organic
-
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
ఆర్గానిక్ ఐస్‌బర్గ్
లక్డీకాపూల్: ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒక్క స్పూన్ చల్లని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తే.. ఆ ఫీల్ వేరే లెవెల్ అంటారు.. హిమక్రీములను ఇష్టపడేవారు.. ఈ ఐస్ క్రీములు గతంలో వేసవిలో మాత్రమే విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉండేవి.. అయితే గత కొంత కాలంగా కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా లాగించేస్తున్నారు నగర ప్రియులు. దీంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త తరహా ఐస్ క్రీములు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కొత్త రుచులు ఐస్‌క్రీమ్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి ఐస్‌బర్గ్ నుంచి ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వచి్చంది. రుచిలో ఏ మాత్రం రాజీలేని విధంగా సరికొత్త ఫ్లేవర్‌తో రూ.30 నుంచి రూ.3వేల వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. పుల్ల ఐస్ నుంచి.. కాలక్రమంలో ఐస్ క్రీం అనేక రూపాలను సంతరించుకుంది. గతంలో ఐస్ అనగానే పుల్ల ఐస్ మాత్రమే ఉండేవి. అందులోనూ అనేక ఫ్లేవర్లు ఉండేవి. మ్యాంగో, ఆరెంజ్, మిల్‌్క, గ్రేప్, కొబ్బరి ఐస్ ఇలా అనేక రుచులు ఇళ్ల వద్దకే అమ్మకానికి వచ్చేవి.. ప్రస్తుతం వాటి స్థానంలో అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. కోన్, చాకోబార్, కప్, స్కూప్, చాక్లెట్ వంటి రకాల్లో అనేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మరిపించే రీతిలో ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులోకి వస్తున్నాయి. -
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
Kruthika Kumaran: సహజమైన గెలుపు
చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను చూసి బాధ పడింది కృతిక కుమారన్. ఈ నేపథ్యంలోనే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్‌ల గురించి ఆలోచించింది. నేచురల్ కాస్మటాలజీలో డిప్లమా చేసిన తరువాత ప్రయోగాలు ప్రారంభించి విజయం సాధించింది. కోయంబత్తూరుకు చెందిన కృతిక కుమారన్ ఆర్గానిక్ స్కిన్‌కేర్ స్టార్టప్ ‘విల్వా’ సూపర్ సక్సెస్ అయింది...తమిళనాడులోని గోబిచెట్టిపాళయం అనే ఉళ్లో పుట్టి పెరిగింది కృతి. తండ్రి లాయర్. తల్లి గృహిణి. ఉన్నత విద్య కోసం కోయంబత్తూరుకు వెళ్లిన కృతిక ‘కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసింది. ఆ తరువాత తమిళ్ కుమారన్ అనే వస్త్ర వ్యాపారితో కృతికకు వివాహం జరిగింది.కుమార్తెకు చర్మసమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లోని కొన్ని సబ్బులు, షాంపులను ప్రయత్నించిందిగానీ అవేమీ ఫలితం ఇవ్వలేదు. దీంతో సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ‘కాస్మటాలజీలో డి΄÷్లమా చేయడం నుంచి యూ ట్యూబ్‌లో వీడియోలు చూడడం వరకు ఎన్నో అంశాలు నా ప్రయోగాలలో ఉపయోగపడ్డాయి’ అంటుంది కృతిక.ముందుగా వంటగదిలో మేకపాలతో ప్రయోగాలు మొదలుపెట్టింది. కుటుంబసభ్యులు కూడా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ‘అనేక ప్రయోగాల తరువాత విజయం సాధించాం. మొదట్లో రెండు మేకలు ఉండేవి. ఇప్పుడు మేకల మందలు ఉన్నాయి. వాటి తాజా పాలతో మా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. హానికరమైన రసాయనాలకు దూరంగా ఉన్నాం’ అంటుంది కృతిక.జుట్టు, చర్మసంరక్షణ ఇతర సౌందర్య ఉత్పత్తులతోపాటు లెమన్ గ్రాస్‌తో దోమల నివారణ మందును కూడా తయారు చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోర్‌తో తొలి అడుగు వేశారు. రెండు సంవత్సరాల తరువాత వెబ్‌సైట్‌ను మొదలు పెట్టడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్‌లోకి వచ్చారు. అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా శ్రీకారం చుట్టారు.‘ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసినప్పుడు కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల ్రపాంతాల నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వచ్చేవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా లాంటి ఈ–కామర్స్ ΄్లాట్ఫామ్స్ మా ఉత్పత్తులను లిస్టింగ్ చేయడంతో వ్యాపారపరిధి విస్తరించింది’ అంటుంది కృతిక.‘లాభాల దృష్టితో కాకుండా మా కంపెనీ ద్వారా రైతులు, చేతివృత్తుల కార్మికులకు ఏదో రకంగా ఉపయోగపడాలనుకుంటున్నాం. పర్యావరణ అనుకూల ΄్యాకేజింగ్లను ఉపయోగిస్తున్నాం’ అంటుంది కృతిక.సంగీత, నృత్యాలలో ప్రవేశం ఉన్న కృతికకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి. ఆ జిజ్ఞాస ఆమెను వ్యాపార దారిలోకి తీసుకువచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తిరుగులేని విజయం సాధించేలా చేసింది. ఇద్దరితో ్రపారంభమైన ‘విల్వా’లో ఇప్పుడు వందమందికి పైగా పనిచేస్తున్నారు. పదివేల రూపాయలతో మొదలైన కంపెనీ సంవత్సరం తిరిగేసరికల్లా కోటి రూపాయల టర్నోవర్‌కు చేరింది. ఇప్పుడు కంపెనీ టర్నోవర్ 29 కోట్లు. -
ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యత పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడకుండా, రైతులకు వ్యయప్రయాసలను తొలగిస్తూ ఇకపై రాష్ట్రంలోనే ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందొచ్చు. ఈ సర్టిఫికెట్ జారీకి సేంద్రీయ ధ్రువీకరణకు వ్యవసాయం, ఆహారశుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి అనుమతినిచి్చంది. ఫలితంగా సేంద్రీయ పంట ఉత్పత్తులకు రైతులు గిట్టుబాటు ధర పొందడంతో పాటు ఆ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. సర్టిఫికేషన్ ఉంటే ’ఏపీ’కి తిరుగేలేదు ఏపెడా లెక్కల ప్రకారం సేంద్రీయ సాగులో మన దేశం 8వ స్థానంలో, ఉత్పత్తిదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో 1.07 కోట్ల ఎకరాల్లో సేంద్రీయ పంటలు సాగవుతున్నాయి. వాటిలో 65.73 లక్షల ఎకరాలు వాస్తవ సాగు ప్రాంతం కాగా, 41.51 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం. ధ్రువీకరించిన సేంద్రీయ ఆహార ఉత్పత్తులు 3.50 మిలియన్ మెట్రిక్ టన్నులు. వాటిలో రూ.7078 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో విదేశాలకు ఎగుమతవుతున్నాయి.పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలోని ఉత్పత్తులకు సర్టిఫికేషన్ లేకపోవడం ఎగుమతులకు ప్రధాన సమస్యగా మారింది. దీంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆక్వా ఉత్పత్తులు, ఉద్యాన పంటలకు క్రాప్ సర్టిఫికేషన్ చేసుకునే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. మూడేళ్లలోనే ఏపీకి గుర్తింపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 8.50 లక్షల ఎకరాలు సాగవుతున్నప్పటికీ, ఎపెడా లెక్కల ప్రకారం పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగయ్యే విస్తీర్ణం 60 వేల ఎకరాలే. దిగుబడులు 20వేల టన్నులు వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఇంటర్ననేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులే జరుగుతున్నాయి. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటే రూ.2 వేల కోట్లకు పైగా జరుగుతుందని అంచనా వేసింది. జాతీయ సేంద్రీయ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్పీఓపీ) కింద దేశంలో 37 సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణాతో పాటు 14 రాష్ట్ర ప్రభుత్వ, 23 ప్రైవేటు ఏజెన్సీలకు గుర్తింపు ఉంది. మూడేళ్లలోనే ఏపీకి ఈ గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ విభాగం సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సేంద్రీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్పీఓపీ నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసి ధ్రువీకరించేందుకు ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఎస్సీఏ)కి అనుబంధంగా 2021–22లో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓసీఏ)ని ఏర్పాటు చేశారు. క్వాలిటీ మేనేజర్ పర్యవేక్షణలో జోన్‌కి ఒకరు చొప్పున ఇద్దరు ఎవాల్యుయేటర్స్, జోన్‌కి ఇద్దరు చొప్పున నలుగురు ఇన్స్పెక్టర్స్/ఆడిటర్స్‌ను నియమించారు.ఈ విభాగం ద్వారా తొలి దశలో పొలం బడులు, తోటబడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రీయ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకలి్పంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటికీ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ జారీకి లైసెన్సు జారీ చేసింది. పొలం బడులు, తోట బడులు ప్రామాణికంగా 2023 ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సర్టిఫికెట్తో రైతులు మద్దతు ధరకంటే 2, 3 రెట్ల ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు.ధ్రువీకరణ ఇలా..⇒ సీజన్‌వారీగా ఇప్పటికే సాగయ్యే వ్యవసాయ, ఉద్యాన పంటలు (ఫీల్డ్ క్రాప్స్)కు 2 ఏళ్లు, పండ్ల తోటలకు మూడేళ్ల పాటు సాగు పద్ధతులను పరిశీలించిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ ఇప్పటికే గ్యాప్ సర్టిఫికేషన్‌తో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే పంట ఉత్పత్తులకు రిజి్రస్టేషన్ చేసుకుంటే నిర్దేశిత కాలపరిమితిలో ప్రమాణాలు పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది ⇒ సేంద్రీయ వ్యవసాయం కోసం తప్పనిసరిగా భూమిని మార్చాలి ⇒ సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చెయ్యాలి ⇒ ఇన్పుట్స్ అన్నీ సహజంగానే ఉండాలి ⇒ కలుపు మొక్కల నివారణతో సహా తెగుళ్లు, వ్యాధులను సహజ పద్ధతుల్లో మాత్రమే నియంత్రించాలి ⇒ 25 ఎకరాల లోపు సన్న, చిన్న కారు రైతులతో పాటు 25 ఎకరాలకు పైబడిన పెద్ద రైతులతో 25 నుంచి 500 మంది సభ్యులతో కూడిన రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాసెసర్స్, రిటైలర్స్, ఎగుమతిదారులు ఎవరైనా సేంద్రీయ సాగు కోసం రిజి్రస్టేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ⇒ దశలవారీగా తనిఖీలు, పరీక్షల అనంతరం సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులతో పాటు సమీప భవిష్యత్తులో అటవీ సేకరణలు, ఏపి కల్చర్, ఆక్వా కల్చర్, సముద్రపు నాచు, జల మొక్కలు, పుట్ట గొడుగుల ఉత్పత్తి, పశువుల ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ హ్యాండలింగ్, జంతువుల ఫీడ్ ప్రొసెసింగ్‌కు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేషన్‌తో రైతుకు మేలు సేంద్రీయ ధ్రువీకరణకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఎపెడా గుర్తింపునిచి్చంది. 2027 వరకు లైసెన్సు జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుని వరకు భరోసా లభిస్తుంది. రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులు పొందే వీలు కలుగుతుంది. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మొక్కలు, జంతువుల్లో జీవ వైవిధ్యతను కాపాడేందుకు సేంద్రీయ వ్యవసాయ సుస్థిరత, పర్యావరణ హితమైన ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. –ఎ.త్రివిక్రమరెడ్డి, డైరెక్టర్, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ -
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
-
టాటా కన్జూమర్ చేతికి 2 సంస్థలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్‌లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఏపీకి బెస్ట్ పెవిలియన్ అవార్డు
సాక్షి, అమరావతి: మిల్లెట్స్–ఆర్గానిక్స్‌పై బెంగుళూరులో 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సేంద్రీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌కు బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది. ఈ నెల 5 నుంచి నిర్వహించిన ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలతో పాటు విదేశీ రైతులు తమ ఉత్పత్తులతో 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్ వాలిడేషన్ కమిటీ స్టాల్స్ ఏర్పాటు, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకొని బెస్ట్ స్టేట్ పెవిలియన్, పెస్ట్ స్టాల్ అవార్డులను ప్రదానం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టాల్స్‌కు ఈ అవార్డులు వరించాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయ స్వామి చేతుల మీదుగా రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్‌కు ఈ అవార్డులను ప్రదానం చేశారు. గతేడాది డిసెంబర్ 28–30 వరకు కేరళలో జరిగిన జాతీయ స్థాయి ఆర్గానిక్ ప్రదర్శనలో ఏపీకి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. -
ఇవి నిజంగానే 'గజ' నిమ్మకాయలు!
సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్లో నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..? కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి. సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!మన దేశంలో పత్తి సాగులో వాడుతున్నది 95% వరకు జన్యుమార్పిడి చేసిన పత్తి విత్తనాలే. నాన్‌బీటీ దేశీ పత్తి రకాలు దాదాపు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో నాన్‌బీటీ దేశీ, అమెరికన్ పత్తి రకాలను తిరిగి రైతులకు అందించే కృషికి అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు శ్రీకారం చుట్టాయి. వచ్చే ఖరీఫ్ నుంచే తెలుగు రాష్ట్రాల్లో 3 వేల ఎకరాల్లో రైతులకు ఈ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పత్తి దినోత్సవం (అక్టోబర్ 7) సందర్భంగా ప్రత్యేక కథనం... సేంద్రియ పత్తి సాగు వల్ల భూతాపం పెరుగుదలను దీటుగా ఎదుర్కోవటం, ఆరోగ్యదాయకమైన దూది ఉత్పత్తిని పెంపొదించటం వంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయి. సేంద్రియ పత్తి విస్తీర్ణాన్ని పెంపొందించాలంటే మొదట జన్యుమార్పిడి చేయని (నాన్ బీటీ) దేశీ, హైబ్రిడ్ రకాల పత్తి విత్తనాలను తొలుత స్థానికంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ అసరాన్ని గుర్తించిన అనేక అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైన నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాలను ఈ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్గానిక్ కాటన్ యాక్సలరేటర్(ఒసిఎ), స్విట్జర్లాండ్‌కు చెందిన స్వతంత్ర సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబిఎల్) శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థల తోడ్పాటుతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి ఈ ఖరీఫ్ నుంచి కృషి ప్రారంభించింది. 30 నాన్ బీటీ పత్తి రకాల ప్రయోగాత్మక సాగు మన దేశంలో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి సంబంధించి గత ఆరేళ్లుగా క్షేత్రస్థాయిలో వంగడాల ఎంపిక ప్రక్రియ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పిఓ)ల స్థాయిలో సాగుతోంది. ఈ క్రమంలో 30 నాన్ బీటీ రకాలు రైతులకు నచ్చే విధంగా ఫలితాలనిస్తున్నాయని గుర్తించారు. వీటిలో దేశీ పత్తి సూటి రకాలు, అమెరికన్ పత్తి సూటి రకాల తోపాటు అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకాలు ఉన్నాయి. అయితే, ఈ 30 నాన్ బీటీ సూటి/హైబ్రిడ్ రకాల్లో ఏయే రకాలు ఏయే రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలనిస్తున్నాయన్న క్షేత్ర స్థాయి అధ్యయనం ఈ ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి సాగయ్యే ఆరు రాష్ట్రాల్లో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక జాగ్రత్తలతో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా వెలమజాల గ్రామంలో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒక ఎకరంలో 30 రకాల నాన్‌బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తోంది. అదేవిధంగా, ఏపీలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో గల కృష్ణ సుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఒక ఎకరంలో 30 నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జన్యు స్వచ్ఛత కోసం ఒక్కో రకానికి మధ్య జొన్న వరుసలు విత్తారు. ఈ రెండు క్షేత్రాలను సిఎస్ఎ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. ఈ 30 రకాల్లో ఏ రకాలు మెరుగైన ఫలితాలనిస్తాయో పరిశీలించి, వచ్చే సంవత్సరాల్లో ఆయా రకాలను విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించనున్నాయని సిఎస్ఎ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ చెప్పారు. వచ్చే ఖరీఫ్ నాటికి 3 వేల ఎకరాలకు అందుబాటులోకి నాన్‌బీటీ పత్తి విత్తనాలు ఇదిలా ఉండగా, 5 రకాల నాన్‌బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తి ఆరు రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా ఈ ఖరీఫ్‌లో మొత్తం 25 ఎకరాల్లో ్ర΄ారంభమైంది. ఇందులో భాగంగా, తెలంగాణలోని రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు 5 నాన్ బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తిని 5 ఎకరాల్లో చేపట్టాయి. వీటిల్లో ఆర్విజెకె–ఎస్జిఎఫ్1 అనే దేశీ పత్తి (అర్బోరియం) సూటి రకం ఒకటి. ఆర్విజెకె–ఎస్జిఎఫ్2, ఎన్డిఎల్హెచ్, సురక్ష అనే 3 రకాల అమెరికన్ (హిర్సుటం) సూటి రకాలతో΄ాటు.. వసుధ గోల్డ్ అనే హైబ్రిడ్ పత్తి రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరంలో జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలోని రాజోలి ఎఫ్పిఓ, జనగామ జిల్లాలోని ఆరద్శ ఎనబావి ఎఫ్పిఓలు సాగు చేస్తున్నాయి. ఈ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని సిఎస్ఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ పర్యవేక్షిస్తున్నారు. రైతులకు నచ్చే లక్షణాల తోపాటు మేలైన దిగుబడినిచ్చే ఈ నాన్ బీటీ రకాల సామర్ధ్యాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించే లక్ష్యంతో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నామని, వచ్చే ఖరీఫ్‌కు 3 వేల ఎకరాల్లో సాగుకు ఈ విత్తనాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే ఆసక్తి ఉన్న రైతులు ఈ విత్తన క్షేత్రాలను దసరా తర్వాత కాయ దశలో స్వయంగా సందర్శించి, విత్తనాలను బుక్ చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని డా. రాజశేఖర్ (83329 45368) తెలిపారు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
ఆర్గానిక్ బ్రాండ్‌తో అరకు కాఫీకి.. అంతర్జాతీయ క్రేజ్
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న అరకు వ్యాలీ కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు వ్యాలీ కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం(ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(అపెడా) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నాలుగేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీ, మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత మంచి ధరలు దక్కనున్నాయి. ఫలించిన నాలుగేళ్ల కృషి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1,300 మంది గిరిజన రైతులు 2184.76 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి జరిగింది. తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతర పంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు నిర్వహించిన జీసీసీ సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో నాల్గో ఏడాది సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీకి అపెడా ఆమోదం తెలిపింది. దీంతో తొలి విడతలో చింతపల్లి మండలంలోని 2,184.76 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇదే తరహాలో జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3,393.78 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కాగా, ఒక పంటకు సేంద్రియ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి విషయం ఆన్లైన్ వెరిఫికేషన్, ఆన్లైన్ అప్డేషన్, ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రం జియో ట్యాగింగ్, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వంటివి ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా నిర్వహించాలి. వీటన్నిటినీ జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తిచేశారు. మరో మైలురాయి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో జీసీసీ సమర్థంగా సేవలందిస్తోంది. ఇప్పటికే సేంద్రియ బ్రాండింగ్‌తో నాణ్యమైన పసుపు, తేనెను టీటీడీకీ సరఫరాచేస్తున్నా. తాజాగా నాలుగేళ్ల కృషి ఫలించడంతో కాఫీ, మిరియాల సాగుకు సేంద్రియ సాగు ధ్రువపత్రం దక్కడం జీసీసీ చరిత్రలో మరో మైలురాయి. ఇది సాధించినందుకు గర్వంగా ఉంది. – శోభ స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ -
హైదరాబాద్‌లో అక్షయకల్ప భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప స్థానిక అవసరాల కోసం పాల సేకరణకు సంబంధించి హైదరాబాద్ సమీపంలోని అప్పాజీగూడలో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనిపై రూ. 20–30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు శశి కుమార్ తెలిపారు. మూడేళ్లలో ఇది అందుబాటులోకి రాగలదని, తొలుత రోజుకు 10వేల లీటర్ల వరకు పాల సేకరణ ఉండగలదని వివరించారు. ప్రస్తుతం తమకు కర్ణాటక, తమిళనాడులో చెరో క్లస్టర్ ఉందని చెప్పారు. ఒక్కో క్లస్టర్లో సుమారు 300–400 మంది పాడి రైతులు ఉంటారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో నెలకు సుమారు రూ. 20 కోట్ల వరకు అమ్మకాలు ఉంటున్నాయని శశి కుమార్ తెలిపారు. కొత్తగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ‘గ్రీన్స్’ పేరిట సేంద్రియ కూరగాయలు, పండ్ల విక్రయాలు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 180 మంది, మొత్తం మీద సుమారు 800 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 205 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ. 300 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శశి కుమార్ పేర్కొన్నారు. సంస్థ ఏర్పాటు చేసినప్పట్నుంచి దాదాపు దశాబ్దకాలంలో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు వివరించారు. -
బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్ నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే చర్య ఇది. దేశీయంగా లభ్యత పెంపు లక్ష్యంగా సెప్టెంబర్ తొలి రోజుల్లో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. రిటైల్ మార్కెట్లలో ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని కూడా విధించింది. ఆర్గానిక్ నాన్-బాస్మతీ రైస్, ఆర్గానిక్ నాన్-బాస్మతీ బ్రోకెన్ రైస్ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బియ్యం ఎగుమతుల విలువ 5.5 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 9.7 బిలియన్ డాలర్లు. సరైన చర్య... ‘‘భారత్ ఏటా 10,000-15000 టన్నుల సేంద్రీయ బియ్యాన్ని (బాస్మతి, బాస్మతీయేతర) ఎగుమతి చేస్తుంది. గత 4–5 ఏళ్లలో ఆర్గానిక్ బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయి. నిషేధం ఎత్తివేస్తూ, ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది’’ అని ప్రభుత్వ ప్రకటనపై ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్ సెటియా వ్యాఖ్యానించారు. -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు. చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్ ప్రొటీన్ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. విజయవాడ, వైజాగ్‌లో లీటర్ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్ ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్ అవుట్‌లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘జైవిక్ ఖేతి’ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది. సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశుసంవర్థక శాఖ -
100 శాతం ఆర్గానిక్ కాఫీ: ఫుడ్ బిజినెస్‌లోకి రిలయన్స్
సాక్షి,ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్) ఆహార పదార్థాలు, పానీయాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం యూకేకు చెందిన ఫుడ్ అండ్ ఆర్గానిక్ కాఫీ చెయిన్ ప్రెటా మౌన్రేతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రెటా మౌన్రేకు దీర్ఘకాలిక మాస్టర్ ఫ్రాంచైజీగా కంపెనీ వ్యవహరించనుంది. ముందుగా ప్రధాన నగరాలు, ట్రావెల్ హబ్‌లతో ప్రారంభించి, ఆ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నామని ఆర్బీఎల్ ప్రకటించింది. దేశీయ వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా తాజా, సేంద్రీయ ఆహార పదార్థాల్ని అందించాలనేదే లక్ష్యమని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా వెల్లడించారు. ఆసియాలో రెండు దశాబ్దాల క్రితం తొలి ప్రెట్ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ప్రెటా మౌన్రేకు ఆర్బీఎల్తో భాగస్వామ్యం సంతోషాన్నిస్తోందని సీఈఓ పనో క్రిస్టౌ తెలిపారు. కస్టమర్లకు ఫ్రెష్ ఫుడ్‌తోపాటు, 100% ఆర్గానిక్ కాఫీని అందిస్తామన్నారు. కాగా అతిపెద్ద రిటైల్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ఆబీఎల్ గత 14 ఏళ్లుగా దేశంలో గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే ‘రెడీ టు ఈట్' అంటూ తొలిసారిగా 1986లో లండన్‌లో ప్రారంభమైంది ప్రెటా మౌన్రే. యూకే, యూఎస్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్, దుబాయి తదితర దేశాల్లో మొత్తం 550 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ కాఫీ, శాండ్విచ్లు, సలాడ్లు, ర్యాప్‌లను అందిస్తోంది ప్రెటా మౌన్రే -
Holi 2022: పూల రంగులతో హోలీ సంబురం
Make Organic Holi Colours with Flowers: హోలీ 2022 సంబురం వచ్చేసింది. ఈ రంగులకేళిలో రసాయన రంగుల్ని వాడటం ‘ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు... కాదంటూ’ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కృత్రిమ రంగులతో పోలిస్తే ఆర్గానిక్ కలర్ పౌడర్లకే మార్కెట్లో రేటు ఎక్కువ. పైగా అవి నిజంగానే ఆర్గానిక్‌వేనా అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజరంగుల్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగూ.. ఎర్రటి ఎండలు దండి కొడుతున్నాయ్ కదా! రెడ్/ఎరుపు మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ఆ పువ్వులను మెత్తని పొడిగా నూరుకోవాలి. అంతే.. ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మిశ్రమానికి కొంచెం బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది. మందారతో పాటు ఎర్ర చందనం పౌడర్‌తో కూడా రెడ్ కలర్‌ను తయారుచేసుకోవచ్చు. పైగా ఎర్ర చందనం శరీరానికి మంచి రంగును ఇస్తుంది. దీనిని తడి, పొడి రంగుగా వాడుకోవచ్చు. లీటర్ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పౌడర్ని కలపి దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. చల్లారక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగు తయారవుతుంది. ఆరెంజ్/కాషాయం మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెట్టినా సరిపోతుంది. పసుపు–కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. మైదాకు(గోరింటాకు)ను నీటిలో కలిపి ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే కొంచెం ఇది కాస్ట్లీ వ్యవహారం. యెల్లో/పసుపు ఈ రంగును తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. పొద్దుతిరుగుడు పువ్వులు(యాభై గ్రాములు), నారింజ తొక్కల పొఇ(ఇరవై గ్రాములు), చేమ గడ్డ పొడి(రెండొందల గ్రాములు), పసుపు(వంద గ్రాములు), నిమ్మ రసం(ఇరవై చుక్కలు).. ఈ మొత్తాన్ని ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే మెత్తని పసుపు రంగు తయారవుతుంది. బ్లూ/నీలం సూర్య కాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా పెరిగే చెట్లు జకరండ(నీలి గుల్మహార్). వీటి పువ్వులు నీలి, ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతంలో అయితే నీలి మందారం మొక్కల నుంచి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తారు. తడి రంగు కోసం నీలిమందు చెట్ల కాయల్ని(బెర్రీలు) పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని జాతుల నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటితో కలిపి బ్లూ రంగు తయారుచేసుకోవచ్చు. గ్రీన్/ఆకుపచ్చ గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యప్పిండి కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా చేయాలి. పై పై నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు. పింక్/గులాబీ పసుపు రంగు మందార పువ్వులు, బీట్రూట్ ద్వారా ఆర్గానికి పింక్ రంగును తయారు చేయొచ్చు. బీట్రూట్ను పేస్ట్‌గా నూరి.. ఆ మిశ్రమాన్ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పొడికి కొంచెం శెనగ లేదా గోధుమ పిండిని కలపాలి. తడి రంగు కోసం బీట్రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి.. చల్లార్చాలి. బ్రౌన్/గోధుమ గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పాళ్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్యప్పిండిని కలిపితే చాలు. ఆయుర్వేదంలో హోలీ హోలీ వెనుక పురాణకథనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. చలి కాలం వెళ్లిపోయి.. వేసవి వచ్చేప్పుడు గాలిమార్పు కారణంగా జ్వరాలు, జలుబూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడిలను నీళ్లలో కలిపి చల్లుకునేందుకే ఈ వేడుక పుట్టిందని చెప్తారు. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, హోలీ పండుగ పూట చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరిచేరవని అంటారు. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
వస్త్రాల్లో ఆర్గానిక్ ట్రెండ్
సాక్షి, అమరావతి: ఆర్గానిక్ అనగానే వంటలకు సంబంధించిన వస్తువులే గుర్తుకువస్తాయి. కానీ దుస్తుల్లోనూ ఇప్పుడు ఆర్గానిక్ ట్రెండ్ వచ్చేసింది. ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి.. దానినుంచి నూలు ఒడుకుతున్నారు. ఆ నూలుకు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను అద్ది ఆర్గానిక్ వస్త్రాలను నేస్తున్నారు. చేనేత వస్త్రాల్లో ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తదితర ప్రాంతాల్లో నేతన్నలు ఆర్గానిక్ వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఆర్గానిక్ వస్త్రాల ఉత్పత్తికి ఊతమిచ్చేలా ఆప్కో చర్యలు చేపడుతోంది. రంగులు అద్దుతారిలా... ► చెట్ల బెరడు, పూలు, పండ్లు, కాయలు, ఆకులను సేకరించి.. నీటిలో ఉడికించి సహజసిద్ధ రంగుల్ని తయారు చేస్తున్నారు. ► ఆయా రంగుల్లో ముంచి ఆరబెట్టిన ఆర్గానిక్ నూలు(యార్న్)తో మగ్గంపై కలర్ ఫుల్ బట్టలను నేస్తున్నారు. ► దానిమ్మ కాయ బెరడుతో పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు, కరక్కాయ, జాజి, అల్జీరిన్‌తో ఎరుపు, కరక్కాయ, కరక పువ్వుతో బంగారు పసుపు (గోల్డెన్ ఎల్లో), మోదుగ పూలతో ముదురు పసుపు రంగుల్ని తయారు చేస్తున్నారు. చామంతి పువ్వులతో లేత పసుపు రంగు (లెమన్ ఎల్లో), ఇండిగో ఆకుల నుంచి నీలం రంగు, ఉల్లి పైపొరతో లేత గులాబీ, పాలకూర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, నల్ల బెల్లం, నీరు, కాల్చిన ఇనుము కలిపిన మిశ్రమం నుంచి నలుపు రంగుల్ని తీస్తున్నారు. ► వీటిని తుమ్మ జిగురుతో కలిపి బట్టలకు రంగులు బాగా పట్టేలా చేస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువే అయినా.. క్రేజ్ పెరుగుతోంది. ప్రయోజనాలివీ.. ► ఆర్గానిక్ వస్త్రాల వినియోగంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ► ఆర్గానిక్ వస్త్రాల్లో రసాయనాలు లేవు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, రసాయనాలు పీలిస్తే వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. -
బొల్లారం అగ్ని ప్రమాదం: అదుపులోకి మంటలు
సాక్షి, హైదరాబాద్: వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిపోగా, పరిశ్రమలో రెండు ఫైర్ బృందాలను అందుబాటులో ఉంచారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. (చదవండి: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం) ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నవారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 8 మంది గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 50 కి పైగా రీయాక్టర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వివిధ ప్రముఖ కంపెనీల రా మెటీరియల్ తీసుకొని బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రమాదంపై పోలీసులు, రెవెన్యూ, కెమికల్ ఇండ్రస్టీస్ ఇన్స్పెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్.. అయితే..) -
సేంద్రియ పత్తి సాగుకు సై!
దేశీయంగా సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. మన దేశంలో సేంద్రియ పత్తి సాగులో ముందంజలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రమే ఇందుకు కేంద్ర బిందువు కావటం విశేషం. దేశీయ వంగడాలతో కూడిన సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న సంకల్పంతోనే అక్కడ రెండేళ్లుగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ రూపుదిద్దుకుంటున్నది. గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజె సింధియా కృషి విశ్వ విద్యాలయం (ఆర్.వి.ఎస్. కె.వి.వి.) పరిధిలోని ఖండవా ప్రాంగణంలో ఇది ఏర్పాటైంది. భారతీయ సంప్రదాయ రకాలపై విస్తృత పరిశోధనలు చేసి మెరుగైన సేంద్రియ పత్తి వంగడాలను అభివృద్ధి చేయటం చాలా కీలకం. ఇందుకోసం విదేశీ సంస్థలతో కలిసి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇటీవల ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్.వి.ఎస్.కె.వి.వి. వైస్ ఛాన్సలర్‌గా ఉన్న డా. సూరపనేని కోటేశ్వరరావు పర్యవేక్షణలోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుండటం మరో విశేషం. ప్లాంట్ బ్రీడర్ అయిన డా. రావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పోలుకొండ. ఇప్పుదు మన దేశంలో 90%పైగా విస్తీర్ణంలో సాగవుతున్న హైబ్రిడ్ జన్యుమార్పిడి పత్తి (Gossypium hirsutum, G.bar-ba-den-se) విత్తనాలు అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాలతో కూడిన పత్తి సాగుకు పనికిరావు. అందువల్లనే భారతీయ సంప్రదాయ పత్తి రకాలతోనే మెరుగైన సూటి వంగడాల అభివృద్ధిపై ఇంతకుముందెన్నడూ, ఎక్కడా ఎరుగని రీతిలో సేంద్రియ భూముల్లోనే బ్రీడ్ చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నామని డా. రావు ‘సాక్షి’తో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న సేంద్రియ పత్తిలో మన దేశం వాటా 56 శాతం. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆ రాష్ట్రంలో దాదాపు లక్ష హెక్టార్లలో 87 వేల మంది చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ పత్తిని సాగు చేస్తున్నారని అంచనా. బీటీ పత్తి రైతులకన్నా వీరికి 30% అదనంగా ఆదాయం వస్తున్నదని గణాంకాలు చెబుతున్నాయి. సేంద్రియ పత్తి సాగు వ్యాప్తికి ఉన్న ప్రతిబంధకాలలో ముఖ్యమైనది.. సేంద్రియ పత్తి విత్తనాల కొరత. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాల ప్రకారం జన్యుమార్పిడి (సూటి వంగడాలు లేదా హైబ్రిడ్) విత్తనాలు సేంద్రియ వ్యవసాయానికి పనికిరావు. హైబ్రిడ్ బీటీ పత్తి విత్తనాలు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే తగినంత దిగుబడినిస్తాయి. సేంద్రియ పత్తి సాగులో దేశీయ పత్తి రకాల (Gossypium ar-bo-re-um-)కు చెందిన సూటి వంగడాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. సూటి రకాల పత్తి నుంచి తీసే విత్తనాలను రైతులు తిరిగి పొలంలో విత్తుకోవచ్చు. హైబ్రిడ్ పత్తి నుంచి తీసిన విత్తనాలు మళ్లీ విత్తుకోవడానికి పనికిరావు. ప్రతి ఏటా కంపెనీ నుంచి రైతులు విధిగా కొనుక్కోవాల్సిందే. అయితే, దేశీ పత్తి వంగడాలు స్వల్ప విస్తీర్ణంలో సాగవుతున్నా వీటి దూది పింజ పొట్టిగా ఉంటుంది. సంప్రదాయ ఖాదీ ఉత్పత్తులకు ఈ పత్తి సరిపోతుంది. అయితే, సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలంటే.. అంతర్జాతీయంగా సేంద్రియ పత్తి వస్త్రాల తయారీ కంపెనీల యంత్రాలకు అనుగుణంగా ఉండే విధంగా పొడుగు పింజ రకాలను అభివృద్ధి చేయాలి. ఈ సమస్యను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇప్పటికే అధిగమించిందని డా. రావు వెల్లడించారు. ఎంపీ ప్రభుత్వ మద్దతుతో మన దేశీ పత్తి రకాలతోనే గత నాలుగేళ్లుగా మెరుగైన వంగడాలను రూపొందించామన్నారు. వీటిలో 3 రకాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశీ పత్తి రకాల పింజ 24–26 ఎం.ఎం. ఉండేదని అంటూ.. తాము అభివృద్ధి చేసిన రకాల పింజ 28–33 ఎం.ఎం. వరకు ఉందన్నారు. వీటి పంటకాలం 140 రోజులేనని, అధిక సాంద్రతలో సాగుకు అనువైనేనన్నారు. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల రైతులకు ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. అమెరికన్ బీటీ పత్తి వంగడాల వల్ల ఈ దేశీ వంగడాలు జన్యు స్వచ్ఛతను కోల్పోవని చెబుతూ.. వీటి క్రోమోజోమ్ నంబర్లు వేరు కావటమే ఇందుకు కారణమని వివరించారు. తమ యూనివర్సిటీ పరిధిలోని అనేక ప్రాంగణాల్లోనూ సేంద్రియ సాగును ప్రామాణికంగా చేపట్టామని, ఏటా రెండు పంటలు వేస్తూ విత్తనోత్పత్తి చేస్తున్నామన్నారు. సేంద్రియ పత్తి సాగులో దిగుబడులు బీటీ హైబ్రిడ్లకు దీటుగానే వస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ఈ కృషిని మరింత ముమ్మరం చేయడం కోసమే ఎఫ్.ఐ.బి.ఎల్. తదితర స్వదేశీ, విదేశీ పరిశోధన, వాణిజ్య, ప్రభుత్వేతర సంస్థలతో ఇటీవల ఎం.ఓ.యు. కుదుర్చుకున్నట్లు వివరించారు. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పించటం కష్టమేమీ కాదన్నారు. నికార్సయిన సేంద్రియ పత్తిని పండించి, తగిన పరిమాణంలో స్థిరంగా సరఫరా చేయగలిగితే ఆకర్షణీయమైన ధర చెల్లించడానికి విదేశీ వస్త్ర వాణిజ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఏ రైతు పండించిన సేంద్రియ పత్తితో ఆ వస్త్రాన్ని తయారు చేశారో తెలియజెప్పే (ట్రేసబిలిటీ) వివరాలను వస్త్రాలపై పొందుపరచే విధంగా పటిష్టమైన ఉత్పత్తి గొలుసును ఏర్పాటు చేస్తే.. మన దేశానికి సేంద్రియ పత్తి సాగు రంగంలో భవిష్యత్తులో తిరుగు ఉండబోదని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ పత్తి సాగు చేసే నీటి సదుపాయం ఉన్న రైతులు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతరపంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. రసాయనిక పద్ధతులతో పోల్చితే సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు ఖర్చు 60% వరకు తగ్గుతున్నదని, రైతులకు 30% అదనంగా ఆదాయం వస్తున్నదన్నారు. ఆదాయం మెరుగ్గా ఉందని ఆచరణలో గమనిస్తే.. వాణిజ్య స్థాయిలో పత్తి సాగు చేసే పెద్ద రైతులు కూడా సేంద్రియం వైపు ఆకర్షితులవుతారన్నారు. మరో మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా సేంద్రియ పత్తి వంగడాలను అందించగలుగుతామని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వివరాలకు.. vcrvskvvgwl@gmail.com -
ఇదీ ఆర్గానిక్ పెళ్లి!
-
సేంద్రియ ఆహారం దివ్యౌషధం!
ఇంటిపట్టున గాని, పొలంలో గాని రసాయనాలు బొత్తిగా వాడకుండా పూర్తిగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, తిండి గింజలు, పప్పుధాన్యాలు సాగు చేయడానికి అదనంగా శ్రమపడాల్సి వస్తుందన్నది నిజమే. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడినప్పటికన్నా ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో పండించడం కొంచెం కష్టమే కావచ్చు. అయితే, ఈ కష్టం ఊరికే పోదంటున్నారు నిపుణులు. అదెలాగంటారా? సేంద్రియ ఆహారోత్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ‘యాంటీ ఆక్సిడెంట్స్’ వంటి విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయి కాబట్టి! కొన్ని సేంద్రియ ఉత్పత్తుల్లో రెట్టింపు ఉండగా, మరికొన్నిటిలో వేల రెట్లు అదనంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసిటి) తాజా పరీక్షల్లో వెల్లడైంది. ఆశ్చర్యంగా ఉందా..?ఇది ముమ్మాటికీ నిజమే సుమా! ఇక చదవండి మరి.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనందరికీ తెలిసిందే. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేసిన ఆహార పదార్థాల కన్నా సేంద్రియ ఆహారోత్పత్తులు ఎంతో ఆరోగ్యదాయకమని మనకు తెలిసిందే.అయితే, పూర్తిగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు ఆ ఔషధ గుణం ఎలా వచ్చింది? వాటిల్లోని ‘యాంటీ ఆక్సిడెంట్స్’ వంటి పోషకాల వల్ల ఆ సద్గుణం వచ్చింది! యాంటీ ఆక్సిడెంట్స్ ఏయే ఆహారోత్పత్తుల్లో ఏయే స్థాయిలో ఉన్నాయి? రసాయనిక పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో ఎంత మేరకు ఉంటాయి? సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో ఎంత ఎక్కువ మోతాదులో ఉంటాయి? అనేవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానం వెతికేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ప్రయత్నించింది. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ ఫౌండేషన్.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.– హైదరాబాద్)లో కొన్ని ఆహారోత్పత్తులపై ఇటీవల పరీక్షలు చేయించింది. వరి బియ్యం, గోధుమలు, కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలపై పరీక్షలు జరిగాయి. ఆక్సిజన్ రాడికల్ అబ్సార్బెన్స్ కెపాసిటీ(ఓ.ఆర్.ఎ.సి.) అనే పరీక్ష నిర్వహించారు. యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వులో కరిగేవి(లిపోఫిలిక్), నీటిలో కరిగేవి(హైడ్రోఫోలిక్) ఏయే ఆహారోత్పత్తుల్లో ఏయే మోతాదుల్లో ఉన్నాయన్నది తెలుసుకున్నారు. ఐఐసిటి పరీక్షల ఫలితాలను ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ చిట్టూరి సుబ్రహ్మణ్యం ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. ‘యాంటీ ఆక్సిడెంట్లు’ అంటే? మానవ దేహంలో నిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. జీవక్రియలు జరిగే సమయంలో మన దేహంలో కొన్ని కలుషిత పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. అవి కణాలను దెబ్బతీసి మనకు అనారోగ్యం కలిగిస్తాయి. వీటి బారిన పడిన ఆరోగ్యకరమైన కణం కేన్సర్ కణంగా మారిపోయే అవకాశం ఉంది. ఇలా మన ఆరోగ్యానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిస్తేజంగా మార్చే శక్తి మనం తీసుకునే ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలకు ఉంది. జీవక్రియల ద్వారా వెలువడే వ్యర్థాల్లోని హానికారక పదార్థాలను నిర్వీర్యం చేసి, కణ విధ్వంసాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ నిలిపివేస్తాయి. అందువల్లనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వారు ఎక్కువ కాలం యౌవనంగా ఉండటంతోపాటు కేన్సర్ తదితర వ్యాధుల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు(సాక్షి ఫ్యామిలీ హెల్త్కాలమ్లో 01–08–2019న ‘యాంటీ డిసీజ్ ఆహారం’ శీర్షికన కేర్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డా. హరిచరణ్ రాసిన వ్యాసం చదవండి). అంతేకాదు.. కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, అల్జిమెర్స్, పార్కిన్సన్ వంటి జబ్బులను యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం నివారించగలుగుతుందని అమెరికా వ్యవసాయ శాఖలోని ఆహార–పోషకాల విశ్లేషణ విభాగం చెబుతోంది. రసాయనాలతో పండించిన వరిలో సున్నా రసాయనిక పద్ధతిలో పండించిన వరి బియ్యం, దొండకాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ బొత్తిగా సున్నా. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వరి బియ్యం, దొండకాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా.. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన గోధుమలు, కందులు, బొప్పాయి పండ్లు, బీర, కాకర, కరివేపాకు, తోటకూర, చిక్కుళ్లలో రసాయనాలు వాడి పండించిన వాటిలో కన్నా అనేక రెట్లు ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లు తేలింది. మొక్కలు తెగుళ్లు, కీటకాలు, వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ వంటి వృక్ష రసాయనాల(ఫైటో కెమికల్స్)ను తయారు చేసుకుంటాయి. సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగయ్యే పంటలు వీటిని అధిక మోతాదులో తయారు చేసుకుంటాయి. ఆయా పంటల నుంచి లభించే ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు తదితర ఉత్పత్తుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. అంటే.. సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట దిగుబడుల ద్వారా మన ఆకలి తీర్చుకోవడానికి కావాల్సిన ఆహారంతోపాటు, ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఔషధ శక్తి కూడా పుష్కలంగా లభిస్తోందన్న మాట. ఈ కారణంగానే సేంద్రియ ఆహారోత్పత్తులను అధిక ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు గిరాకీ 20% మేరకు పెరుగుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిలో ఎక్కువ కాలంపాటు పంటలు పండించుకోవడానికి అనువైన సానుకూల వాతావరణ పరిస్థితులున్న మన దేశంలో రైతాంగానికి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం బంగారు భవిష్యత్తును అందించనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. – పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ సేంద్రియ విశిష్ట పోషకాల సాంద్రతను వెలుగులోకి తెచ్చిన తొలి పరీక్ష! సేంద్రియ ఆహారంలో రసాయనాల అవశేషాలు ఉండవు కాబట్టి ఆరోగ్యదాయకమని ఇప్పటి వరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే, మనకు ప్రాణాంతక జబ్బులు రాకుండా అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అసమాన పోషకాల సాంద్రత(న్యూట్రిషన్ డెన్సిటీ) సేంద్రియ ఆహారంలో ఇంత ఇబ్బడి ముబ్బడిగా ఉందన్న వాస్తవం ఐఐíసీటీ శాస్త్రవేత్తల పరీక్షల్లో తాజాగా వెలుగులోకి రావడం కనువిప్పు కలిగించే విషయం. బహుశా మన దేశంలోనే ఇది మొదటిసారి కావచ్చు. సేంద్రియ ఆహారోత్పత్తులను భారీ మొత్తంలో ఏడాదిలో ఎక్కువ నెలల పాటు సాగు చేయడానికి తగిన సానుకూల పరిస్థితులు పారిశ్రామిక వ్యవసాయం సాగే ఇతర దేశాల్లో కన్నా మన దేశానికే ఎక్కువగా ఉన్నాయి. ఆరుగాలం స్వయంగా నడుము వంచి పనిచేసే 80% మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్న మన దేశానికి సేంద్రియ వ్యవసాయం బాగా నప్పుతుంది. మన ప్రజలందరికీ పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రతను ఇవ్వడంతోపాటు.. విదేశాలకు అమృతాహారాన్ని ఎగుమతి చేయగల సత్తా మన దేశానికి మాత్రమే ఉంది. అయితే, ప్రభుత్వాలు ఈ అద్భుత అవకాశాలను గుర్తెరిగి ఈ దిశగా పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఆసన్నమైంది.– చిట్టూరి సుబ్రహ్మణ్యం,ట్రస్టీ, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్ chbs@shanders.com