న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా క్యాపిటల్ ఫుడ్స్‌తోపాటు, ఆర్గానిక్ ఇండియా లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ. 7,000 కోట్ల సంయుక్త ఎంటర్‌ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. విడిగా క్యాపిటల్ ఫుడ్స్‌లో 100 శాతం వాటాను రూ. 5,100 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. హెల్త్ అండ్ వెల్‌నెస్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.
పూర్తి నగదు చెల్లింపు ద్వారా క్యాపిటల్ ఫుడ్స్ నుంచి తొలుత 75 శాతం వాటాను టీసీపీఎల్ చేజిక్కించుకోనుంది. తదుపరి 25 శాతం వాటాను మూడేళ్లలో సొంతం చేసుకోనుంది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీవీ) కుదుర్చుకున్నట్లు టీసీపీఎల్ వెల్లడించింది. ఇక ఫ్యాబ్ ఇండియా పెట్టుబడులున్న ఆర్గానిక్ ఇండియాను సైతం పూర్తి నగదు వెచి్చంచి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆర్గానిక్ ఇండియా ప్రధానంగా టీ, హెర్బల్ సప్లిమెంట్స్, ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ తదితర ఆర్గానిక్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కాగా.. తాజా కొనుగోళ్లతో వేగవంత వృద్ధిలో ఉన్న అత్యంత పోటీ కలిగిన ఎఫ్‌ఎంసీజీ రంగంలో టాటా కన్జూమర్ మరింత బలపడేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment