వాత కూడా అవే నీటిని ఐస్‌క్రీముల తయారీకి వినియోగిస్తున్నారు. సాధారణంగా ఐస్‌క్రీముల్లో హై ఫ్యాట్, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్ రకాలు వాడతారు. కానీ ఈ ఫ్యాట్ మోతాదు సరైన స్థాయిలో ఉండకపోవడంతో ఐస్‌క్రీమ్ నిల్వలో తేడా వస్తుంది. అదేవిధంగా ప్యాకింగ్ లేబుళ్లపై తయారీ తేదీ, ఎక్స్‌పెయిరీ తేదీ ఉండటం లేదు. ఆయా ఫ్యాక్టరీల్లో పారిశుధ్యం అత్యంత ఘోరంగా ఉన్నట్టు తేలింది. విజయవాడ, గుంటూరు కల్తీ ఐస్‌క్రీములకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.200 కోట్లకుపైనే ఐస్‌క్రీముల వ్యాపారం జరుగుతున్నట్టు అధికారుల అంచనా. తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతుంది నిజమే. కొద్దిరోజుల క్రితం తనిఖీలు నిర్వహించి కొన్ని కేసులు కూడా నమోదు చేశాం. తిరిగి తనిఖీలు నిర్వహిస్తాం. ఎలాంటి లోపాలున్నా ఆయా కంపెనీలను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్సు లేకపోయినా ఆయా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తాం. – పూర్ణచంద్రరావు, ఆహార భద్రతా నియంత్రణాధికారి -
వేసవిని చప్పరించేయండి
రకరకాల ఐస్‌క్రీమ్‌లు ఇంట్లోనే చేయండి... ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి... మండుటెండలు నెత్తి మాడ్చేస్తున్నాయి. మండుటెండలు మనుషులను ఠారెత్తించేస్తున్నాయి. మండుటెండలు ముచ్చెమటలు పట్టించేస్తున్నాయి. మండుటెండలు ఒంట్లోని శక్తినంతా ఆవిరి చేసేస్తున్నాయి. మండుటెండలు నీరసం తెప్పిస్తున్నాయి. మండుటెండలు నిస్సత్తువలో ముంచేస్తున్నాయి. మండుటెండలు వేసవిని చూసి భయపడతారా..? నో...నెవర్.. ఠండా ఠండా ఐస్‌క్రీములను హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కూల్ కూల్‌గా, డోంట్‌కేర్‌గా వేసవిని చప్పరించేయండి. కొబ్బరి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : గుడ్లు – 2, పాలు – 5 కప్పులు, చక్కెర – 1 కప్పు, బేకింగ్ సోడా – ఒక టేబుల్ స్పూన్, బటర్ – పావు కప్పు (కరిగించి), కొబ్బరి పాలు –1 కప్పు, కొబ్బరి తురుము – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు (అభిరుచిని బట్టి) తయారీ : ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో నాలుగు కప్పుల పాలు, చక్కెర కలుపుకుని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి(సుమారు రెండు కప్పులు అయ్యేలా). లేత పసుపు రంగులోకి వచ్చిన పాల్లో బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బటర్‌ను కరిగించుకుని మిగిలిన పాలల్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, ముందుగా కలుపుకుని పక్కనపెట్టుకున్న రెండు మిశ్రమాలను పోసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో వెనీలా ఫ్లేవర్ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్‌ను యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కోకోనట్ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=vMsh179dLe4 అరటి పండ్ల ఐస్‌క్రీమ్ కావాల్సినవి : అరటిపళ్లు – 3 లేదా 4, తేనె – 1 కప్పు, పాలు – అర కప్పు తయారీ : ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోవాలి. తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను లొట్టలేసుకుంటూ లాగించెయ్యొచ్చు. మామిడి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : మామిడి పళ్లు – 2 లేదా 3, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు, బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్, తేనె – 1 టేబుల్ స్పూన్, పిస్తా – పావు కప్పు తయారీ : ముందుగా మామిడి ముక్కలు పిస్తా కలిపి జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని పాలలో చక్కెర వేసి గరిటెతో తిప్పుతూ మరిగించాలి. పాలు బాగా చిక్కగా (గ్లాస్ పాలు అయ్యేదాకా) మరిగించి, అందులో బేకింగ్ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాంగో–పిస్తా జ్యూస్, పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని డీప్ కూల్ చేసుకుంటే మామిడి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చీజ్ తురుముతో గార్నిష్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. https://www.youtube.com/watch?v=v5piT-6ATU4 ఆపిల్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : ఆపిల్ – 2, పాలు – 5 కప్పులు, పంచదార – అర కప్పు, వెనీలా – 1 టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా నాలుగున్నర కప్పులు పాలను బాగా మరిగించి ఒక కప్పు కంటే తక్కువగా చేసుకోవాలి. తరువాత పైన పేరుకున్న మీగడను తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అది గడ్డ కట్టిన తరువాత ముందుగా తీసి పక్కన పెట్టిన మీగడను జోడించి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆపిల్ ముక్కలు, మిగిలిన అర కప్పు పాలు, పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో వెనీలా వేసుకుని బాగా కలుపుకుని ఒక పాత్రలో తీసుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆపిల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చివరగా ఆపిల్ ముక్కలు చాక్లెట్ పౌడర్లతో మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. https://www.youtube.com/watch?v=etmV9Wds4IU దానిమ్మ ఐస్‌క్రీమ్ పంచదార – అర కప్పు, నీరు – ముప్పావు కప్పు, దానిమ్మ జ్యూస్ – 3 కప్పులు, నిమ్మకాయ – 1 తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని 10 నిమిషాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకుని బాగా కరగనివ్వాలి. తరువాత దానిమ్మ జ్యూస్‌లో ఈ పంచదార నీళ్లను యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మెషిన్లో లేదా డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నోరూరించే దానిమ్మ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=m8PAaqWK8ac సపోటా ఐస్‌క్రీమ్ కావాల్సినవి : సపోటాలు – 5 లేదా 6, పాలు – అర కప్పు, తేనె – 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గ్లూకోజ్ – పావు కప్పు తయారీ : ముందుగా సపోటా ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. తరువాత అందులో పాలు, పంచదార వేసుకుని మరో సారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో తేనె, గ్లూకోజ్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ సపోటా ఐస్‌క్రీమ్ సిద్ధమైపోతుంది. https://www.youtube.com/watch?v=DnQ4Ky6jIG8 ద్రాక్ష ఐస్‌క్రీమ్ కావాల్సినవి : ద్రాక్షపళ్లు – అర కిలో, నిమ్మకాయ – 1, పంచదార పొడి – ఒక కప్పు, పాలు – 1 కప్పు, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే) తయారీ : ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత జ్యూస్ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్ మిమ్మల్ని చల్లబరుస్తుందిత. https://www.youtube.com/watch?v=jWL7U1c1fqs అనాస ఐస్‌క్రీమ్ కావాల్సినవి : అనాస ముక్కలు – ఒక కప్పున్నర, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్, తేనె – ఒక టేబుల్ స్పూన్, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే) తయారీ : ముందుగా ఒక పాన్ తీసుకుని పాలు, చక్కెర వేసుకుని బాగా (ఇంచుమించు ఒక కప్పు వాటర్ అయ్యేంత వరకు) మరిగించుకోవాలి. అందులో చివరిగా బేకింగ్ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అనాస ముక్కలను జ్యూస్ చేసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో జ్యూస్, గుడ్డులతో పాటు పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. బొప్పాయి ఐస్‌క్రీమ్ కావాల్సినవి : బొప్పాయి – 1 (మీడియం సైజ్), పంచదార పొడి – ఒక కప్పు, క్రీమ్ – 1 1/2 కప్పు (మార్కెట్లో దొరుకుతుంది), వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ మిక్సర్‌తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్ తయారైపోతుంది. నిమ్మ ఐస్ క్రీమ్ కావాల్సినవి : గుడ్లు – 4, పాలు – 2 కప్పులు, పాల పౌడర్ – అర కప్పు, పంచదార – 1 1/2 కప్పులు, నిమ్మకాయ – 1 (రసంతో పాటు తొక్క కూడా యూజ్ అవుతుంది) తయారీ : ముందుగా నిమ్మకాయపైన ఉండే పసుపు లేయర్‌ను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (పసుపు లేయర్‌కు అడుగున ఉండే తెల్ల లేయర్‌ను పూర్తిగా తొలగించాలి లేదంటే చేదు వస్తుంది) తరువాత పాలు వేడి చేసుకుని అందులో పసుపు లేయర్స్‌ను కలుపుకోవాలి. తరువాత అందులో పంచదార కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పాల పౌడర్, గుడ్లు బాగా కలుపుకుని అందులో పాలు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత లెమెన్ తొక్కలను వడగట్టుకొని అందులో నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన లెమెన్ ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. ఖర్జూరం ఐస్ క్రీమ్ కావాల్సినవి : పంచదార – అర కప్పు, నీరు – 1 కప్పు, ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి), పాలు –2 కప్పులు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే), వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని... పంచదార కరిగేదాకా మరిగించాలి. తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్లో యాడ్ చేసుకుని ఐస్‌క్రీమ్ మేకర్లో కానీ డీప్ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్ తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ ఐస్ క్రీమ్ కావాల్సినవి : పుచ్చకాయ – 3 కప్పులు, తేనె – 1 టేబుల్ స్పూన్, పాలు – అర కప్పు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, చాక్లెట్ ఫ్లేక్స్ – 1 టేబుల్ స్పూన్ తయారీ : పుచ్చకాయ ముక్కలను జ్యూస్ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి జ్యూస్ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్ రెడీ. చాక్లెట్ ఫ్లేక్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. బాదం కుల్ఫీ పాలు – 4 కప్పులు, యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్, పంచదార – పావు కప్పు, మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, బాదంపప్పులు – 10 లేదా 15 బ్రెడ్ – 1 (చివర్లు తొలగించి ముక్కలు చేసుకోవాలి) తయారీ : ముందుగా బ్రెడ్ ముక్కలు, అరకప్పు పాలు, మొక్కజొన్న పిండి కలుపుకుని మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాదం పప్పులను ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో మిగిలిన మూడున్నర కప్పులు పాలను మరిగించి కప్పున్నర పాలుగా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పేస్ట్‌ను అందులో యాడ్ చేసుకుని (అడుగంటకుండా) గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం చిక్కపడిన తరువాత పంచదార వేసుకుని దగ్గర పడేదాకా గరిటెతో తిప్పాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో బాదం ముక్కలు, యాలకుల పొడి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి. తరువాత కుల్ఫీ కప్స్‌లోకి లేదా మీకు నచ్చే ఆకారంలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక పుల్ల వేసుకుని డీప్ ఫ్రిజ్‌లోకి పెట్టుకుంటే సరిపోతుంది. బీట్రూట్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : బీట్రూట్ – 4, నీరు – మరిగించుకోవడానికి సరిపడా, పాలు – 3 కప్పులు, పంచదార – 1 కప్పు, తేనె – పావు కప్పు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే) తయారీ : ముందుగా బీట్రూట్ను ఒక కుక్కర్లో వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని రెండున్నర కప్పుల పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. మిగిలిన ఒక కప్పు పాలలో పచ్చసొన వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన బీట్ రూట్‌ను ముక్కలు చేసుకుని జ్యూస్ చేసుకుని, అందులో పచ్చసొన, పాల మిశ్రమాన్ని వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. తరువాత పాలు పంచదార మిశ్రమంలో ఈ జ్యూస్‌ను వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ బీట్ రూట్ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=vRvBOz0gG94 క్యారెట్ ఐస్‌క్రీమ్ కావాల్సినవి : పాలు – 1 కప్పు, పాల పొడి – 1 కప్పు, పంచదార పొడి – అరకప్పు, తేనె – అరకప్పు, క్యారెట్ – 2 (మీడియం సైజ్ ), కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్స్, చెర్రీ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా క్యారెట్స్‌ను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. తరువాత పాలు, పంచదార పొడి కలుపుకుని వేడి చేసుకోవాలి. తరువాత అందులో పాలపొడి, తేనె కలుపుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, కిస్మిస్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో పాల మిశ్రమంతో పాటు చెర్రి ముక్కలను యాడ్ చేసుకుని మరోసారి మిక్సీ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్ టేస్టీ క్యారెట్ ఐస్‌క్రీమ్ మీ నోటిని తీపిచేస్తుంది. టమాటా ఐస్ క్రీమ్ కావాల్సినవి : టమాటా – 3, పంచదార పొడి – 1 కప్పు, తేనె – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, అల్లం పేస్ట్ – పావు టేబుల్ స్పూన్, పాలపొడి – 3 టేబుల్ స్పూన్స్, బటర్ – పావు కప్పు, నీరు – మరిగించడానికి సరిపడా, చెర్రీస్ – 5 లేదా 6 (గింజలు తొలగించి) తయారీ : ముందుగా టమాటాలను 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తరువాత టమాటా, బటర్, అల్లం పేస్ట్, చెర్రీస్ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పంచదార పొడి, తేనె, పాలపొడితో పాటు ఉప్పు యాడ్ చేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ సొంతమవుతుంది. మొక్కజొన్న ఐస్‌క్రీమ్ కావాల్సినవి : లేత మొక్కజొన్న పొత్తులు – 2 (మీడియం సైజ్), పాలు –ఒకటిన్నర కప్పులు, పంచదార – 2 కప్పు, పాలపొడి – అర కప్పు, గుడ్లు – 2, ఉప్పు – చిటికెడు తయారీ : ముందుగా మొక్కజొన్న పొత్తుల గింజలను వలుచుకుని ఒక పాన్‌లో వేసుకోవాలి. అందులో పాలు, పంచదార వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మొక్కజొన్న గింజలు బాగా మెత్తగా అయిన తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత గుడ్లు, పాలపొడి బాగా కలుపుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకుని మొక్కజొన్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన మొక్కజొన్న (కార్న్) ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది. https://www.youtube.com/watch?v=gaz1qZV7Mcc చిలగడ దుంప ఐస్‌క్రీమ్ కావాల్సినవి : చిలగడ దుంపలు – 3, అరటిపండు – 1, పాలు – 1 కప్పు, పంచదార – అర కప్పు, తేనె – 3 టేబుల్ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు తయారీ : ముందుగా చిలగడ దుంపలను శుభ్రం చేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉండికించుకోవాలి. తరువాత దుంపల తొక్క ఒలిచి, అరటిపండు జోడించి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తేనె, వెనీలా వేసుకుని బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే స్వీట్ స్వీట్ ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. వాల్‌నట్స్‌తో కలిపి దీనిని సర్వ్ చేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది. చెర్రీ ఐస్ట్యూబ్ కావాల్సినవి : చెర్రీస్ – ఒకటిన్నర కప్పు, తేనె – పావు కప్పు, పంచదార పొడి– అర కప్పు, పాలు – 1 కప్పు తయారీ : ముందుగా చెర్రీస్ గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాలు, చెర్రీస్, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా దగ్గరకు అయిన తరువాత స్టవ్ మీద నుంచి దించేసుకుని మిక్సీ చేసుకోవాలి. తరువాత తేనె యాడ్ చేసుకుని బాగా కలిపి ఐస్ ట్యూబ్‌ల్లో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చెర్రీ ఐస్ ట్యూబ్ రెడీ అవుతుంది. తాటి ముంజల ఐస్‌క్రీమ్ కావాల్సినవి : తాటి ముంజలు – 2, పంచదార – 1 కప్పు, పాలు – 2 కప్పులు, గుడ్డు – 1 (పచ్చసొన), కిస్మిస్ – అర కప్పు తయారీ : ముందుగా తాటి ముంజల తొక్క తీసేసి శుభ్రం చేసుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని పాలు, పంచదార వేసుకుని (సుమారు ఒక కప్పు పాలు అయ్యేదాకా) మరిగించాలి. తరువాత అందులో గుడ్డు కలుపుకుని బాగా తిప్పాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ముంజలు, కిస్మిస్లతో పాటు పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. చివరిగా మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని డీప్ ప్రిజ్‌లో పెట్టుకుంటే చల్లచల్లని తాటి ముంజల ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
ఐస్‌క్రీమ్ కాదు.. మిర్చి అమ్మండి
-
ఐస్‌క్రీమ్ కాదు.. మిర్చి పంటను అమ్మండి
టీఆర్ఎస్కు జీవన్‌రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: ఏసీ రూముల్లో ఐస్ క్రీమ్‌లు అమ్మినట్లే రైతులు కష్టపడి పండిం చిన మిర్చి పంటను అమ్మించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ నేతలకు సూచించారు. మంగళవారం విలే కరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఐస్‌క్రీమ్‌ను నిమిషాల్లో అమ్మి రూ.7లక్షలు సంపాదించాడని, కానీ ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేక పోతున్నారన్నారు. కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు, కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారన్నారు. అదే మా ర్కెటింగ్ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలన్నారు. గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక రైతులు అలమటిస్తుం టే, కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా పంటకు బోనస్ ప్రకటించాలన్నారు. రూ.1,800 ఉన్న పత్తి విత్తనాల ధరను రూ.800కి తగ్గించిన ఘనత నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిది అని చెప్పారు. -
కేటీఆర్ అమ్మినచోటే.. మేమూ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతాం
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకోవడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. నెల రోజులు కష్టపడి పనిచేసేవారు నెలకు 20 వేల రూపాయలు సంపాదిస్తుంటే, మంత్రి కేటీఆర్ ఒక్క రోజు కూలి పనిచేస్తే 7 లక్షల రూపాయలు రావడం విడ్డూరమని విమర్శించారు. టీఆర్ఎస్ కూలీలంతా ఓ డ్రామా అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు అమ్మినచోట తాము కూడా అమ్ముతామని, తమకు అదే కూలి రాకపోతే అదే షాపు ముందు బైఠాయిస్తామని నాగేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారో తమ దగ్గర లిస్ట్ ఉందని చెప్పారు. సోమవారం ట్యాంక్ బండ్‌పై ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శన చేపడతామని తెలిపారు. -
కత్రినా షేక్.. బిపాసా హాట్..
సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్షేక్లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్మోర్ రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది. ‘‘ పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా దట్టించిన వెరైటీలివని అంటున్నారు.