chityal
-
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
పర్వతారోహణలోనే పరలోకాలకు.. నల్లగొండ యువకుడు మృతి..
చిట్యాల: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే చిన్ననాటి కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల ఉపేందర్, ఉమ దంపతులు 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సాయినగర్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఓ కూతురుతో పాటు కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(32) ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతితో వివాహం జరిగింది. 2నెలలు శిక్షణ పొంది.. రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అసోంలో రెండు నెలల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. ఈ నెల 3వ తేదీన మరికొంత మంది పర్యాతారోహకులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. ఖాట్మండు నుంచి వాహనంలో సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని సల్లేరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పది రోజుల పాటు ప్రయాణించి 4,910 మీటర్ల ఎత్తులో ఉండే లోబూచే పర్వతాన్ని ఈ నెల 21న చేరుకున్నాడు. అక్కడ సీప్ర లాడ్జిలో బసచేశాడు. ఇక్కడి నుంచి మరో 600 మీటర్లు ట్రెక్కింగ్(పర్వతారోహణ) చేస్తే రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపు(5,500 మీటర్ల దూరం) చేరుకునేవాడు. అయితే, ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వాతావరణం అనుకూలించక రాజశేఖర్‌రెడ్డి లాడ్జిలోనే ఉండిపోయాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఈ నెల 22న రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, మృతదేహాన్ని అక్కడి అధికారులు నేపాల్‌లోని ఖాట్మండు వరకు తీసుకువచ్చారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సోమవారం వరకు రాజశేఖర్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుందని, సాయినగర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు
సాక్షి, చిట్యాల : నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన శీలం సదయ్య పశువుల కాపరీగా పని చేస్తున్నాడు. ఆయనకు రెండు గదుల రేకుల ఇల్లు ఉంది. అందులో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉంది. ఇటీవల విద్యుత్ శాఖ సిబ్బంది రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. ఏకంగా రూ.1.80 లక్షల బిల్లును చూసి హడలెత్తిపోయిన సదయ్య.. నాలుగు రోజులుగా కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. అయినా తనను పట్టించుకున్నవారే లేరని, విద్యుత్ ఏఈకి ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
బాలల సంఘం నుంచి దళ నేతగా..
చిట్యాల(భూపాలపల్లి) : పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పేదల రాజ్యం సిద్ధించాలనే లక్ష్యంతో చార్‌మజూందార్ ఏర్పాటు చేసిన పీపుల్స్‌వార్ గ్రూపు లో చేరి 18 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసిన రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అలి యాస్ శ్రీను(40) ఉద్యమ ప్రస్థానం మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విజేందర్ మరణవార్త పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి అహల్య సొమ్మసిల్లిపోయింది. తమ్ముడు, కుమార్తె కన్నీటిపర్యంతమయ్యారు. ఉద్యమానికి ఊపిరి ‘చల్లగరిగె..’ చిట్యాల మండలంలో వెలిశాల తర్వాత చల్లగరిగె గ్రామం అప్పటి పీపుల్స్‌వార్‌కు ఊపిరిగా మారింది. ఈ గ్రామాల్లో 1200 మంది మాజీలు ఉన్నారు. 12 మంది అజ్ఞాతంలోకి వెళ్లగా కొందరు లొంగిపోయారు. అందులో దూడపాక మధు, పోశాల తిరుపతి, గోల్కోండ రమేష్, గంగరబోయిన స్వామి, రౌతు విజేందర్ మృతిచెందారు. విజేందర్ కుటుంబ నేపథ్యం మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన రౌతు అహల్య–నర్సింహారాము లు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండవాడైన విజేందర్ స్థానిక హైస్కూల్లో పదవ తరగతివరకు చదువుకున్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ బావాలు వ్యక్తపరిచేవాడన్నారు. అదే గ్రామానికి చెందిన మరో అజ్ఞాత నక్సలైట్ సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి ఇద్దరు కలిసి గ్రామంలో పీపుల్స్‌వార్ సానుభూతిరులుగా వ్యవహరించి పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పకడ్భందీగా నిర్వహించేవారని మాజీలు చర్చించుకుంటున్నారు. బాలల సంఘం ఏర్పాటు విజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో 1990లో బాలల సంఘం ఏర్పాటు చేశారు. సుధాకర్, మరికొంత మందితో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఉద్యమించాడు. భూస్వాములను, గుత్త పంచాయతీలు చేసే వ్యక్తులను నిలదీసేవాడు. 1996లో రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లో ఆయన చురుకైన పాత్ర నిర్వహించినట్లు పోలీసుల రికార్డులో ఉంది. సారా ప్యాకెట్లు ధ్వంసం చేయడం, వాల్‌పోస్టర్లు వేయడం, ఎన్కౌంటర్లకు నిరసనగా బస్సుల దహనం, పలువురిని చితకబాదిన సంఘటనల్లో విజేందర్ ముఖ్యభూమికను పోషించినట్లు సమాచారం. పోలీసులకు, పాలకులకు భూస్వాములకు ఆయన కంటిలో నలుసులా మారాడు. 1997లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమ నేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం విజేందర్, సుధాకర్‌ను ఆజ్ఞాత ఉద్యమం వైపు నడిపించిందని మాజీలు తెలిపారు. 31 డిసెంబర్ 2000లో విజేందర్ అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపులో చేరాడు. అంచలంచెలుగా ఎదిగిన విజేందర్ పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అంచలంచెలుగా ఎదిగాడు. ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కడారి రాములుఅలియాస్ బాలన్నకు అంగరక్షకుడి పనిచేశాడు. ఆదిలాబాద్, సిరొంచ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశాడు. ప్రస్తుతం గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. దళ సభ్యురాలు రజితను వివాహం చేసుకోగా పాప జన్మించడంతో చల్లగిరగెలోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. ప్రస్తుతం రమ్య 8వ తరగతి చదువుతోంది. విజేందర్ కుటుంబానికి పోలీసుల చేయూత.. అజ్ఞాతంలో ఉన్న విజేందర్ కుటుంబానికి పోలీసులు అన్నివిధాలుగా చేయూతనిచ్చారు. అతడు లొంగిపోయేలా చూడాలని సీఐ గండ్రతి మోహన్ తల్లిదండ్రులకు, విజేందర్ కుమార్తె రమ్యకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. బియ్యం, దుస్తులు అందజేశారు. విజేందర్ తండ్రి 9 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోతే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రమ్యను కస్తూర్బాగాందీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించారు. ఇంకా అజ్ఞాతంలో ముగ్గురు.. ఉత్తర తెలంగాణ ఉద్యమానికి చిట్యాల ఏరియా ఒకప్పుడు వెన్నుదన్నుగా నిలిచింది. వెలిశాల గ్రామం ఉద్యమానికి ప్రయోగశాలగా మారింది. ఇంటికో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు విప్లవ బాట పట్టారు. ఒకే కుటుంబం నుంచి గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేష్, అశోక్ అలియాస్ ఐతు ఉద్యమానికి ఇరుసుగా మారి ఉత్తర తెలంగాణ వరకు విస్తరింపచేశారు. కేంద్ర కమిటీ సభ్యులుగా రాణిస్తు ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అజ్ఞాతంలో వెలిశాలకు చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్(చర్చల ప్రతినిధి), చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి, రామచంద్రాపూర్‌కు చెందిన క్యాతం రాజు కొనసాగుతున్నారు. అన్న తిరిగొస్తాడనుకున్న.. అన్న 18 ఏళ్ల క్రితం ఇల్లు ఇడిసి పెట్టి పోయిండు. ఇప్పటి వరకు ఇటు రాలేదు. తిరిగొస్తాడని ఎదురు చూస్తానం. అన్న కోసమే నాన్న బాధపడుతు చనిపోయిండు. అమ్మ అనారోగ్యంతో ఉంది. అన్న కుమార్తె రమ్యను కూలి చేసి పోషిం చుకుంటున్నం. అన్న చావకుండ ఉండాలి. బ్రతికి తిరిగి రావాలి. – కుమారస్వామి, మృతుడి సోదరుడు -
ట్రావెల్స్ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం
సాక్షి, నల్లగొండ : ఓ బస్సులో డబ్బులు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తుంటే అదే బస్సులో కోటి రూపాయలు పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల శివారులోని ఓ హోటల్ ముందు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు అదే బస్సులో రూ.17లక్షలు చోరీ జరిగాయంటూ ఫిర్యాదు అందింది. వాటి కోసం వెతుకుతుంటే వాటి కోసం వెతుకుతుంటే బస్ టాప్ పైన ఈ డబ్బు కనిపించింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖకు ఈ డబ్బులు అప్పగించనున్నట్టు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ బస్సు హైద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నది. -
మంచు.. వాహనం ఢీకొని సైక్లిస్టు దుర్మరణం
సాక్షి, చిట్యాల: మంచు కారణంగా రహదారిపై ముందు ఉన్నది ఏదీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లిలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. సైకిల్‌పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని కంకల వెంకటేశ్(30)గా గుర్తించారు. -
నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్
చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం కమల మెమోరియల్ హై స్కూల్లో శుక్రవారం ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కర్రతో, చేతితో ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టింది. మండలంలోని నవాబుపేట శివారు చింతకుంటరామయ్యపల్లికి ఏలేటి లత, తిరుపతిరెడ్డిల కూతురు శ్రీనీత(4)ను ఈ ఏడాదే నర్సరీలో చేర్పించారు. శుక్రవారం క్లాస్‌రూంలో ఏడుస్తు న్న శ్రీనీ తను స్కూల్ ఇన్చార్జి రాజేశ్ కర్ర, చేతితో వీపుపై కొట్టాడు. టీచర్‌పై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెరుగు వెయ్యనందుకు .. చితక్కొట్టారు!!
-
చిట్యాల సొసైటీలో సిబ్బంది చేతివాటం
చిట్యాల, న్యూస్‌లైన్ : నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు చిట్యాల సొసైటీ ఉద్యోగులు. పంటల సాగుకోసం నిరుపేద రైతులకు అందించాల్సిన రుణాలు, మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బును వారు పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి, అటెండర్ రామనాథంలు ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ. 3 లక్షలను స్వాహా చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేసినందుకు పాలకవర్గం వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ సమక్షంలో డెరైక్టర్లందరూ బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బులు రూ.3 లక్షలను కాజేసిన కార్యనిర్వాహక కార్యదర్శి, అటెండర్‌ను విధుల నుంచి తొలగించాలని తీర్మానం చేసి డీసీసీబీ అధికారులకు పంపించడం గమనార్హం. కొనసాగుతున్న సస్పెన్షన్లు.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతి కూపంలో మునిగి తేలుతున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన ఉద్యోగు లు అక్రమాల పరంపరను కొనసాగిస్తున్నారు. బినామీ రైతులను సృష్టించి గతంలో రూ. 14 లక్షల పంట రుణాలు తీసుకున్నందుకు సీఈఓ లింగమూర్తితోపాటు సిబ్బంది మొగిలి, రాజేం దర్, రామనాథం, రాజిరెడ్డిని జిల్లా అధికారు లు సస్పెండ్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 14 లక్షలను రికవరీ చేశారు. ఇది లా ఉండగా, ఎరువు బస్తాల కోసం రైతుల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను ఉద్యోగులు ఇంతవరకు వారికి బస్తాలు ఇవ్వలేదు. ఈ విషయంలో ఇద్దరు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, సొసైటీ పరిధిలో లేని 26 మంది రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు చెల్లించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుణాలు చెల్లించినప్పటికీ వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.3 లక్షలను సీఈఓ మొగిలి, సబ్‌స్టాఫ్ రామనాథం స్వాహా చేయడం సొసైటీలో కలకలం రేపింది. డిఫాల్ట్ సంఘంగా గుర్తింపు.. చిట్యాల సొసైటీ.. జిల్లా సహకార సంఘంలో డిఫాల్ట్‌గా గుర్తింపు పొంది సభ్యత్వాన్ని కోల్పోయింది. సొసైటీ పరిధిలో రూ. 4 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు సొసైటీ చైర్మన్ ఓటు వేసే అర్హతను కూడా కోల్పోయారు. దీంతోపాటు రైతులకు ఇచ్చిన పంట రుణాలను వసూలు చేయడంలో ఈ సొసైటీ జిల్లాలో వెనకబడిపోయింది. ఈ విషయమై చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సొసైటీ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన పంట రుణాలను సిబ్బంది సక్రమంగా వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. -
మొదటికే మోసం తెచ్చిన ఐడియా