జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.
గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment