మార్కెట్‌లోకి సరికొత్త ఐస్‌క్రీమ్ ఫ్లేవర్
రూ.30 నుంచి 3 వేల వరకూ ధరలు
ఆర్గానిక్ పదార్థాలతో ఐస్‌క్రీమ్ తయారీ
లక్డీకాపూల్: ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒక్క స్పూన్ చల్లని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తే.. ఆ ఫీల్ వేరే లెవెల్ అంటారు.. హిమక్రీములను ఇష్టపడేవారు.. ఈ ఐస్ క్రీములు గతంలో వేసవిలో మాత్రమే విరివిగా మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి.. అయితే గత కొంత కాలంగా కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా లాగించేస్తున్నారు నగర ప్రియులు.
దీంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త తరహా ఐస్ క్రీములు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త రుచులు ఐస్‌క్రీమ్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లోకి ఐస్‌బర్గ్ నుంచి ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వచి్చంది. రుచిలో ఏ మాత్రం రాజీలేని విధంగా సరికొత్త ఫ్లేవర్‌తో రూ.30 నుంచి రూ.3వేల వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
పుల్ల ఐస్ నుంచి..
కాలక్రమంలో ఐస్ క్రీం అనేక రూపాలను సంతరించుకుంది. గతంలో ఐస్ అనగానే పుల్ల ఐస్ మాత్రమే ఉండేవి. అందులోనూ అనేక ఫ్లేవర్‌లు ఉండేవి. మ్యాంగో, ఆరెంజ్, మిల్‌్క, గ్రేప్, కొబ్బరి ఐస్ ఇలా అనేక రుచులు ఇళ్ల వద్దకే అమ్మకానికి వచ్చేవి.. ప్రస్తుతం వాటి స్థానంలో అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. కోన్, చాకోబార్, కప్, స్కూప్, చాక్లెట్ వంటి రకాల్లో అనేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మరిపించే రీతిలో ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment