60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Published Mon, Oct 10 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
కావలిరూరల్ : అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యంను గ్రామస్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కావలి రూరల్ ఎస్‌ఐ జి.పుల్లారావు సమాచారం మేరకు.. మండలంలోని పెదపట్టపుపాళెంలో రాములవారి గుడి వద్ద ఆదివారం అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీని గ్రామస్తులు గుర్తించి డ్రైవర్‌ను విచారించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లారీని అడ్డుకుని కావలిరూరల్ పోలీసులకు సమాచారమందించారు. ఎస్‌ఐ జి.పుల్లారావు గ్రామానికి చేరుకుని రేషను బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే డ్రైవర్ వెంకటేశ్వర్లు పరారీ కాగా, క్లీనర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా రేషన్ బియ్యంను ప్రకాశం జిల్లా ఉలవపాడు నుంచి రామాయపట్నం, చెన్నాయపాళెం, తుమ్మలపెంట మీదుగా బిట్రగుంటకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement