
సాక్షి, అమరావతి: మిల్లెట్స్–ఆర్గానిక్స్‌పై బెంగుళూరులో 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సేంద్రీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌కు బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది. ఈ నెల 5 నుంచి నిర్వహించిన ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలతో పాటు విదేశీ రైతులు తమ ఉత్పత్తులతో 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్ వాలిడేషన్ కమిటీ స్టాల్స్ ఏర్పాటు, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకొని బెస్ట్ స్టేట్ పెవిలియన్, పెస్ట్ స్టాల్ అవార్డులను ప్రదానం చేసింది.
అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టాల్స్‌కు ఈ అవార్డులు వరించాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయ స్వామి చేతుల మీదుగా రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్‌కు ఈ అవార్డులను ప్రదానం చేశారు. గతేడాది డిసెంబర్ 28–30 వరకు కేరళలో జరిగిన జాతీయ స్థాయి ఆర్గానిక్ ప్రదర్శనలో ఏపీకి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment