రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
రూ.25 కోట్లతో డబుల్‌రోడ్డు పనులకు శంకుస్థాపన
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్‌రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రం
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.
ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.
6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్‌గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు.
ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment