
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.
హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్‌లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’
Comments
Please login to add a commentAdd a comment