సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్‌లో నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..?
కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్‌లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు.
ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్‌లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి.
సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు.
(చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment