ట్రావెల్స్‌ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం | Rs.1 crore seized from Travels bus | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం

Published Tue, Jan 30 2018 12:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Rs.1 crore seized from Travels bus - Sakshi

సాక్షి, నల్లగొండ : ఓ బస్సులో డబ్బులు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తుంటే అదే బస్సులో కోటి రూపాయలు  పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల శివారులోని ఓ హోటల్ ముందు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు అదే బస్సులో రూ.17లక్షలు చోరీ జరిగాయంటూ ఫిర్యాదు అందింది. వాటి కోసం వెతుకుతుంటే వాటి కోసం వెతుకుతుంటే బస్ టాప్ పైన ఈ డబ్బు కనిపించింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖకు ఈ డబ్బులు అప్పగించనున్నట్టు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ బస్సు హైద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement