Sieged
-
వేబ్రిడ్జి మోసాలపై తూనికలశాఖ కొరడా!
సాక్షి, హైదరాబాద్: వేబ్రిడ్జిల్లో మోసాలపై తూనికలు కొలతలశాఖ కొరడా ఝళిపించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తూనికల కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘వేబ్రిడ్జిలో తూకం తగ్గుతోంది’ అని ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తూకంలో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జి, సాగర్ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్ వే బ్రిడ్జి, కర్మన్‌ఘాట్‌లోని ఫైసల్ వేబ్రిడ్జి, శంషాబాద్‌లోని రామధర్మకాంట, గోల్డెన్ వేబ్రిడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని గుర్తించారు. జై హనుమాన్ వేబ్రిడ్జి వద్ద తనిఖీలో యజమాని, కంప్యూటర్ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగు లోకి రావడంతో అధికారులు నివ్వెరపోయారు. దీనిపై వారు మరింత లోతుగా తనిఖీలు చేశారు. కంప్యూటర్లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే వేబ్రిడ్జి తూకం చూపించేట్టుగా చేయడాన్ని అధికారులు గుర్తించారు. -
గంజాయి విలువ రూ.1.10కోట్లు
ఖమ్మంక్రైం: ఒడిశా రాష్ట్ర సరిహద్దులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి గంజాయితో వెళ్తున్న రెండు లారీలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్, పోలీసులు గురువారం పట్టుకున్న విష యం విదితమే. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర సరిహద్దుల నుంచి ఖమ్మం మీదుగా రాజస్థాన్‌కు అక్రమంగా గంజా యి రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకున్న ఖమ్మంరూరల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని ఆపి తనిఖీ చేస్తుండగానే పైలెట్‌గా వెళ్తున్న మరో వాహనంలో ముగ్గురు నిందితులు పారిపోయారు. తనిఖీ చేసిన లారీపై భాగంలో పోలీసులు ఎక్కి చూడగా.. బస్తాలలో గంజాయిని తరలిస్తున్నట్లు బయట పడింది. లారీలో ఉన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన గుగులోతు వెంకన్న, రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్, క్లీనర్ అశోక్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఒడిశా రాష్ట్ర సరిహద్దుల నుంచి ఈ గంజాయిని రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. 460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.46 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి బొగ్గు లారీలో అనుమానం రాకుండా భారీ ఎత్తున గం జాయిని తరలిస్తున్నట్లు ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వీఎం బంజర పోలీసులకు సమాచారం అందడంతో వారు లారీని ఆపి సోదాలు చేశారు. ఈ లారీలో పైన, కింద బొగ్గు వేసి ఉండగా అనుమానం రాకుండా మధ్యలో గంజాయి బస్తాలను పెట్టారు. పోలీసులు 31 గంజాయి బస్తాలను బయటకు తీసి చూడగా 646 కేజీలు ఉంటాయని, వీటి విలువ రూ.64,60 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా నర్సిపట్నానికి చెందిన దేశపతి నాయుడు కర్ణాటకకు చెందిన శివాజి, విశ్వనాథ్‌లతో ఒప్పందం చేసుకున్న ప్రకారం ముంబ యి తరలిస్తున్నామని పట్టుపడిన లక్ష్మణ్ రాథోడ్, జాఫర్లు తెలిపారు. వీరు మొదట లారీని హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడి గంజాయిని అన్లోడ్ చేసి అక్కడికి వచ్చే దేశపతినాయుడు, శివాజి, విశ్వనాథ్‌లు గంజాయిని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. వీరి వద్ద 2 సెల్ఫోన్లను స్వాధీన పరచుకున్నట్లు, రెండు లారీలను సీజ్ చేసి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. రూరల్ ప్రాంతంలో పైలెట్ వాహనంలో పారిపోయిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారని, అరెస్టయిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఇంత భారీస్థాయిలో గంజాయి పట్టుపడటానికి కారణమైన ఖమ్మం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రెహమాన్, రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, ఇతర సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ చేయించకపోతే వాహనం సీజ్
అనంతపురం సెంట్రల్: శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వాహనాలను త్వరలోనే సీజ్ చేయనున్నట్లు ఉప రవాణా కమిషనర్ సుందర్‌వద్దీ హెచ్చరించారు. గురువారం ఆయన రవాణాశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,593 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సీఎఫ్‌ఎస్‌టి సైట్ మూసివేయనున్నామనీ, దీంతో ఆ వాహనాలకు భవిష్యత్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నారు. అందువల్ల ఇంకా వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వారంతా ఏప్రిల్ 5లోపు చేయించాలన్నారు. లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీధర్, వివిధ షోరూంల డీలర్లు పాల్గొన్నారు. -
ట్రావెల్స్ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం
సాక్షి, నల్లగొండ : ఓ బస్సులో డబ్బులు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తుంటే అదే బస్సులో కోటి రూపాయలు పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల శివారులోని ఓ హోటల్ ముందు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు అదే బస్సులో రూ.17లక్షలు చోరీ జరిగాయంటూ ఫిర్యాదు అందింది. వాటి కోసం వెతుకుతుంటే వాటి కోసం వెతుకుతుంటే బస్ టాప్ పైన ఈ డబ్బు కనిపించింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖకు ఈ డబ్బులు అప్పగించనున్నట్టు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ బస్సు హైద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నది. -
60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కావలిరూరల్ : అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యంను గ్రామస్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కావలి రూరల్ ఎస్ఐ జి.పుల్లారావు సమాచారం మేరకు.. మండలంలోని పెదపట్టపుపాళెంలో రాములవారి గుడి వద్ద ఆదివారం అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీని గ్రామస్తులు గుర్తించి డ్రైవర్‌ను విచారించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లారీని అడ్డుకుని కావలిరూరల్ పోలీసులకు సమాచారమందించారు. ఎస్ఐ జి.పుల్లారావు గ్రామానికి చేరుకుని రేషను బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే డ్రైవర్ వెంకటేశ్వర్లు పరారీ కాగా, క్లీనర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా రేషన్ బియ్యంను ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి రామాయపట్నం, చెన్నాయపాళెం, తుమ్మలపెంట మీదుగా బిట్రగుంటకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నకిలీ మ్యాంగో జ్యూస్ తయారీ కేంద్రం సీజ్
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్‌లో నకిలీ మ్యాంగోజ్యూస్ తయారు చేస్తున్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.10 లక్షల నకిలీ జ్యూస్‌ను సీజ్ చేశారు. కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.